వడ్డీ రేట్లను తగ్గిస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకున్నా స్టాక్ మార్కెట్ పతనమైంది. ఎస్&పి బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం ఏకంగా 554 పాయింట్లు తగ్గి 39,530 వద్ద ముగిసింది. ఒక్క రోజులో ఇంత మొత్తంలో తగ్గడం 2019లో తొలిసారి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఇండస్ ల్యాండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్ బ్యాంకు, లార్సెన్ అండ్ టుబ్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టపోయిన సంస్థల్లో ఉన్నాయి. సెన్సెక్స్ ఈ ఒక్క రోజులో 1.38 శాతం తగ్గితే నిఫ్టీ 1.48 శాతం దిగజారింది.
2019-06-06భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) మానెటరీ పాలసీ కమిటీ (ఎం.పి.సి)లో వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా నిర్ణయించింది. గురువారం జరిగిన ఎంపిసి సమావేశంలో రెపో రేటును 5.75 శాతంగా (6 శాతం నుంచి తగ్గించి) నిర్ణయించింది. జీడీపీ వృద్ధి రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటు ఈ స్థాయికి తగ్గడం గత తొమ్మిది సంవత్సరాల్లో తొలిసారి. దేశీయంగా మందగమనంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు తగ్గడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలను రిజర్వు బ్యాంకు విశ్లేషించింది.
2019-06-06 Read Moreవాతావరణ మార్పునకు ఇండియా, చైనా, రష్యా కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు. యు.కె. పర్యటనలో ఉన్న ట్రంప్ బుధవారం ‘ఐ టివి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఇండియా, చైనా చేయవలసినంత చేయడంలేదని విమర్శించారు. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి అని పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం నుంచి 2017లో వైదొలిగిన సందర్భంగా కూడా ట్రంప్ ఇండియా, చైనాలను నిందించారు.
2019-06-05సిఎంగా ఉన్నప్పుడు సమావేశాలకోసం, సందర్శకులను కలవడానికి తన నివాసం ప్రక్కనే నిర్మించిన ‘ప్రజావేదిక’ను ఇప్పుడు కూడా తనకు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఎన్నికల తర్వాత సిఎం కార్యాలయాన్ని వదిలిన తాను, నివాసాన్ని మాత్రం ఇంతకు ముందున్న ప్రైవేటు నిర్మాణంలోనే కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. ‘ప్రజావేదిక’ను ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధం చేయాలని కోరారు.
2019-06-05వైద్య, దంత వైద్యాలయాల్లో ప్రవేశార్హతకోసం నిర్వహించిన ‘నీట్ 2019‘లో టాప్ 10 ర్యాంకులు పొందినవారిలో తొమ్మిది మంది అబ్బాయిలే..! వారి మధ్య ఒకే అక్క అమ్మాయి.. అందులోనూ తెలుగమ్మాయి జి. మాధురీరెడ్డి (తెలంగాణ) 7వ ర్యాంకు సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఖురేషి అస్రా 16వ ర్యాంకు సాధించి అమ్మాయల వరుసలో మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా టాప్ 50 ర్యాంకుల్లో ఏడుగురు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు.
2019-06-05వైద్య, దంత విద్యాలయాల్లో ప్రవేశంకోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘నీట్-2019’ ఉత్తీర్ణుల సంఖ్యలో వెనుకబడిన వర్గాల విద్యార్ధులు ముందున్నారు. మొత్తం ఉత్తీర్ణులు సుమారు 7.96 లక్షలు కాగా వారిలో 3.75 లక్షలు (47.11 శాతం) ఓబీసీ విద్యార్ధులు. ఎస్సీ విద్యార్ధులు 12.56 శాతం కాగా, ఎస్టీల నుంచి కేవలం 4.4 శాతం ఉన్నారు. రిజర్వు కేటగిరిలలో లేని వర్గాల విద్యార్ధులు ఉత్తీర్ణులలో 35.18 శాతం. ‘నీట్’ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
2019-06-05వైద్య, దంత విద్యా కళాశాలల్లో ప్రవేశంకోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ & ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్.ఇ.ఇ.టి) 2019లో 56.5 శాతం మంది విద్యార్ధులు అర్హత సాధించారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్.టి.ఎ) నిర్వహించిన ఈ పరీక్షకు 14 లక్షల మంది హాజరు కాగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నళిన్ ఖండేల్వాల్ మొదటి ర్యాంకు పొందాడు. అబ్బాయిలలో 3.51 లక్షల మంది, అమ్మాయిలలో అధికంగా 4.45 లక్షల మంది అర్హులయ్యారు. టాప్ ర్యాంకుల్లో మాత్రం అబ్బాయిలే ముందున్నారు.
2019-06-05ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో అబ్బాయిలే మొదటి 10 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. అందులో ఆరుగురు తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉంటున్నవారు కావడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కురిశేటి రవిశ్రీతేజ (155 మార్కులు), గొర్తి భానుదత్త (148 మార్కులు) 1, 3 ర్యాంకులను కైవశం చేసుకోగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పి. వేదప్రణవ్ మూడో ర్యాంకు (150 మార్కులు) పొందారు. ఇంజనీరింగ్ విభాగంలో 74.39 శాతం, వ్యవసాయ-ఫార్మసీ విభాగంలో 82,088 మంది అర్హత సాధించారు.
2019-06-04ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐదుగురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సహా 40 మందికి పైగా అధికారులకు స్థానచలనమైంది. 9 జిల్లాలకు కలెక్టర్లు మారారు. సీఆర్డీయే సహా ముఖ్యమైన స్థానాల్లోని అధికారులు మారిపోయారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న చాలామందికి పోస్టింగ్ ఇవ్వలేదు. సిఎం కార్యాలయంలో పని చేసినవారిలో ఒక్క గిరిజా శంకర్ కు మాత్రమే పోస్టింగ్ (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్) లభించింది.
2019-06-04ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో ఆయనను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అజేయ కల్లం సిఎం కార్యాలయానికి అధిపతిగా ఉంటారు. సిఎం కార్యాలయంలోని ఇతర అధికారులకు శాఖలను కేటాయిస్తారు. అన్ని శాఖలనుంచి సలహాలు కోరడానికి ఆయనకు అధికారం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులందరూ ఆయన జవాబుదారీగా ఉండాలి.
2019-06-04