ఇరాక్ లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ ఈనెల 8న జరిపిన దాడిలో 11 మంది సైనికులు గాయపడ్డారని అమెరికా మిలిటరీ శుక్రవారం తెలిపింది. తమ కుర్ద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడికి దిగిన సంగతి తెలిసిందే. అయితే, దాడి జరిగిన రోజు ఎవరూ గాయపడలేదని వార్తలు వచ్చాయి.
2020-01-17మరో అమెరికన్ కంపెనీ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించింది. గూగుల్ మాతృ సంస్థ ‘అల్ఫాబెట్’ గురువారం ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిన నాలుగో అమెరికన్ కంపెనీగా రికార్డులకెక్కింది. యాపిల్, అమెజాన్ 2018లో, మైక్రోసాఫ్ట్ 2019 ఏప్రిల్ మాసంలో ఈ ఘనత సాధించాయి. అయితే, అమెజాన్ విలువ ట్రిలియన్ డాలర్లపైన నిలబడలేదు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘అల్ఫాబెట్’ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి షేర్ల విలువ బాగా పెరిగింది.
2020-01-17భారతీయ టెలికమ్యూనికేషన్స్ ఉపగ్రహం జిశాట్-30 విజయవంతంగా నింగికి ఎగసింది. ఫ్రెంచ్ గుయానాలో లోని కౌరు ప్రయోగ వేదిక నుంచి ఏరియానె-5 రాకెట్ శుక్రవారం ఉదయం జిశాట్-30ని మోసుకెళ్లింది. 38 నిమిషాల తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 3,357 కేజీల జిశాట్-30 ఉపగ్రహం కాలం తీరిన ఇన్సాట్-4ఎకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. కు-బ్యాండ్‌లో భారతీయ భూభాగాలను, సి-బ్యాండ్‌లో గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, ఇతర ఆసియా దేశాలను ఈ ఉపగ్రహం కవర్ చేస్తుంది.
2020-01-17 Read Moreషాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ) వార్షిక సమావేశంకోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఇండియా ఆహ్వానించనుంది. 8 సభ్య దేశాలు, మరో 4 పరిశీలక భాగస్వామ్య దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం చెప్పారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ ను ఆహ్వానిస్తున్నారా’’ అని విలేకరులు అడిగినప్పుడు ‘‘అవును’’ అని రవీష్ చెప్పారు. ఎస్.సి.ఒ. సమావేశానికి ఇండియా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.
2020-01-16 Read More2019లో చైనా జీడీపీ 6.1 శాతం పెరిగిట్టు ఆ దేశ గణాంకాల బ్యూరో శుక్రవారం ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇండియా వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమవుతుందన్న అంచనాల మధ్య చైనా జీడీపీ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. అయితే, గత 29 సంవత్సరాల్లో చైనాలో ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. జీడీపీ 6-6.5 శాతంగా ఉండాలని చైనా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగానే ఉంది.
2020-01-17ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకె శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్. తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలిలను ఎఐసిసి నియమించింది. ఈ ముగ్గురి ఎంపిక వ్యూహాత్మకంగా జరిగినట్టు చెబుతున్నారు. శైలజానాథ్ (అనంతపురం), తులసిరెడ్డి (కడప) రాయలసీమ వాసులు. మస్తాన్ వలి గుంటూరు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతు తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ మైనారిటీలు, దళితులపై ఫోకస్ పెట్టడం గమనార్హం.
2020-01-16రాజధాని అమరావతి పరిరక్షణకోసం తాము వీధి పోరాటానికి సిద్ధమని బిజెపి, జనసేన నేతలు ప్రకటించారు. గురువారం విజయవాడలో సమావేశమైన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు విలేకరులతో మాట్లాడారు. ‘3 రాజధానుల’ ఏర్పాటును ‘ఓ ఫాంటసీ’గా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. రాజధాని మార్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు.151 సీట్లు ఉన్నాయని ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవద్దని సిఎంను హెచ్చరించారు.
2020-01-16బిజెపి, జనసేన కలసి పని చేయాలని నిర్ణయించాయి. సందర్భం ప్రభుత్వంపై పోరాటమైనా.. ఎన్నికలైనా.. ఒకటే స్వరం వినిపించాలని నిశ్చయించాయి. గురువారం విజయవాడలో సమావేశమైన జనసేన, బిజెపి ముఖ్య నేతలు ‘‘మూడో ప్రత్యమ్నాయం’’ తామేనని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలసి వచ్చిన పవన్ కళ్యాణ్, గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ లతో భేటీ అయ్యారు.
2020-01-16ఆలోచనా స్వేచ్ఛ ఉన్నప్పుడే సైన్స్ వర్ధిల్లుతుందని నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం నుంచి అతి తక్కువ జోక్యం ఉన్నప్పుడే అది సంపద్వంతమవుతుంది’ అని ఉద్ఘాటించారు. బెంగళూరులో బుధవారం ‘‘సైన్స్-సమాజం’’ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ఆలోచన, అభిప్రాయాల వ్యక్తీకరణకు నిజమైన స్వేచ్ఛ, అతి తక్కువ సైద్ధాంతిక జోక్యం ఉన్నచోటనే సైన్స్ వర్ధిల్లుతుందన్నది నా నమ్మకం’’ అని వెంకట్రామన్ చెప్పారు.
2020-01-16కలసి పని చేయాలని నిర్ణయించుకున్న జనసేన, బిజెపి నేతలు గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై ఉద్యమం, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన ఎజెండాగా చర్చిస్తున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు సునీల్ దియోధర్, నేతలు పురందేశ్వరి, జి.వి.ఎల్. నరసింహరావు సమావేశంలో ఉన్నారు.
2020-01-16