5-0 తేడాతో అసాధారణ స్థాయిలో న్యూజీలాండ్ టి20 సిరీస్ దక్కించుకున్న ఇండియా, వన్డే సిరీస్ తొలి మ్యాచులో ఓడింది. ఛేజింగ్ లో 348 పరుగుల భారీ స్కోరు సాధించి న్యూజీలాండ్ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో 1-0 తేడాతో ముందడుగు వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. న్యూజీలాండ్ తన లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
2020-02-05అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదును తిరిగి నిర్మించడంకోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ఉత్తరప్రదేశ్ మంత్రి శ్రీకాంత్ శర్మ బుధవారం ప్రకటించారు. ఫైజాబాద్ జిల్లా సోహావాల్ తెహసీల్ పరిధిలో ధన్నిపూర్ గ్రామంలో భూమిని కేటాయించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ గ్రామం అయోధ్య పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రిపబ్లిక్ టీవీ మాత్రం వారణాసిలోని ‘ధన్నిపూర్’లో భూమి కేటాయించనున్నట్టు రాసింది. ఇది అయోధ్యకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంటుంది.
2020-02-05ఏపీకి ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వాలని మాట్లాడితే రాజకీయంగా ఇబ్బంది పడతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు హెచ్చరించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, దాన్ని మళ్లీ తెరపైకి తెమ్మని సిఎం కోరుతున్నారని, ఆ అవకాశం లేదని.. ఆలోచన కూడా కేంద్రానికి లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. లేని అంశంపై రాజకీయం చేస్తే అది జగన్ మెడకే చుట్టుకుంటుందని వ్యాఖ్యానించారు.
2020-02-05అయోధ్యలోని ‘బాబ్రీ మసీదు-రామజన్మభూమి’ స్థలం మొత్తాన్ని (67.703 ఎకరాలు) కొత్తగా ఏర్పాటు చేయనున్న ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. వివాదాస్పద స్థలంలో రామజన్మభూమి నిర్మించాలని, మసీదుకోసం అయోధ్యలోనే వేరొక చోట 5 ఎకరాలు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ ఈ అంశంపై నిర్ణయాలు తీసుకుంది.
2020-02-05రాజధానిపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం ఏమీ కాదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని బీజేపీ తీర్మానం చేసిందని గుర్తు చేసిన జీవీఎల్, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మాత్రం కేంద్రం అందుకు అనుగుణంగా నోటిఫై చేస్తుందని స్పష్టం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని నిన్న కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో స్పష్టం చేసిన నేపథ్యంలో జీవీఎల్ బుధవారం ఈ అంశంపై మాట్లాడారు.
2020-02-05విశాఖపట్నంలో 4000 ఎకరాలు అమ్మి అభివృద్ధి చేస్తామని జగన్ ప్రభుత్వం అంటోందని, అలా చేసేది మూర్ఖులని మాజీ సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఎవరైనా భూమి అమ్మి తాగితే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. బుధవారం రాయపూడి గ్రామంలో మాట్లాడుతూ.. జగన్ నిర్ణయాలతో అమరావతితో పాటు రాష్ట్రం మొత్తం నష్టపోతోందని చంద్రబాబు విమర్శించారు. తమ హయాంలో విశాఖకు వచ్చిన కంపెనీలు ఇప్పుడు వెనక్కు వెళ్ళిపోయాయని చెప్పారు.
2020-02-05చట్టాలను గౌరవించేదే ప్రభుత్వమని, ఉల్లంఘించేది కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. అమరావతి నగర నిర్మాణంకోసం భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా చంద్రబాబు బుధవారం రాయపూడి గ్రామంలో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అమరావతి రాజధానిగా 2015 ఏప్రిల్ లోనే జీవో జారీ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.
2020-02-05అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు లెక్కలోవి కావని, దానికి మించి ఇంకా వస్తాయని తాను అనుకోవడంలేదని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంకా ఇస్తే మరో రూ. 1000 కోట్లకు మించకపోవచ్చని పేర్కొన్నారు. సిఎం బుధవారం విజయవాడలో ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా రూ. లక్షా 3 వేల కోట్లు అవసరమైనచోట తాను మరో ఆరేడు వేల కోట్లు ఖర్చు చేసినా...సముద్రంలో నీటి చుక్కలానే కనిపించదని పేర్కొన్నారు.
2020-02-05అమరావతిలో పెట్టాల్సిన రూ. లక్ష కోట్లలో 10 శాతం విశాఖపట్నంలో ఖర్చు చేస్తే పదేళ్ళకైనా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతుందని సిఎం వైఎస్ జగన్ చెప్పారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, నీరు వంటి ప్రాథమిక సదుపాయాలకే ఎకరానికి రూ. 2 కోట్ల చొప్పున ఖర్చవుతుందన్నారు. విశాఖ ఇప్పటికే ఏపీలో నెంబర్ 1 నగరమని, మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయని సిఎం చెప్పారు. బుధవారం విజయవాడలో ఓ కార్యక్రమంలో సిఎం మాట్లాడారు.
2020-02-05రాజధానిని విశాఖకు తరలిస్తున్నది నిధులు లేక కాదని, లక్ష కోట్ల రూపాయలు ఒక్కచోటే ఖర్చు చేయడం ఇష్టం లేక అని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ‘ద హిందూ’ పత్రిక బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సభికుడు అడిగిన ప్రశ్నకు ‘‘నా ప్రాధాన్యతలు వేరు... కరువు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటికి చాలా నిధులు అవసరం. రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నాం’’ అని జగన్ బదులిచ్చారు.
2020-02-05