‘దేశద్రోహం’ నేరాన్ని ఆపాదించే చట్టాన్ని బ్రిటిష్ వలస పాలకుల చట్టంగా సుప్రీంకోర్టు ఈసడించింది. స్వాతంత్ర పోరాటాన్ని అణచివేయడానికి ఉపయోగించిన ఆ చట్టం స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అవసరమా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక చెక్కను మలచడానికి కార్పెంటర్ కు రంపం ఇస్తే అడవి మొత్తాన్ని నరికేసినట్టుగా, ‘దేశద్రోహం’ చట్టం అపరిమితంగా దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
2021-07-15హర్యానాలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం 100 మంది రైతులపై ‘దేశద్రోహం’ కేసు నమోదు చేసింది. బిజెపి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా కారుపై ఈ నెల11న దాడి చేశారన్నది రైతులపై ఉన్న అభియోగం. ‘దేశద్రోహ’ చట్టాన్ని వలస పాలన వారసత్వంగా సుప్రీంకోర్టు ఈసడించిన రోజునే హర్యానా పోలీసులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం గమనార్హం. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, హర్యానాలో బిజెపి- జననాయక్ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వ నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేపట్టారు.
2021-07-15ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడం తప్పు అని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జి వాకర్ బుష్ వ్యాఖ్యానించారు. జో బైడెన్ తాజా నిర్ణయాన్ని ఆక్షేపించిన బుష్, దీంతో ఆఫ్ఘన్ ప్రజలకు కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. పరిణామాలు ‘నమ్మశక్యం కానంత చెడ్డ’గా ఉంటాయని ఒక జర్మన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుష్ వ్యాఖ్యానించారు. 20 ఏళ్ళ క్రితం ఈ జూనియర్ బుష్ హయాంలోనే ఆప్ఘనిస్తాన్ పైన అమెరికా దండెత్తింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ యుద్ధం తర్వాత దేశాన్ని మళ్ళీ తాలిబన్లకు అప్పగించినట్టుగా అమెరికా వెనుదిరిగింది.
2021-07-14బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తాజాగా రూ. 233 లక్షల కోట్లు దాటింది. బుధవారం వాణిజ్యం ముగిసే సమయానికి మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 2,33,06,440.17 కోట్లకు చేరింది. ఇది జీవిత కాల గరిష్టం. భారత జీడీపీ కంటే ఎక్కువ. నిజ ఆర్థిక వ్యవస్థ క్షీణించినా స్టాక్ మార్కెట్ అసాధారణంగా పెరిగింది. ఆశావహ సెంటిమెంట్లు దీనికి కారణమంటున్నారు. తాజాగా బుధవారం బిఎస్ఇ సెన్సెక్స్ 134.32 పాయింట్లు పెరిగి 52,904.05 వద్ద ముగిసింది. మంగళ, బుధవారాల్లో మదుపరుల సంపద రూ. 1,42,806.24 కోట్లు పెరిగింది.
2021-07-14రద్దయిన సెక్షన్ కింద ఆరేళ్లుగా కేసులు నమోదు చేయడమేంటని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఐటి చట్టం-2000లోని సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులను సత్వరమే ఉపసంహరించుకోవాలని, ఇక ముందు నమోదు చేయవద్దని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ సెక్షన్ ను 2015 మార్చిలో సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, పోలీసులకు అవగాహన కల్పించాలంటూ 2019 జనవరి 14న కేంద్ర ఐటి శాఖ రాష్ట్రాలను ఆదేశించిందని కూడా హోంశాఖ తన లేఖలో పేర్కొంది.
2021-07-14కొత్త ఐటి నిబంధనల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులలో విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున ఈ అంశంలో తాము ముందుకు వెళ్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ తాము విన్నవించామని కేంద్రం చెప్పగా, ‘‘మీరు ఒక బదిలీ దరఖాస్తు చేసినంతనే, హైకోర్టు ముందు విచారణ నిలిచిపోయినట్టు అర్థమా?’’ అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.
2021-07-14బెంగాల్ రాష్ట్రంలోని నందిగ్రాం నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి కలకత్తా హైకోర్టు బుధవారం ఎన్నికల అధికారులకు, ఎమ్మెల్యే సువేందు అధికారికి నోటీసులు జారీ చేసింది. పోలింగ్ పత్రాలను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను భద్రపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బెంగాల్ అంతటా హవా చూపిన మమతా బెనర్జీ, తాను పోటీ చేసిన నందిగ్రాంలో మాత్రం పాత మిత్రుడు సువేందు చేతిలో ఓడిపోయారు. అక్రమాలు జరిగాయని ఆరోపించిన మమత, రీకౌంటింగ్ కు డిమాండ్ చేశారు. ఈసీ నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించారు.
2021-07-14ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలను కలిశారు. ఢిల్లీ రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య దీర్ఘ కాలంగా కొనసాగుతున్న వైరానికి ముగింపు పలకడంపై కూడా వారు చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ సమావేశం నిర్ధిష్టంగా పంజాబ్ కు సంబంధించినది కాదని అందులో ఉన్న పార్టీ పంజాబ్ ఇన్జార్జి హరీశ్ రావత్ చెప్పారు.
2021-07-13తమ జలాల్లోకి ప్రవేశించిన అమెరికా యుద్ధనౌకను తాము దూరంగా తరిమినట్టు చైనా పిఎల్ఎ దక్షిణ ధియేటర్ కమాండ్ సోమవారం ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవుల వద్ద ఈ పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు చెప్పిన తీర్పు వార్షికోత్సాన అమెరికా నౌక ‘యుఎస్ఎస్ బెన్ ఫోల్డ్’ ఈ కవ్వింపు చర్యకు దిగింది. కవ్వింపు చర్యలను వెంటనే ఆపాలని తాము అమెరికాను కోరినట్టు పిఎల్ఎ తెలిపింది. అయితే, ఈ అంశంపై అమెరికా నౌకా దళం వెంటనే స్పందించలేదు.
2021-07-12మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష NEET (UG) 2021ను సెప్టెంబరు 12న నిర్వహించనున్నట్టు కొత్తగా కేంద్ర విద్యా శాఖ బాధ్యతలు చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. పరీక్ష దరఖాస్తును మంగళవారం సాయంత్రం 5 గంటలకు neet.nta.nic.in వెబ్సైట్ లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ‘నీట్’ గత ఏడాది 155 నగరాల్లో జరగగా, ఈ ఏడాది 198 నగరాల్లో నిర్వహించబోతున్నట్టు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు గత ఏడాది (3,862) కంటే పెరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఫేస్ మాస్కులు అందిస్తామన్నారు.
2021-07-12