హిరోషిమా నగరాన్ని నాశనం చేసిన అణుబాంబుకు 11 రెట్లు శక్తివంతమైన పేలుడుతో డిసెంబర్ మాసంలో భూమిపైన ఓ ఉల్కాపాతం సంభవించింది. విచిత్రమేమిటంటే అప్పట్లో ఎవరూ గమనించలేదు. జపాన్ వాతావరణ ఉపగ్రహం ‘హిమవారి 8’ వీడియోలో బంధించిన ఈ అరుదైన దృశ్యాన్ని శాస్త్రవేత్తలు కొద్ది రోజుల క్రితమే గమనించారు. భారీ ఉల్క 173 కిలోటన్నుల టి.ఎన్.టి. శక్తితో భూ వాతావరణంలో మండిపోయినట్టు అంచనా వేశారు. ఆధునిక కాలంలో ఇది మూడో భారీ ఉల్కాపాతం. రష్యాకు సమీపంలో బేరింగ్ సముద్రంపైన పేలుడు సంభవించడంతో ఎవరికీ ప్రత్యక్ష్యంగా వీక్షించే అవకాశం లేకపోయింది.
2019-03-20బీసీ వర్గాల రిజర్వేషన్ కోటాను 14 నుంచి 27 శాతానికి పెంచుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్చి 8న జారీ చేసిన ఆర్డినెన్స్ అమలును ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. కొద్ది నెలల క్రితమే ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ‘2019 నీట్’ పరీక్ష రాసిన ఎంబిబిఎస్ విద్యార్ధులు కొందరు రిజర్వేషన్ పెంపు ఆర్డినెన్సును కోర్టులో సవాలు చేశారు. ఓబీసీ కోటా పెంపుతో రాష్ట్రంలో రిజర్వేషన్ల మొత్తం 63 శాతానికి చేరుతోందని, రాజ్యాంగంలోని 164(4) అధికరణాన్ని ఈ ఆర్డినెన్సు అతిక్రమించిందని వారి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
2019-03-20 Read Moreసీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు జనసేన మంగళవారం ప్రకటించింది. లక్ష్మీనారాయణతో పాటు ఎనిమిది మంది అసెంబ్లీ అభ్యర్ధుల పేర్లతో జనసేన తాజా జాబితాను ప్రకటించింది. అందులో పసుపులేటి ఉషా కిరణఖ్ (విశాఖ ఉత్తరం), గంపల గిరిధర్ (విశాఖ దక్షిణం), కోన తాతారావు (విశాఖ తూర్పు), పంచకర్ల సందీప్ (భీమిలి), శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం), తుమ్మల రామస్వామి (పెద్దాపురం), చిర్రి బాలరాజు (పోలవరం), టి.సి. వరుణ్ (అనంతపురం) ఉన్నారు.
2019-03-20సంజయ్ లీలా భన్సాలీ తదుపరి చిత్రం ‘ఇన్షాఅల్లా’లో సల్మాన్ ఖాన్, అలియా భట్ నటిస్తున్నారు. భన్సాలీ ప్రొడక్షన్స్ సంస్థ మంగళవారం ఈ విషయాన్ని నిర్ధారించింది. భన్సాలీ చిత్రంలో సల్మాన్ ప్రధాన పాత్ర పోషించి సుమారు 20 సంవత్సరాలు గడిచాయి. వారిద్దరి చివరి సినిమా 1999లో విడుదలైన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’. సల్మాన్ ఖాన్, భన్సాలీలతో అలియా భట్ కలసి పనిచేయడం ఇదే ప్రథమం. తాను తొమ్మిది సంవత్సరాల వయసులో తొలిసారి భన్సాలీ కార్యాలయంలోకి అడుగుపెట్టానని, చాలాకాలం వేచి చూసిన తర్వాత ఆయన సినిమాలో పని చేస్తున్నానని అలియా భట్ ట్వీట్ చేశారు.
2019-03-20 Read Moreజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాలను పవన్ ఎంచుకున్నారు. 21వ తేదీ ఉదయం 10.30, మధ్యాహ్నం 1.00 గంట మధ్య గాజువాకలో పవన్ నామినేషన్ వేయనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట, సాయంత్రం 5.00 గంటల మధ్య భీమవరంలో పవన్ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఆరోగ్యవంతమైన భీమవరంకోసం, ఉత్తరాంధ్ర వెనుకబాటుపై యుద్ధం చేయడానికి ఆయా స్థానాల్లో పవన్ పోటీ చేస్తున్నట్టు జనసేన చెబుతోంది.
2019-03-20ఆపత్సమయంలో ఒక మనిషి తన ప్రాణాన్ని రక్షించుకునేందుకు ఉన్న హక్కుకు సుప్రీంకోర్టు తాజాగా విస్తృత నిర్వచనం ఇచ్చింది. ‘స్వీయరక్షణ హక్కు’ తన దేహాన్ని రక్షించుకోవడానికే కాకుండా ఇతరులను, వారి ఆస్తులను రక్షించడానికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఐపీసీలోని కొన్ని సెక్షన్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ విస్తృత నిర్వచనంతో ఓ తమిళనాడు ఫారెస్ట్ రేంజర్ జైలు శిక్ష నుంచి విముక్తుడయ్యాడు. 1988లో ఎర్రచందనం ‘స్మగ్లర్’ ఒకరిని కాల్చి చంపిన నేరానికి ఆ రేంజర్ జైలు పాలయ్యారు.
2019-03-20 Read Moreభారత దేశ తొలి లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోస్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 8 మంది సభ్యులతో లోక్ పాల్ కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ పి.సి. ఘోస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2014 జనవరిలో లోక్ పాల్ చట్టం నోటిఫై కాగా.. ఐదేళ్ళ తర్వాత నియామకాలు జరగడం గమనార్హం. అవినీతి వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో 2013లో లోక్ పాల్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులపై వచ్చే అవినీతి ఆరోపణలను సైతం లోక్ పాల్, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్తలు విచారించవచ్చు.
2019-03-20 Read More2018-19 ఆర్థిక సంవత్సరంలో గడచిన 11 నెలల్లో ఇండియా వాణిజ్య లోటు 165.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వాణిజ్య లోటు పెరుగుదల 11 శాతంగా ఉంది. 2012-13లో వాణిజ్య లోటు పతాక స్థాయికి చేరి 190 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత గత ఆరేళ్లలో ఇదే అత్యధిక లోటు. ముడి చమురు దిగుమతి పెరగడం ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. భారత విదేశీ వాణిజ్యంలో ముఖ్యమైన దేశంగా ఉన్న అమెరికా ఇటీవల విధించిన సుంకాలు కూడా రానున్న కాలంలో ప్రభావితం చేస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
2019-03-19 Read Moreభారతీయ జనతా పార్టీ నేత ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం తెల్లవారుజామున 2.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్ పారికర్ మరణం నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం సావంత్ ను తదుపరి సిఎంగా ఎంపిక చేసింది. షెడ్యూలు ప్రకారమైతే సావంత్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణం చేయాలి. అయితే, మిత్రపక్షాలను ఒప్పించడంలో జాప్యంతో ప్రమాణ స్వీకారాన్ని రాత్రి 11.00 గంటలకు వాయిదా వేశారు. అప్పుడూ జరగలేదు. చివరికి మంగళవారం వేకువజామున 1.50 గంటలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేశారు.
2019-03-19 Read Moreఏపీలోని 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ఈరోజే ప్రారంభమైంది. అయితే, తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నిన్ననే అభ్యర్ధుల జాబితాలను ప్రకటించగా, అధికార తెలుగుదేశం పార్టీ ఇంకా కొన్ని స్థానాలకు వెల్లడించాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీవరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న స్క్రూటినీ తర్వాత ఉపసంహరణకు 28వరకు అవకాశం ఉంది.
2019-03-18