పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను వ్యతిరేకిస్తున్నవారిపై బిజెపి నేతల ధూషణ పెరిగింది. శనివారం తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ ఎంపీ (ఎంఐఎం) అసదుద్దీన్ ఒవైసీని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ‘‘నిన్ను ఓ క్రేన్ కు తలకిందులుగా వేలాడదీసి గడ్డం గొరిగిస్తా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిలించి నీ గడ్డానికి ప్రమోషన్ ఇస్తా’’ అని అరవింద్ ఒవైసీని హెచ్చరించారు. నిన్న కర్నాటక ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి ముస్లింలను బెదిరించిన సంగతి తెలిసిందే.
2020-01-04తమను బలవంతంగా తరలించే సమయంలో దౌర్జన్యంగా, అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులపై మందడం మహిళా రైతులు ఫిర్యాదు చేశారు. తమను ఈడ్చుకెళ్లి కొట్టారని, అసభ్యంగా తిట్టి గొంతు నులిమారని సుప్రియ, బ్రాహ్మణి శుక్రవారం రాత్రి తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాది వలేటి లక్ష్మీనారాయణ వారితో పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అసభ్య పదజాలంతో మాట్లాడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
2020-01-04ఆర్థిక వ్యవస్థపై అనేక చేదు వార్తల మధ్య ఓ మంచి వార్త ఇది. విదేశీ మారక నిల్వలు డిసెంబరు చివరి వారంలో గణనీయంగా పెరిగాయి. 27వ తేదీతో ముగిసిన వారంలో 2.52 బిలియన్ డాలర్లు పెరిగి 457.468 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ పెరుగుదల ప్రధానంగా కరెన్సీ ఆస్తుల్లోనే కనిపిస్తోంది. కరెన్సీ అసెట్స్ 2.203 బిలియన్ డాలర్లు పెరిగి 424.936 బిలియన్ డాలర్లకు చేరుకోగా... బంగారం నిల్వలు 260 మిలియన్ డాలర్ల మేరకు పెరిగి 27.392 బిలియన్ డాలర్లకు చేరాయి.
2020-01-03 Read Moreఇరాన్ కమాండర్ హత్య తర్వాత యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అమెరికా స్టాక్ మార్కెట్ తిరోగమించింది. డౌ జోన్స్ 234 పాయింట్లు తగ్గింది. అయితే, ఒకే ఒక్క రంగంలోని స్టాక్స్ పెరిగాయి. ఆయుధ కంపెనీల్లో... నార్త్ కార్ప్ గ్రుమ్మాన్ స్టాక్స్ 5.5 శాతం పెరిగితే, లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ షేర్లు 3.69 శాతం పెరిగాయి. యుద్ధం వస్తే ఈ కంపెనీల అమ్మకాలు విపరీతంగా ఉంటాయి.
2020-01-04 Read Moreఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే... రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనవసరమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బి.సి.జి) తేల్చింది. గత 4 దశాబ్దాల్లో చేపట్టిన కొత్త రాజధాని నగరాలేవీ విజయవంతం కాలేదని పేర్కొంది. అమరావతిపై 2025 నాటికే లక్ష కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని, దానిపై వడ్డీ మరో రూ. 10 వేల కోట్లు అవుతుందని, అంత భరించడం అనవసరమని అభిప్రాయపడింది. జిఎన్ రావు కమిటీ తర్వాత అవే అంశాలపై బిసిజి శుక్రవారం సిఎంకు నివేదిక సమర్పించింది.
2020-01-04ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చింది యుద్ధాన్ని ప్రారంభించడానికి కాదని, యుద్ధం జరగకుండా నిరోధించడానికేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. శుక్రవారం బాగ్ధాద్ విమానాశ్రయంపై అమెరికా డ్రోన్ దాడి తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సులేమానీ వందల మంది అమెరికన్ల చావుకు, వేలాది మంది క్షతగాత్రులు కావడానికి కారకుడని ట్రంప్ ఆరోపించారు.
2020-01-04పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా... ఉపసంహరణకు కేంద్రం ససేమిరా అంటోంది. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సిఎఎను ఉపసంహరించదు’’ అని బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఉద్ఘాటించారు. సిఎఎపై అవగాహన కల్పించడానికంటూ బిజెపి జోద్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో షా మాట్లాడారు. ప్రతిపక్షాలన్నీ కలసినా కూడా బిజెపి తన నిర్ణయాన్ని రివర్స్ చేయబోదని షా స్పష్టం చేశారు.
2020-01-04 Read Moreఇరాన్ టాప్ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన ఘటన ఇండియా ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. శుక్రవారం సులేమానీ హత్య తర్వాత ముడి చమురు ధరలు పెరిగాయి. రూపాయి విలువ డాలరుకు 71.61కి పడిపోయింది. గత నెల రోజుల్లో ఇదే కనిష్ఠం. ఇండియాలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల షేరు ధరలు తగ్గాయి. హెచ్.పి.సి.ఎల్. షేరు 2.5 శాతం, బి.పి.సి.ఎల్. ధర 1.6 శాతం తగ్గాయి. బి.ఎస్.ఇ. సెన్సెక్స్ శుక్రవారం 118 పాయింట్లు పడిపోయింది.
2020-01-04 Read Moreటాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ మరణానికి కారకులపై ‘తీవ్ర ప్రతీకారం’ తప్పదని ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా ఖమేనీ ప్రతినబూనారు. శుక్రవారం సులేమానీపై ఇరాక్ లోని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా క్షిపణి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సులేమానీని దేశంలో రెండో శక్తిమంతుడైన నేతగా చూస్తారు. రివల్యూషనరీ గార్డ్స్ లో అగ్రశ్రేణి విభాగం ‘‘ఖుద్స్ ఫోర్స్’కు ఆయన నాయకుడు.
2020-01-04 Read Moreఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను తాము కొనుగోలు చేయనున్నట్టు అదానీ పోర్టుల కంపెనీ శుక్రవారం ప్రకటించింది. గౌతమ్ అదానీకి చెందిన ఈ కంపెనీ 75 శాతం వాటా కోసం రూ. 13,572 కోట్లు చెల్లించనుంది. కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ (కె.పి.సి.ఎల్)లో సివిఆర్ గ్రూపు చేతిలో మెజారిటీ వాటా ఉండగా, లండన్ కేంద్రంగా ఉన్న ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘3ఐ’ మైనారటీ వాటా కలిగి ఉంది. ఈ పోర్టును కలిపితే అదానీ పోర్టుల గ్రూపు మార్కెట్ వాటా 27 శాతానికి పెరుగుతుంది.
2020-01-04 Read More