పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా ఢిల్లీ ‘షహీన్ బాగ్’లో జరుగుతున్న నిరసనకు ఆదివారం మద్ధతు పెరిగింది. అన్ని విశ్వాసాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో పోగై సర్వమత ప్రార్ధనలు చేశారు. మత సామరస్యాన్ని చాటుతూ... చాలా పొడవైన జాతీయ పతాకాన్ని చేతబూని ప్రదర్శన నిర్వహించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ పఠనము, భజనలూ, సిక్కు కీర్తనలు సాగాయి. అదే సమయంలో రాజ్యాంగ పీఠికను చదువుతూ సోషలిస్టు, సెక్యులర్ విలువలను కాపాడతామని ప్రతినబూనారు.
2020-01-13రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై మిత్ర దేశాలు కురిపించిన బాంబులు ఇంకా జర్మన్లను భయపెడుతున్నాయి. 75 ఏళ్ల క్రితం పేలని రెండు బాంబులను ఆదివారం తవ్వి తీశారు. పశ్చిమ జర్మనీలోని డోర్ట్ మండ్ నగరంలో 14,000 మంది ప్రజలను తరలించి ఈ పని చేపట్టారు. ఒక్కో బాంబు 250 కేజీల బరువుంది. వాటిలో ఒకటి బ్రిటిష్ బాంబు, రెండోది అమెరికన్ బాంబు. రెండూ పేలకుండా జాగ్రత్త చేశారు. నిర్మాణ పని చేస్తున్న కార్మికులు ఇచ్చిన క్లూతో బాంబులు కనుగొన్నారు.
2020-01-13రిపబ్లిక్ దినోత్సవానికి 15 రోజుల ముందు... ఇద్దరు వాంటెడ్ టెర్రరిస్టులను ఢిల్లీకి చేర్చే ప్రయత్నంలో కాశ్మీర్ డి.ఎస్.పి. దేవీందర్ సింగ్ దొరికిపోయాడు. 2001లో పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకరికి ఇతను సహకరించినట్టు ఉరితీయబడిన అఫ్జల్ గురు లేఖ ద్వారా వెల్లడైంది. అప్పట్లో దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా తప్పించుకున్న దేవీందర్, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఉగ్రవాదులతో కలసి ఉండగా దొరికిపోయాడు. అప్పుడు పార్లమెంటుపై దాడి చేశారు. మరి ఇప్పుడు రిపబ్లిక్ దినోత్సవమే లక్ష్యమా?
2020-01-13ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడిన దేవీందర్ సింగ్ ఇంతకు ముందే ఓసారి వార్తల్లోకి ఎక్కాడు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురు 2013లో రాసిన లేఖలో దేవీందర్ పాత్రను వివరించారు. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు ‘మొహమ్మద్’ను ఢిల్లీకి తీసుకెళ్లమని, అక్కడ అతను ఉండటానికి ఓ ఫ్లాటు, కారు ఏర్పాటు చేయమని దేవీందర్ సింగ్ తనకు చెప్పినట్టు అఫ్జల్ గురు లేఖలో తెలిపాడు. అయితే, ఈ కోణాన్ని విచారించిన అధికారులు సాక్ష్యాలు లేవని వదిలేశారు.
2020-01-13కాశ్మీర్ నుంచి ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీకి తీసుకొస్తుండగా డి.ఎస్.పి. దేవీందర్ సింగ్ పట్టుబడ్డాడు. ఒకప్పుడు ఇంటరాగేషన్ టేబుల్ కు ఇవతల ఉండి ఉగ్రవాదులను ప్రశ్నించిన సింగ్, ఇప్పుడు ఆ దరికి చేరాడు. ఈ కేసులో ఇంటరాగేషన్ చేస్తున్న అధికారులు అతన్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ‘‘నువ్వీ పని ఎలా చేయగలిగావు?’’. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ ‘ఉగ్రవాద పోలీసు’ గత ఏడాది ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నాడు.
2020-01-13జాంబియా జాతీయ పార్కు (దక్షిణ లువాంగ్వా)లో ఓ ఏనుగు గోడలు దాటుతోంది. ఇప్పుడా వీడియో, చిత్రాలు వైరల్ అయ్యాయి. సఫారీ డ్రైవ్ కోసం వెళ్లిన అతిధుల లాడ్జిలో అరటికాయలు తినడంకోసం ఆ ఏనుగు కష్టపడి గోడలు దాటింది. ఈ చిత్రాలను పార్కు జనరల్ మేనేజర్ ఇయాన్ సాలిస్బరి కెమేరాలో బంధించారు. ఈ ఏనుగు దిగిన ఓ గోడ ఎత్తు 5 అడుగులు. ఎత్తును సరిగ్గా అంచనా వేసుకొని మరీ ఏనుగు గోడలు ఎక్కి దిగినట్టుగా ఇయాన్ చెప్పారు.
2020-01-13 Read Moreనిర్భయ సామూహిక మానభంగం కేసులో నిందితులను ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నలుగురు నిందితుల నమూనాలతో ‘డమ్మీ ఉరి’ని పూర్తి చేశారు. ఇందుకోసం తుక్కు, రాళ్ళతో కూడిన గోతాలను ఉపయోగించారు. నిర్భయ కేసులో ముఖేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు ఉరి తీయవలసి ఉంది.
2020-01-12జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో హింసకు సంబంధించి 49 మందికి నోటీసులు జారీ చేసినట్టు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో కనిపించిన ఎబివిపి యాక్టివిస్టులు అక్షత్ అవస్థి, రోహిత్ షా కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ నెల 5న ముసుగు ధరించిన సుమారు 50 మంది జె.ఎన్.యు.లో విద్యార్ధులు, అధ్యాపకులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ముందు జరిగిన ఘటనలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2020-01-12అమరావతిలో పోలీసుల దౌర్జన్యంపై విచారణకోసం వచ్చిన జాతీయ మహిళా కమిషన్ బృందం అరకొర పరిశీలనతో సరిపెట్టింది. ఆదివారం కమిషన్ సభ్యులు తుళ్ళూరులో విచారణ తర్వాత విజయవాడ క్లబ్ లో కొంతమందితో చర్చించారు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మందడం యువతి శ్రీలక్ష్మిని పరామర్శించారు. నిర్భంధాన్ని ఎదుర్కొంటున్న మందడం, ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. ఆయా ప్రాంతాల వారు కమిషన్ సభ్యులను కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
2020-01-12ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చెడు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్ప చరిత్రలో మరొకరు లేరని మాజీ సిఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పల్నాటి గడ్డపైన సిఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అమరావతి పరిరక్షణ చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం నర్సరావుపేటలో జెఎసి నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ చేసే అరాచకానికి, అమరావతిలో చేస్తున్న వినాశనానికి రాష్ట్రంలో అందరూ నష్టపోతారని ఆయన పేర్కొన్నారు.
2020-01-12