ప్రస్తుత లోక్ సభ కాల పరిమితి జూన్ 3వ తేదీతో ముగియనుంది. 2014లో లోక్ సభతోపాటే ఎన్నికలు నిర్వహించిన 5 రాష్ట్రాల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్ళగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 18వరకు గడువు ఉంది. సిక్కిం అసెంబ్లీ కాల పరిమితి మే నెల 27వ తేదీతో ముగియనుండగా... అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1వరకు, ఒడిశా అసెంబ్లీకి జూన్ 11 వరకు ఉంది. విడిగా ఎన్నికలు జరిగిన జమ్మూ కాశ్మీర్ కాల పరిమితి 2015 మార్చి 17 నుంచి 2021 మార్చి 16 వరకు (ఆరేళ్ళు) ఉండగా అసెంబ్లీ అర్ధాంతరంగా రద్దయింది.
2019-03-102019 లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు షెడ్యూలు విడుదల కానుంది. లోక్ సభకు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లో 7 నుంచి 8 దశల్లో పోలింగ్ నిర్వహించవచ్చని తెలుస్తోంది. తొలి దశ నోటిఫికేషన్ ఈ నెలాఖరున విడుదలై పోలింగ్ ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దయి ‘మే’ నాటికి ఆరు నెలలు గడుస్తున్నా... ఆ ఎన్నికలనూ ‘లోక్ సభ’తో కలిపే నిర్వహిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు.
2019-03-10 Read Moreఆమె పేరు కానె తనాక.. 1903 జనవరి 2వ తేదీన జన్మించిన జపాన్ మహిళ. రైట్ సోదరుల విమాన ప్రయోగం జరిగిన సంవత్సరం.. ఆ సందర్భానికంటే ముందే జన్మించారు. నెలలు నిండక ముందే పుట్టినా నికరంగా 116 వసంతాలు పూర్తి చేసుకొని జీవన ప్రస్థానాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఆ తాతమ్మ భూమిపైనే అత్యధిక వయస్కురాలని నిర్దారించిన గిన్నిస్ బుక్, శనివారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది. 1922లో వివాహం చేసుకున్న తనాక, నలుగురు పిల్లల్ని కని మరొకరిని దత్తత తీసుకోవడం విశేషం. ఇప్పటికీ లెక్కలు చదవడం, బోర్డు గేమ్స్ ఆడటం ఆమె దినచర్యలో భాగమట!
2019-03-09 Read Moreకర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం తమ అనుచరవర్గంతో కలసి అమరావతి తరలి వచ్చిన గౌరు దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద ఆయనను కలిశారు. వారికి పసుపు కండువాలు కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇన్నాళ్లూ జగన్ కుటుంబానికి అండగా ఉన్నామని, కొత్త వ్యక్తుల చేరికతో తమ సేవలు చాలన్నారని గౌరు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత లేదని విమర్శించారు.
2019-03-09వచ్చే ఎన్నికలు టీడీపీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య కాదని.. కేసీఆర్ కు, తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తనను ఓడించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదని నిర్ధారించుకున్న కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని చంద్రబాబు చెప్పారు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ‘‘మీకు కేసీఆర్ కావాలా.. తెలుగుదేశం కావాలా? మీరు ఆంధ్రవైపా.. కేసీఆర్ వైపా? తేల్చుకోవాలి’’ అని ప్రజలకు సూచించారు. కేసులకు భయపడి, వెయ్యి కోట్లకు కక్కుర్తిపడి జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
2019-03-09బీజేపీ పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ నేత దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరిట గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేసిన ఆర్కియాలజీ సంస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దీన్ దయాళ్ విగ్రహాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన నోయిడా సిటీ సెంటర్ - నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ లైన్ కు ప్రధాని శనివారం పచ్చ జెండా ఊపారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా వరుస ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మోదీ, ఖుర్జాలో 1320 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు.
2019-03-09 Read Moreరాఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయన్న మాటను అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మార్చుకోవడంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం తన స్టైల్లో స్పందించారు. దొంగ ఫైళ్ళను తిరిగి ఇచ్చేసి ఉంటాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాఫేల్ ఫైళ్లు పోయాయని, పిటిషనర్లకు అవే ఆధారమని బుధవారం సుప్రీంకు చెప్పిన వేణుగోపాల్... శుక్రవారం అవి ‘‘ఫొటో కాపీలు’’ అంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. ‘‘బుధవారం అవి చోరీ అయిన పత్రాలు. శుక్రవారం అవి ఫొటో కాపీలు!! ఈ మధ్యలో గురువారం దొంగ ఫైళ్ళను తిరిగి ఇచ్చాడనుకుంటా’’ అని చిదంబరం చమత్కరించారు.
2019-03-09 Read Moreపరారీలో ఉన్న భారత అతి పెద్ద ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ లండన్ నగరంలో దర్జాగా తిరుగుతూ మీడియాకు దొరికిపోయారు. వేషం మార్చిన మోదీని టెలిగ్రాఫ్ సీనియర్ పాత్రికేయుడు లండన్ వీధుల్లో పట్టుకున్నారు. వజ్రాల వ్యాపారి అయిన మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13 వేల కోట్లకు పైగా ముంచారు. భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతి పెద్ద మోసం. గత ఏడాది సీబీఐ కేసు నమోదు చేయడానికంటే ముందే కుటుంబంతో సహా ఇండియా వదిలి పారిపోయారు. భారత విచారణ సంస్థల విన్నపం మేరకు మోదీపై గత జూలైలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.
2019-03-09 Read Moreరాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల పరిధిలో తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశాలు శనివారంతో ముగుస్తున్నాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. లోక్ సభ సీట్లకు అభ్యర్ధులపై రాబోయే రెండు రోజుల్లో విశ్లేషిస్తామని, వెనువెంటనే ప్రజల్లోకి వెళ్తామని ఆయన వెల్లడించారు. 2019 ఎన్నికల మిషన్ పేరిట రోజూ నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్సులో భాగంగా.. శనివారం ఉదయం కూడా ముఖ్యమంత్రి తమ పార్టీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కన్వీనర్లతో మాట్లాడారు.
2019-03-09మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. దాడి 2014లోనే టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారారు. ఆయన కుమారుడు రత్నాకర్ గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి. తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తటస్థంగా ఉన్న దాడి ఇప్పుడు కుమారుడితో కలసి మరోసారి వై.ఎస్.ఆర్.సి.లో చేరారు. జై రమేష్ చాలా కాలంగా టీడీపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.
2019-03-09 Read More