వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన భార్య భారతీరెడ్డి రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో నిన్న (శనివారం) ప్రచారం చేసిన భారతి.. ఆదివారం కడప జిల్లాలోనే జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని భారతి చెప్పారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఆమె వ్యాఖ్యానించారు.
2019-03-31సోమవారం మరోసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా రాజమండ్రి వస్తున్న మోదీకి సిగ్గుందా? అని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రానికి ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అరకొరగా అమలు చేశారని మండిపడ్డారు. ఆదివారం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
2019-03-31ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 22 లక్షల ఖాళీలను 2020 మార్చినాటికి భర్తీ చేయిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు, ఈ ఖాళీల భర్తీతో లంకె పెడతామని రాహుల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ 22 లక్షల ఖాళీలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలవా.. లేక కేంద్ర ప్రభుత్వంలోనివి కూడా కలిపా? అన్న విషయాన్ని రాహుల్ స్పష్టం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీలను కూడా భర్తీ చేయిస్తామని కేంద్రంలో అధికారంకోసం ప్రయత్నిస్తున్న రాహుల్ చెప్పడం విశేషమే.
2019-03-31చంద్రబాబు హయాంలో గత ఐదేళ్లలో ఆరు వేల స్కూళ్లు మూతపడ్డాయని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలే మిగలవని ప్రతిపక్ష నేత జగన్ ఉద్ఘాటించారు. ఊరూరా నారాయణ స్కూళ్లు వెలుస్తాయని, అక్కడ ఎల్.కె.జి. చదవాలన్నా లక్ష రూపాయలు కట్టవలసి వస్తుందని చెప్పారు. శనివారం అనంతపురం ఎన్నికల సభల్లో జగన్ మాట్లాడారు.
2019-03-30‘‘ఆంధ్రప్రదేశ్ లోనే అందరికీ ఉపాధి కల్పిస్తా. నేను కాకపోతే కోడికత్తి పార్టీ చేయగలుగుతుందా? సినిమా నటులు చేస్తారా? నరేంద్ర మోదీవల్లనే కాలేదు. వీళ్లేం చేస్తారు’’.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ అహ్మదాబాదులో ఏం చేశారో..తాను హైదరాబాదులో ఏం చేశానో చర్చకు సిద్ధమన్నారు. పసుపు కుంకుమ పైన మాట్లాడే అర్హత ప్రతిపక్షానికి లేదన్నారు. ఆరోగ్యం, విద్యపై ప్రజల ఖర్చును ఈసారి పూర్తిగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఉద్ధానంలో కిడ్నీ రోగాల నివారణకు అక్కడే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానన్నారు.
2019-03-30ఐదేళ్ళ పాలన తర్వాత చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయ్యారని, అదే సమయంలో అత్యంత పేద రైతులు రాష్ట్రంలోనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. ‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు. చంద్రబాబు కొడుకుకు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేశాడు. దీన్నే ‘మీ భవిష్యత్తుకు తన భరోసా’ అని చెబుతాడు’’ అని జగన్ శనివారం కర్నూలు, అనంతపురం ఎన్నికల సభల్లో విమర్శించారు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? అని ప్రశ్నించారు.
2019-03-30గుజరాత్ లోని గాంధీ నగర్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీతో పాటు ఎప్పుడూ విమర్శించే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీ నగర్ నుంచి ఇంతవరకు సీనియర్ బీజేపీ నేత ఎల్.కె. అద్వానీ ప్రాతినిధ్యం వహించగా ఈసారి ఆయనకు సీటు ఇవ్వకుండా షా స్వయంగా పోటీ చేస్తున్నారు. అహ్మదాబాద్ నగరంలో 4 కిలోమీటర్లమేరకు రోడ్ షో నిర్వహించి షా బలప్రదర్శన చేశారు.
2019-03-30 Read Moreబాలాకోట్ వైమానిక దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ యుద్ధ విమానాల మధ్య డాగ్ ఫైట్ జరిగిన రోజు (ఫిబ్రవరి 27)నే శ్రీనగర్ సమీపంలో ఒక ఎంఐ17 వి5 హెలికాప్టర్ కూలిపోయింది. ఆరుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, నేలపై ఉన్న ఒక పౌరుడు మరణించిన ఈ ప్రమాదం ఒక మిస్టరీగా మారింది. విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. హెలికాప్టర్ కూలడానికి కొద్దిసేపటి ముందు ఇండియన్ క్షిపణి రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణిని సంధించినట్టు తేలింది. పాకిస్తాన్ యుఎవి అనుకొని మనవాళ్ళు పొరపాటున క్షిపణిని సంధించి ఉండొచ్చని భావిస్తున్నారు.
2019-03-29సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం 37 మంది లాయర్లను సీనియర్ అడ్వకేట్లుగా గుర్తించింది. వారిలో ఆరుగురు మహిళలున్నారు. మాధవీ దివాన్, మేనకా గురుస్వామి, అనితా షెనాయ్, అపరాజితా సింగ్, ఐశ్వర్య భాటి, ప్రియా హింగోరాని తాజాగా సీనియర్ అడ్వకేట్లుగా గుర్తింపు పొందారు. అంతకు ముందు 8 మంది మహిళా న్యాయవాదులు ఈ కేటగిరిలోకి చేరారు. సీనియర్ అడ్వకేట్ల జాబితాలో చేరిన మొదటి మహిళ ఇందు మల్హోత్రా. సుప్రీంకోర్టు ప్రారంభమైన 57 సంవత్సరాల తర్వాత 2007లో తొలిసారి మహిళకు ఈ గుర్తింపు దక్కింది. ఇందు మల్హోత్రా ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు.
2019-03-29 Read Moreఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వివిపిఎటి) స్లిప్పుల లెక్కింపు పద్ధతిని ఈ దశలో మార్చడం సాధ్యం కాకపోవచ్చని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 50 శాతం వీవీ పాట్ స్లిప్పులను లెక్కించాలంటే కనీసం 5 రోజులు పడుతుందని, ఫలితాల విడుదలకు 6 రోజులు పడుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక పోలింగ్ స్టేషన్ లోని వీవీ పాట్ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తుండగా, కనీసం 50 శాతం లెక్కించాలని 21 ప్రతిపక్ష పార్టీలు కోరాయి. ఈ సూచన సమంజసంగానే ఉందని సుప్రీం అభిప్రాయపడింది.
2019-03-30 Read More