ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న కాలం కంటే మరో రెండేళ్లు అదనంగా పడుతుందట! అంటే... 2026 వరకు ఆగాలన్నమాట. యు.కె.కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ (సిఇబిఆర్) ఈమేరకు అంచనా వేసింది. 2026లోనే జర్మనీని అధిగమించి ఇండియా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని సిఇబిఆర్ తెలిపింది. మూడో స్థానానికి చేరడానికి మాత్రం 2034వరకు ఆగాల్సిందే!
2019-12-29370 అధికరణ రద్దు సమయంలో కాశ్మీర్ లోనూ, ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం తర్వాత అనేక రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనివల్ల అంతర్జాలంపై ఆధారపడిన వ్యాపారాలకు.. గంటకు రూ. 2.45 కోట్ల చొప్పున నష్టం వాటిల్లినట్టు టెలికం కంపెనీల అసోసియేషన్ తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ ఆధారిత ‘ఓలా’, ‘ఉబర్’, ‘జోమాటో’, ‘స్విగ్గీ’ వంటి సేవలకు అంతరాయం కలిగింది.
2019-12-2918 సంప్రదాయ జలాంతర్గాములు, మరో 6 అణు జలాంతర్గాముల నిర్మాణానికి భారత నౌకాదళం ప్రణాళికను రచించింది. ప్రస్తుతం నౌకాదళంలో కేవలం 15 సంప్రదాయ జలాంతర్గాములు, ఒక అణు విద్యుత్ జలాంతర్గామి (ఎస్ఎస్ఎన్) ఉన్నాయి. రక్షణ రంగంపైన ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం శీతాకాల సమావేశాల్లో సమర్పించిన నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. అరిహంత్ తరహా అణు విద్యుత్ జలాంతర్గాముల్లో అణుక్షిపణులు ఉంటాయి.
2019-12-29రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై జి.ఎన్.రావు కమిటీ చేసిన సిఫారసులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 మంది మంత్రులతో ఓ ఉన్నతాధికార కమిటీని నియమించింది. రాష్ట్ర ఆర్థిక, రెవెన్యూ, పట్టాణాభివృద్ధి, పరిశ్రమలు, విద్య, హోం, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లైస్, రవాణా శాఖల మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సిసిఎల్ఎ, పట్టాణాభివృద్ధి, న్యాయ శాఖల కార్యదర్శులు కమిటీలో ఉంటారు.
2019-12-292019 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని తెలుగు తేజం కోనేరు హంపి కైవశం చేసుకుంది. పురుషుల ఆటలో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ తేలిగ్గా విజయం సాధించగా, మహిళల ఈవెంట్ ‘‘ప్లే ఆఫ్’’లో నిర్ణయమైంది. హంపి చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్జీపై విజయం సాధించింది. హంపి ఓ బిడ్డకు తల్లి అయిన నేపథ్యంలో 2016 నుంచి 2018 వరకు చెస్ ఆడలేదు. మళ్లీ బరిలోకి దిగిన ఏడాదిలోనే ప్రతిష్ఠాత్మక టైటిల్ సాధించింది.
2019-12-29అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు)కి చెందిన ‘‘గుర్తు తెలియని’’ 10,000 మంది విద్యార్ధులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిసెంబర్ 15న జరిగిన నిరసన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దానికి ‘‘గుర్తు తెలియని’’ 10,000 మంది విద్యార్ధులను బాధ్యులుగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. అయితే, కేసులు నమోదు చేసింది 1000 మందిపైనేనని, పొరపాటున 10,000గా టైపు అయిందని ఎస్.పి. ఆకాష్ కుల్హారీ చెప్పారు.
2019-12-29సోమాలియా రాజధాని మొగదిషులో ఘోరం జరిగింది. బాంబులతో కూడిన ట్రక్కు పేలిన ఘటనలో 90 మంది మరణించారు. చనిపోయినవారిలో అనేక మంది టర్కీ పౌరులు, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, 17 మంది పోలీసు అధికారులు ఉన్నట్టు సమాచారం. ఉదయం బిజీ సమయంలో పేలుడు జరగడం వల్ల మరణాలు ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. అల్ ఖైదా అనుబంధ షాబాద్ సంస్థే దీనికి కారణమని నగర మేయర్ ఆరోపించారు.
2019-12-28గగనతల రక్షణ వ్యవస్థల్లో అగ్ర స్థానం రష్యాది. ఎస్-300.. తర్వాత ఎస్-400 రష్యా అమ్ముల పొదిలో చేరాయి. 400 కిలోమీటర్ల దూరం, 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను తుత్తునియలు చేసే సామర్ధ్యం ఎస్-400 సొంతం. దీనికోసం టర్కీ ఏకంగా అమెరికాను ధిక్కరించి 5వ తరం (ఎఫ్-35) యుద్ధ విమానాలను కూడా వదులుకుంది. ఇదీ ఎస్-400 క్రేజు. 2020లో రష్యా ఎస్-500ను పరీక్షించబోతోంది. ఈ కొత్త ఆయుధం దీర్ఘశ్రేణి క్షిపణులను సైతం ధ్వంసం చేయగలదని అంచనా.
2019-12-28ఢిల్లీలో శనివారం ఉదయం 6.10 గంటలకు కేవలం 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో ఢిల్లీకి ఇదే అతి తక్కువ. ఇప్పటివరకు ఢిల్లీని చుట్టుముట్టిన కాలుష్యానికి ఇప్పుడు పొగ మంచు తోడైంది. రానున్న కొద్ది రోజుల్లో కనీస ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది.
2019-12-28‘‘మీరు ఆర్మీకి నాయకత్వం వహిస్తున్నారు. మీ పని మీరు చూసుకోండి. రాజకీయ నాయకులు చేసే పని వాళ్ళు చేస్తారు. మేం ఏం చేయాలో చెప్పడం ఆర్మీ పని కాదు. అలాగే యుద్ధం ఎలా చేయాలో చెప్పడం మా పని కాదు’’...రక్షణ శాఖ మాజీ మంత్రి చిదంబరం భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు చేసిన హితబోధ ఇది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేపట్టిన ఆందోళనపై ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు చిదంబరం ఈ విధంగా స్పందించారు.
2019-12-28