‘కియా’ రూ. 7000 కోట్ల పెట్టుబడితో 2017లో ప్లాంటు నిర్మాణం ప్రారంభించి రెండేళ్ళలో పూర్తి చేసింది. తొలి కారు కొద్ది నెలల క్రితమే విడుదలైంది. ఇంతలోనే తరలింపు వార్తలు రావడం ఒక అసాధారణ పరిణామమే! ఏపీలో కొత్త ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలపై జగన్ ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. ముఖ్యంగా భూమి విలువ చెల్లింపు వాయిదాలు, విద్యుత్ రాయితీల వంటివి. వీటినే ప్రధాన కారణాలుగా ‘రాయిటర్స్’ పేర్కొంది.
2020-02-06కార్ల పరిశ్రమను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి తరలించే ప్రణాళికేమీ లేదని ‘కియా’ ఓ ప్రకటనలో తెలిపింది. ‘విస్తరణ’ను పరిశీలించే ముందు ప్రస్తుత ప్లాంటు పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొంది. అనంతపురంలో ఉన్న ‘కియా’ ప్లాంటును తమిళనాడుకు తరలించే అంశంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, వచ్చే వారం కార్యదర్శి స్థాయిలో చర్చలు జరగబోతున్నాయని ‘రాయిటర్స్’ రాసింది.
2020-02-06అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా మోటార్స్ కార్ల ప్లాంటును పొరుగున ఉన్న తమిళనాడుకు తరలించేందుకు చర్చలు జరుగుతున్నాయా?! ఆ రాష్ట్ర అధికారులను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ రాసిన వార్త కలకలం రేపింది. ఏపీ విభజన తర్వాత వచ్చిన అతి పెద్ద విదేశీ పెట్టుబడి ‘కియా’. పారిశ్రామిక వృద్ధికి పెద్ద పరిశ్రమలు తప్పనిసరి అని భావించి గత ప్రభుత్వం అదనపు రాయితీలు కల్పించి మరీ రాష్ట్రానికి తెచ్చింది. ‘కియా’ 3 లక్షల యూనిట్ల సామర్ధ్యంతో కొద్ది నెలల క్రితమే ఉత్పత్తిని ప్రారంభించింది.
2020-02-06 Read Moreకరోనా వైరస్ భయాల మధ్య.. విదేశాల నుంచి వచ్చిన 50 మందిని ఏపీ ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది. అందులో 49 మందిని వారి ఇళ్ళలోనే ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరిని మాత్రం ఆసుపత్రిలో విడి వార్డులో ఉంచారు. ఐదుగురి నమూనాలను ‘కరోనా’ నిర్ధారణకోసం పూణె పంపించారు. ఇళ్ళలో ఉన్న 49 మంది.. విజయనగరం (5), విశాఖపట్నం (11) తూర్పుగోదావరి (11), పశ్చిమగోదావరి (8), చిత్తూరు (4) అనంతపురం (7), క్రిష్ణా (1), నెల్లూరు (1), కడప (1) జిల్లాలవారు.
2020-02-05రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయకులుగా నిర్మితమవుతున్న చిత్రం (ఆర్ఆర్ఆర్) విడుదల వాయిదా పడింది. చిత్రాన్ని 2021 జనవరి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ బుధవారం ప్రకటించింది. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలని భావించారు. కారణాలను వెల్లడించలేదు గాని, ఐదు నెలల ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
2020-02-05అంతర్జాతీయ మేధో సంపత్తి (ఐపి) ఇండెక్స్ ర్యాంకుల్లో ఇండియా 40వ స్థానానికి దిగజారింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని గ్లోబల్ ఇన్నొవేషన్ పాలసీ సెంటర్ (జిఐపిసి) 2020 నివేదిక తాజాగా వెల్లడైంది. 53 ఆర్థిక వ్యవస్థలను విశ్లేషించగా ఇండియా 38.46 స్కోరుతో 40వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 50 దేశాలను విశ్లేషించగా ఇండియా 36వ స్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా అమెరికా, యుకె, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. చైనా 50.96 స్కోరుతో 28వ స్థానంలో నిలిచింది.
2020-02-05టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో సబీహా గోక్సెన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపైనుంచి ప్రక్కకు దూసుకెళ్లిన ఓ విమానం ముక్కలుగా విడిపోయింది. బుధవారం ప్రమాదానికి గురైన బోయింగ్ 737-800లో 177 మంది ఉన్నారు. వారిలో గాయపడిన 52 మందిని ఆసుపత్రికి తరలించారు. ఎవరూ మరణించలేదు. ‘పెగాసస్ ఎయిర్ లైన్స్’కు చెందిన విమానాలు అదే ఎయిర్ పోర్టులో రన్‌వేపైనుంచి ప్రక్కకు వెళ్ళడం రెండు నెలల్లో ఇది రెండోసారి. జనవరి 7న మరో విమానం ఇలాగే ప్రమాదానికి గురైంది.
2020-02-05ఉన్మాద ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉండబోడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని పెదపరిమి గ్రామంలో రైతుల దీక్షా శిబిరాన్ని బుధవారం చంద్రబాబు సందర్శించారు. దుర్మార్గులైన వైసీపీ నేతలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని దుయ్యబట్టారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన తన పట్ల కనీస మర్యాద లేకుండా వైసీపీ నేతలు బూతు పంచాంగం వినిపిస్తున్నారని విమర్శించారు.
2020-02-05రాజధాని మార్పుపై కేంద్రం జోక్యం చేసుకోదంటూ పిచ్చి మాటలు మాట్లాడొద్దని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై మండిపడ్డారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పార్లమెంటు ఆమోదించిన చట్టానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే చెల్లదని ఆయన బుధవారం స్పష్టం చేశారు. విజయవాడలో బహిరంగ చర్చకు రావాలని ఎంపీకి సవాలు చేశారు. విశాఖలో కొన్న భూములకు డిమాండ్ పెంచుకోవడానికే వైకాపా నేతలు రాజధానిని మారుస్తుంటే కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
2020-02-05ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్రాన్ని కోరారు. అవినీతి కేసులున్న ప్రజాప్రతినిధుల అంశాన్ని ఆయన బుధవారం రాజ్యసభలో ప్రస్తావించారు. కనకమేడల పదేపదే ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తావన తేవడంతో...రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారించారు. సిఎం పేరు రికార్డుల్లోకి వెళ్ళదని స్పష్టం చేశారు. స్థూలంగా ప్రజాప్రతినిధుల కేసుల అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు.
2020-02-05