అమెరికా మొత్తం సైన్యాన్ని, పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ)ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ ఇరాన్ పార్లమెంటు కొత్త బిల్లును ఆమోదించింది. ఇరాన్ టాప్ కమాండర్ సులేమానీని హతమార్చడం ‘‘అమెరికా ప్రాయోజిత ఉగ్రవాదం’’గా పేర్కొంటూ పార్లమెంటులో మంగళవారం ఉదయం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గత ఏడాది ‘అమెరికా సెంట్రల్ కమాండ్’ను ఉగ్రవాద సంస్థగా, అమెరికా ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద పోషకుడు’గా ఇరాన్ ప్రకటించింది.
2020-01-07ఇండొనేషనియా లోని అచె ప్రావిన్సులో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపంతీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. సినాబాగ్ ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 20.3 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉంది.
2020-01-07అమృత్ సర్ రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో పునర్నిర్మితం కానుంది. అందుకు సంబంధించిన ఊహాచిత్రమే పై ఫొటో. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐ.ఆర్.ఎస్.డి.సి) ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనుంది. ఎయిర్ పోర్టు తరహా లక్షణాలతో రైల్వే ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం.
2020-01-07ప్రభుత్వం కాశ్మీర్ ను మిగిలిన ఇండియాలా మార్చామని చెప్పుకుంటోందని, ఆచరణలో ఇండియా మొత్తాన్ని కాశ్మీర్ లా మార్చిందని బిజెపి మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. ఆదివారం జె.ఎన్.యు. విద్యార్ధులు, అధ్యాపకులపై జరిగిన దాడి ‘‘ప్రభుత్వ గూండాలు, ప్రభుత్వ పోలీసుల’’ మధ్య తేడా లేకుండా చేసిందని ఆయన ఆక్షేపించారు. సోమవారం జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ వద్ద జరిగిన ‘పౌరసత్వ చట్ట వ్యతిరేక’ ప్రదర్శనలో సిన్హా మాట్లాడారు.
2020-01-07మన గెలాక్సీ ‘పాలపుంత’లో 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని ఓ అంచనా. అంతకు 10 రెట్లు నక్షత్రాలు ఓ గెలాక్సీలో ఉంటే దాన్నేమనవచ్చు? అలాంటి ఓ మహా గెలాక్సీ (యుజిసి 2885)ని హబుల్ టెలిస్కోప్ సర్వే చేసింది. పాలపుంతకు రెండున్నర రెట్లు విస్తీర్ణంగల ఈ గెలాక్సీని ‘గాడ్జిల్లా గెలాక్సీ’గా పిలుచుకోవచ్చని నాసా చెబుతోంది. మన ‘ప్రాంతీయ విశ్వం’లో ఇదే అతి పెద్ద గెలాక్సీ. మనకు 23 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికి ‘‘రూబిన్స్ గెలాక్సీ’’ అని ముద్దు పేరు.
2020-01-06 Read Moreమన పాలపుంత మధ్య భాగాన్ని మునుపెన్నడూ చూడనంత స్పష్టంగా నాసా ఓ పరారుణ చిత్రంలో బంధించింది. 600 కాంతి సంవత్సరాల విస్తీర్ణం ఈ చిత్రంలో కనిపిస్తోంది. గ్యాస్, ధూళితో కూడిన దట్టమైన వృత్తాలను ఈ అధిక రిజొల్యూషన్ పనోరమా స్పష్టంగా చూపిస్తోంది. భారీ నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి? గెలాక్సీ మధ్యలో ఉన్న మహా కృష్ణ బిలానికి ఆహారం ఏమిటి? అనే అంశాలపై భవిష్యత్ పరిశోధనలకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.
2020-01-06 Read Moreరాజధానిని అమరావతినుంచి తరలించడానికి సిఎం జగన్ వేగంగా పావులు కదుపుతుంటే.. ఆయన సొంత ప్రాంతం రాయలసీమ నుంచి కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని తరలింపు తప్పనిసరైతే రాయలసీమను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని, లేదంటే కర్నూలును తెలంగాణలో కలపాలని టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి వాదిస్తున్నారు.
2020-01-06మంగంగపే బరైటిస్ ఘనుల్లో ఫుల్లెరీన్ ఖనిజాన్ని వెలికి తీసేందుకు ప్రయోగాత్మకంగా ఓ ప్లాంటును మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామని ‘లైనెక్స్ బయోసైన్స్’ అనే కంపెనీ వెల్లడించింది. సోమవారం రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అంశంపై నిర్వహించిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. బరైటిస్ కోసం వెలికి తీసే బ్లాక్ షెల్ నుంచి ఫుల్లెరీన్ ఖనిజాన్ని వేరు చేయడానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అవసరమని కంపెనీ చెబుతోంది.
2020-01-06అమరావతిలో భారీ ఎత్తున ఆందోళనలు సాగుతున్నా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సచివాలయ తరలింపు దిశగా కీలక అడుగు వేస్తోంది. విశాఖలోని మిలీనియం టవర్స్ లో కొత్త సచివాలయం ఏర్పాటుచేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రాధాన్యతా శాఖల్లోని ముఖ్యవిభాగాల తరలింపు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. రిపబ్లిక్ డే ఉత్సవాలను కూడా విశాఖలోనే నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఆ లోపే క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది.
2020-01-06బీజేపీలోకి ఆహ్వానంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు మోహన్ బాబు. కూతురు మంచు లక్ష్మీ, కొడుకు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిిసి మోహన్ బాబు సోమవారంప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీల్లో ఏం చర్చించామో తర్వాత చెబుతానన్నారు మోహన్ బాబు. ఏపీలో సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారన్నారు. మోడీకి ఉత్తరాది, దక్షిణాది నటులన్న భేదాలు లేవని మంచు విష్ణు అన్నారు. త్వరలో ప్రధాని దక్షిణాది నటులను కలుస్తారని చెప్పారు.
2020-01-06