తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దక్షిణాది రాష్ట్రాల యాత్రకు సిద్ధమయ్యారు. గత ఏడాది ‘ఫెడరల్ ఫ్రంట్’కోసం పలువురు నేతలను కలసిన కేసీఆర్, లోక్ సభ ఎన్నికలు ముగింపు దశకు వస్తున్నవేళ రాష్ట్రాలవారీగా నేతలతొ భేటీ కానున్నారు. సోమవారం కేరళతో మొదలు పెట్టి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత తూర్పు, ఉత్తర భారత దేశాలకు కూడా ఆయన వెళ్తారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సమావేశం కానున్నారు.
2019-05-06‘‘ఫని’’ తుపాను తాకిడికి తీవ్రంగా నష్టపోయిన ఒడిషా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విరాళంగా రూ. 15 కోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇది కాకుండా మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన యంత్ర సామాగ్రి, మనుషులను పంపినట్టు చంద్రబాబు ఆదివారం చెప్పారు. తుపాను సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగం సంజీవనిలా ఉపయోగపడిందని సిఎం ప్రశంసించారు.
2019-05-05ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎల్.వి. సుబ్రహ్మణ్యం) తనకు రిపోర్టు చేయడంలేదంటూ ఇటీవల మండిపడిన సిఎం, బిజినెస్ రూల్స్ అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ సమావేశాలు, అధికారులతో సమీక్షలూ ఏర్పాటు నిర్వహిస్తుంటే పట్టించుకోని ఈసీ... తనను మాత్రం అడ్డుకుంటోందని చంద్రబాబు ఆక్షేపిస్తున్నారు.
2019-05-05ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. మోదీని ‘‘కాలం చెల్లిన ప్రధాని’’గా అభివర్ణిస్తూ ఆయన మాజీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని మమత అభిప్రాయపడ్డారు. రాజీవ్ గాంధీ మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేశారంటూ.. ఆయనపై మోదీ ఉపయోగించిన భాషను, అలాంటి ప్రకటన చేసిన దుస్సాహసాన్ని ఖండిస్తున్నట్టు ఆదివారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
2019-05-05 Read Moreతన తండ్రి రాజీవ్ గాంధీని ‘నెంబర్ 1 అవినీతిపరుడు’గా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం బదులిచ్చారు. ‘‘మోదీ జీ, యుద్ధం ముగిసింది. మీ కర్మఫలం ఎదురు చూస్తోంది. మీపైన మీకున్న అంతర్గత అభిప్రాయాన్ని నా తండ్రిపైకి నెట్టేయడం మిమ్మల్ని కాపాడలేదు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు. ఎన్నికల సభల్లో మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు.
2019-05-05 Read Moreఅతి తీవ్ర తుపాను ‘‘ఫని’’ ఎక్కువగా ప్రభావం చూపిన ఒడిషా రాష్ట్రంలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. వారిలో 21 మంది పూరీ పట్టణంలోనే మరణించారు. తుపాను పూరీ వద్దనే తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ తుపాను ఒడిషా రాష్ట్రానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. 10 వేల గ్రామాలు, 52 పట్టణ ప్రాంతాలపై ప్రభావం చూపింది. విద్యుత్, నీటి కొరతతో వేలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. పెద్ద సంఖ్యలో ఇళ్ళు, చెట్లు కూలిపోయాయి. కూలిన విద్యుత్ స్తంబాలు, మొబైల్ టవర్లను పునరుద్ధరించే పనిలో అధికార యంత్రాంగం ఉంది.
2019-05-05 Read More‘‘మోదీ ఐదేళ్ళ పాలన దేశంలోని యువత, రైతులు, వ్యాపారులకు.. ప్రతి ప్రజాస్వామిక వ్యవస్థకూ భీతావహమైనది, విధ్వంసకరమైనది’’ అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మోదీని సాగనంపే సమయం వచ్చిందని ఆయన ఉద్ఘాటించారు. మోదీ ప్రభుత్వానికి సమ్మిళిత అభివృద్ధిపై విశ్వాసం లేదని, ఈ కాలంలో అవినీతి అనూహ్యమైన రీతిలో పెరిగిందని మన్మోహన్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నోట్ల రద్దును అతి పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు.
2019-05-05 Read Moreదక్షిణ ఇజ్రాయిల్ భూభాగంపై గాజా మిలిటెంట్లు శనివారం రాకెట్ల వర్షం కురిపించారు. తొలుత 50 మిసైళ్ళు తమ భూభాగంపై పడ్డాయని చెప్పిన ఇజ్రాయిల్ చివరికి ఆ సంఖ్యను 200కు పెంచింది. కొన్ని డజన్ల రాకెట్లను ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ మిసైళ్ళు కూల్చేశాయి. శనివారమే ఇజ్రాయిల్ చేసిన ప్రతిదాడిలో గాజా ప్రాంతంలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. వారిలో తీవ్రవాదులెవరూ లేరు. ఒక పసిపాప, ఈ పాప తల్లి అయిన గర్భిణీ స్త్రీ, మరొక పౌరుడు మరణించారు. మరో 17మంది గాయపడ్డారు.
2019-05-04 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో తన ప్రతిష్ఠను దెబ్బకొట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి మోదీ శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీ నాన్నను ఆస్థానంలోని వారు ఆయనను మిస్టర్ క్లీన్ అన్నారు. కానీ, మీ నాన్న నెంబర్ 1 అవినీతిపరుడిగా జీవితాన్ని చాలించారు’’ అని మోదీ రాహుల్ గాంధీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడం ద్వారా దేశంలో బలహీన, అస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆరోపణ చేశారు.
2019-05-04 Read Moreథాయ్ లాండ్ 10వ రాజుగా మహా వజ్రలోంగ్ కోర్న్ శనివారం పట్టాభిషిక్తులయ్యారు. మూడు రోజుల పట్టాభిషేక ఉత్సవాల్లో తొలి రోజైన సోమవారం శుద్ధి కార్యక్రమాన్ని 76 ప్రావిన్సులనుంచి తెచ్చిన నీటితో చేపట్టారు. ఆ తర్వాత నూతన రాజు 7 కేజీల కిరీటాన్ని ధరించి తొమ్మిదంచెల గొడుకు కింద సింహాసనంపై ఆశీనులయ్యారు. బ్యాంగ్ కాక్ వీధుల్లో రాచపల్లకిపై ఊరేగారు. 2016లో తండ్రి మరణించిన తర్వాత మూడేళ్ళకు మహా వజ్రలోంగ్ కోర్న్ రాజుగా అవతరించారు. ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందు తన అంగరక్షికినే వివాహం చేసుకున్నారు.
2019-05-04 Read More