ఈ నెల 26న ‘కిసాన్ గణతంత్ర కవాతు’లో హింసను ఆసరాగా చేసుకొని, రైతుల శాంతియుత నిరసన శిబిరాలను ఖాళీ చేయించడానికి కేంద్ర, రాష్ట్ర (యూపీ) ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు వికటించాయి. ఘాజీపూర్ వద్ద శిబిరాన్ని నడుపుతున్న యూపీ రైతు నేత రాకేశ్ తికాయత్ కంటతడి పెట్టిన దృశ్యంతో రగిలిన రైతులు ముజఫర్ పూర్ లో మహాపంచాయత్ నిర్వహించారు. కొన్ని పదుల వేల మంది ఈ ‘మహా పంచాయత్’కు హాజరై ఢిల్లీ ఆందోళనకు మద్ధతు తెలిపారు. వేలాది మంది ఢిల్లీ సరిహద్దులకు పయనమయ్యారు. దీంతో హాజీపూర్ శిబిరం నిండిపోయింది.
2021-01-29 Read More50 లక్షల టన్నుల సామర్ధ్యంతో మోడల్ స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత తర్వగా ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆధిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. రైతులనుంచి మెరుగైన సేకరణ కోసం నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలని ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాంశు పాండే ఈ నెల 29న ముఖ్యమంత్రి యోగితో జరిగిన సమావేశంలో కోరారు. ఆ సమావేశంలో ఎఫ్.సి.ఐ. ఛైర్మన్ కూడా ఉన్నారు.
2021-01-30 Read Moreఘాజీపూర్ సరిహద్దులో చెలరేగిన భావోద్వేగాల నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ (లోక్ శక్తి) తిరిగి ఆందోళనలో చేరింది. ఈ నెల 26న ‘కిసాన్ గణతంత్ర కవాతు’లో కొన్ని గ్రూపులు హింసకు పాల్పడిన నేపథ్యంలో మరో రెండు సంఘాలతో పాటు లోక్ శక్తి కూడా ఆందోళనను విరమించింది. అయితే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న శిబిరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో.. బికెయు నేత రాకేశ్ తికాయత్ కన్నీళ్ళ విన్నపం రైతులను కదలించింది. దీంతో లోక్ శక్తి గ్రూపు పునరాలోచన చేసింది.
2021-01-30 Read Moreతమిళనాట అధికార అన్నా డిఎంకెతో తమ మైత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఉద్ఘాటించారు. రెండు పార్టీలూ ఎన్నికలను సంయుక్తంగా ఎదుర్కొంటాయని ఆయన శనివారం మదురైలో చెప్పారు. ఒక రోజు పర్యటన కోసం తమిళనాడు వచ్చిన నడ్డా, శనివారం పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్-మే లలో ఎన్నికలు జరగాల్సి ఉంది.
2021-01-30 Read Moreవ్యవసాయ చట్టాల విషయంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ‘‘ఆఫర్‘‘ ఇప్పటికీ అలాగే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన శనివారం అన్ని రాజకీయ పార్టీల సభా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులతో చర్చలకు తాము ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నామని మోదీ వ్యాఖ్యానించారు. ‘కిసాన్ గణతంత్ర పరేడ్’లో హింస తర్వాత, గత మూడు రోజుల్లో ఢిల్లీ సరిహద్దుల్లోని రైతుల శిబిరాలపై పోలీసులు, బిజెపి శ్రేణుల దాడులు జరిగాయి. శిబిరాల ఖాళీకి బలప్రయోగం చేస్తూనే ప్రధాని ‘ఆఫర్’ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
2021-01-30 Read Moreఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఎస్ఇసి గవర్నరుకు చేసిన ఫిర్యాదులో తమపై చేసిన వ్యాఖ్యలను ‘‘సభా హక్కుల ఉల్లంఘన’’గా మంత్రులు పేర్కొన్నారు. తనపైన మాటల దాడికి పాల్పడిన మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ‘లక్ష్మణ రేఖ’ను దాటారని నిమ్మగడ్డ శుక్రవారం గవర్నరుకు ఫిర్యాదు చేశారు. ఆయన లేఖలో తమను అవమానించే, బెదరించే మాటలు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2021-01-30 Read Moreనిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనరుగా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని భీష్మించిన జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఆశాభంగమైంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కరోనా తీవ్రంగా ఉన్న దశలోనే అనేక చోట్ల ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. రెండు వ్యవస్థల మధ్య అహం సమస్య రాష్ట్రంలో అరాజకానికి దారి తీస్తోందని వ్యాఖ్యానించిన సుప్రీం, దాన్ని తాము అనుమతించబోమని ఉద్ఘాటించింది.
2021-01-25కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకోసం జరుగుతున్న రైతు పోరాటంలో మహారాష్ట్ర రైతాంగం భాగమవుతోంది. 25వ తేదీన (సోమవారం) భారత వాణిజ్య రాజధాని ముంబైలో తలపెట్టిన నిరసన కార్యక్రమం కోసం ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు బయలుదేరారు. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది నాసిక్ నగరంలో కలుసుకొని అక్కడి నుంచి ర్యాలీ చేపట్టారు. ఎన్.సి.పి. అధినేత శరద్ పవార్ సహా మహారాష్ట్ర అధికార కూటమి నేతలు పలువురు కూడా రేపు ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
2021-01-24ఎన్నికల కమిషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కయ్యం శనివారం మరో దశకు చేరింది. పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదలకు ముందు, తర్వాత కమిషనర్ రమేష్ కుమార్ నిర్వహించిన సమావేశాలకు ప్రభుత్వ అధికారులంతా డుమ్మా కొట్టారు. సిఎం జగన్ పంతానికి అనుగుణంగా వ్యవహరించారు. నోటిఫికేషన్ ప్రకటించాక జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రమేష్ కుమార్ కు అంతటా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కలెక్టర్లు, ఎస్పీలు సహా అంతా గైర్హాజరు కావడంతో.. సుమారు రెండు గంటల పాటు రమేష్ కుమార్ వేచి చూశారు.
2021-01-23పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం మొదటి దఫా నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం విడుదల చేశారు. పోలింగ్ ను నాలుగు దశలలో నిర్వహించడానికి కొద్ది రోజుల క్రితమే షెడ్యూలును ప్రకటించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలను మినహాయించి 11 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించాలని ఎస్ఇసి నిర్ణయించారు. అయితే, నిమ్మగడ్డ పదవీ విరమణ వరకు ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న సిఎం జగన్.. అధికారులు, ఉద్యోగ సంఘాలను కట్టడి చేశారు.
2021-01-23