భారత వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించేందుకు నౌకా దళం కొన్ని యుద్ధ నౌకలను పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాలకు పంపింది. ఈ చర్యకు ‘ఆపరేషన్ సంకల్ప్’ అనే పేరు పెట్టింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో ఇటీవల కొన్ని ఆయిల్ ట్యాంకర్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ‘ఐఎన్ఎస్ చెన్నై’, ‘ఐఎన్ఎస్ సునైన’లను గల్ఫ్ ప్రాంతానికి పంపినట్టు భారత నౌకాదళం అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. భారత నౌకలకు భద్రతకోసం వైమానిక నిఘా కూడా ఉంటుందని తెలిపారు.
2019-06-20 Read Moreఅమెరికా డ్రోన్ కూల్చివేతపై ఇరాన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇరాన్ అధికారిక ఛానల్ ‘ప్రెస్ టీవీ’ దాన్నిప్రసారం చేసింది. ఇరాన్ దళాలు భూమిపై నుంచి గాల్లోకి ప్రయోగించే (ఎస్ఎఎం) మిసైల్ ను వదలడం, అది అమెరికా నిఘా డ్రోన్ ను పేల్చివేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోలో.. 31 సెకన్లపాటు కూల్చివేత ఫుటేజీ, తర్వాత 10 సెకన్లపాటు డ్రోన్ ప్రయాణమార్గాన్ని సూచించే యానిమేషన్ ఉన్నాయి.
2019-06-20తమ దేశ సరిహద్దుల లోపలికి వస్తే తిరిగి వెళ్లలేరని ఇరాన్ ఆర్మీ అమెరికాకు స్పష్టం చేసింది. అమెరికా నావికా దళానికి చెందిన నిఘా డ్రోన్ కూల్చివేత తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డు కార్ప్స్ కమాండర్ ఇన్ చీఫ్ హొస్సేన్ సలామి మాట్లాడారు. ‘మా సరిహద్దులే మాకు రెడ్ లైన్. ఓ శత్రువు మా సరిహద్దులను అతిక్రమిస్తే తిరిగి వెళ్లలేరు. ధ్వంసం చేస్తాం. మా శత్రువులు భద్రంగా ఉండాలంటే.. మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ఒక్కటే దారి. డ్రోన్ కూల్చివేతే అమెరికాకు మేమిచ్చే స్పష్టమైన సందేశం’ అని ఆయన ఉద్ఘాటించారు.
2019-06-202019-20లో ఇండియా స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) వృద్ధి రేటు అంచనాను డి.బి.ఎస్. బ్యాంకు తగ్గించింది. వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఇంతకు ముందు అంచనా వేయగా..6.8 శాతానికి పరిమితమవుతుందని తాజాగా గురువారం ఒక నివేదికలో పేర్కొంది. ఎగుమతులకు ఎదురవుతున్న ప్రతిబంధకాలను ఇందుకు ఓ కారణంగా చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గి 5.25 శాతానికి చేరుతుందని డిబిఎస్ గ్రూపు రీసెర్చ్ ఆర్థికవేత్త రాధికారావు అంచనా వేశారు.
2019-06-20 Read Moreతమ నిఘా డ్రోన్ ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ గగనతలంలోకి రావడంవల్లనే కూల్చేశామని ఇరాన్ ప్రకటించగా, తమ డ్రోన్ అంతర్జాతీయ గగనతలం పరిధిలోనే ఉందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. డ్రోన్ కూల్చివేతతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే.. గురువారం డ్రోన్ కూల్చివేతపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
2019-06-20అమెరికాతో ఉద్రిక్తతల నడుమ ఇరాన్ తొలి దెబ్బ కొట్టింది. కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నిఘా డ్రోన్ ఒకదాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డులు గురువారం కూల్చవేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన మానవ రహిత ఆర్.క్యు-4ఎ గ్లోబల్ హాక్ నిఘా వాహనం ఆ దేశపు డ్రోన్ ఆర్మీలో కీలకమైనది. ఈ డ్రోన్ రెక్కల వెడల్పు బోయింగ్ 737 విమానంతో సమానం. ఖరీదు రూ. 700 కోట్లకు పై మాటే..! భూమిపై నుంచి విమానాలపైకి ప్రయోగించే ఓ ఇరాన్ మిసైల్ అమెరికా మానవ రహిత వాహనాన్ని నేలకూల్చింది.
2019-06-20 Read Moreడిస్మిస్ అయిన ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ కు ఓ గుజరాత్ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది. 1990లో ఆయన జాంనగర్ జిల్లా అదనపు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో నమోదైన ‘కస్టోడియల్ డెత్’ కేసులో కోర్టు ఈమేరకు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఆయన మరొక కేసులో జైల్లో ఉన్నారు. వివాదాస్పద అధికారి భట్.. 2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఉందంటూ 2011లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
2019-06-20 Read Moreటీడీపీ కాపు నేతల సమావేశం పార్టీ మారడానికి ఉద్ధేశించింది కాదని మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో తమ ఓటమికి కారణాలను, పార్టీ నాయకత్వంతో చర్చించాల్సిన అంశాలను విశ్లేషించామని వారు చెప్పారు. సుమారు గంటా 40 నిమిషాలు చర్చించామని, ఈ సమావేశం కాకతాళీయంగా ఈ రోజే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో తమ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళారన్న జ్యోతులు, వారిని తిరిగి టీడీపీవైపు ఎలా తీసుకురావాలనే ఆలోచన చేశామని చెప్పారు.
2019-06-20తమ రాజ్యసభ సభ్యులు బీజేపీ పక్షంలో ‘విలీనం’ కావడం ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, పార్టీ మరో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర చెప్పారు. లోక్ సభలో పార్టీ నేత రామ్మోహన్ నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిలతో కలసి వారు గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటరీ పార్టీ నేతనైన తనకు చెప్పకుండా వాళ్ళు సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని, పార్లమెంటరీ పార్టీ లెటర్ హెడ్ పై తీర్మానం ఎలా చేస్తారని గల్లా ప్రశ్నించారు.
2019-06-20రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీ మారుతున్న రోజే కాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కలకలం రేపింది. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాపు, బలిజ వర్గాలకు చెందిన 13 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కాకినాడలో సమావేశమయ్యారు. పార్టీ ఓటమికి, కాపు నాయకత్వం దెబ్బతినడానికి ప్రధానంగా అధినాయకత్వం అనుసరించిన విధానాలే కారణమని ఈ సమావేశంలో ఎక్కువమంది అభిప్రాయపడినట్టు సమాచారం.
2019-06-20