రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యంనుు అర్ధాంతరంగా తొలగించిన తీరుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ప్రధాన కార్యదర్శిని అవమానించినట్టుగా తొలగించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించగా, అది ముఖ్యమంత్రి నిరంకుశ ధోరణి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. షోకాజ్ నోటీసు అందుకున్న అధికారి (సిఎంఒ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్) ప్రధాన కార్యదర్శిని తప్పిస్తూ జీవో ఇవ్వడం ఏమిటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
2019-11-04సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాల సమాచార సేకరణకోసం 1977లో ‘‘నాసా’’ ప్రయోగించిన ‘‘వోయేజర్ 2’’ ఇప్పుడు అక్కడినుంచి తొలి సమాచారాన్ని పంపింది. 1989లో నెఫ్ట్యూన్ గ్రహాన్ని దాటిన ఈ అంతరిక్ష నౌక ఆ తర్వాత మరో 29 సంవత్సరాలకు (2018లో) సౌర కుటుంబం అంచులను దాటింది. సౌర కుటుంబం అధికారిక సరిహద్దును ‘హెలియోపాస్’గా వ్యవహరిస్తారు. ఈ సరిహద్దు దాటిన రెండో నౌక ‘‘వోయేజర్2’’. 2012లో ‘‘వోయేజర్1’’ సౌర కుటుంబాన్ని దాటి విశ్వాంతరాళాల్లోకి పయనించింది.
2019-11-05 Read Moreఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఒబి) 2019-20 ద్వితీయ త్రైమాసికంలో రూ. 2,254 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వాటిల్లిన నష్టానికి (రూ. 487 కోట్లకు) ఇది సుమారు 5 రెట్లు. మొండి బకాయిలు అధికం కావడం ఇందుకు ప్రధాన కారణంగా బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2, 3 త్రైమాసికాల్లో ఈ మొండి బకాయిల తాత్కాలిక భారాన్ని చూపిస్తే మార్చి నాటికి మెరుగైన పరిస్థితి వస్తుందని బ్యాంకు ఎండి&సిఇఒ కర్ణం శేఖర్ చెబుతున్నారు.
2019-11-04 Read Moreదేశీయ పరిశ్రమలు, రైతులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో... ప్రాంతీయ సహకార ఆర్థిక భాగస్వామ్య (ఆర్.సి.ఇ.పి) ఒప్పందంలో చేరరాదని ఇండియా నిర్ణయించింది. చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లతో పాటు ‘ఆసియాన్’ దేశాలు భాగస్వాములుగా ఉన్న ఆర్.సి.ఇ.పి.లో చేరడానికి ఇండియా ఇప్పటిదాకా చర్చలు జరిపింది. అయితే, భారత ప్రయోజనాలకు అవసరమైన సవరణలు చేయకపోవడంతో ఒప్పందానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది.
2019-11-04 Read Moreఐసిసి టి20 ప్రపంచ కప్ షెడ్యూలు సోమవారం విడుదలైంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగనుంది. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. పాకిస్తాన్ గ్రూపు 1లో, ఇండియా గ్రూపు 2లో ఉండటంతో లీగ్ దశలో దాయాదులు పోటీ పడే అవకాశం లేదు. గ్రూపు 1లో ఇంకా అస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండీస్ జట్లు.. గ్రూపు 2లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ,ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇవి కాకుండా ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్లు ఆడనున్నాయి. లీగ్ దశలో వాటి సామర్ధ్యాన్ని బట్టి రెండేసి జట్లను ఎంపిక చేస్తారు.
2019-11-04ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘రెండు రోజుల క్రితం... క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటినుంచి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్దం తెలియని వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే’’ అని మోహన్ బాబు ట్విట్టర్లో స్పందించారు. ‘‘దయచేసి నా పేరుకు భంగం కలిగించేట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది’’ అని మోహన్ బాబు హెచ్చరించారు.
2019-11-04తెలంగాణ సమాజం ఉలికిపడే స్థాయిలో సోమవారం ఓ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని తన కార్యాలయంలోనే సజీవ దహనం చేశాడు ఓ దుండగుడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం పెట్రోలు తెచ్చిన ఆ వ్యక్తి కొద్దిసేపు వాగ్వివాదం తర్వాత ఆమెపై పోసి నిప్పంటించినట్టు సమాచారం. దుండగుడు తనకూ నిప్పంటించుకున్నట్టు చెబుతున్నారు. మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి బాధతో పరుగెడుతూ బయటకు వచ్చి తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయారు. హంతకుడిని బుర్ర సురేష్ గా గుర్తించారు.
2019-11-04రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అనూహ్యంగా బదిలీ అయ్యారు. సిఎంఒ ముఖ్య కార్యదర్శి, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కు మూడు రోజుల క్రితం సీఎస్ షో కాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో... ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. సోమవారం హఠాత్తుగా బదిలీ చేసి... తక్షణమే ఆయన సీఎస్ బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. ఆయనను బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఆ జీవో కూడా ప్రవీణ్ ప్రకాష్ పేరిటే జారీ అయింది.
2019-11-04పోయిన చోటే వెతుక్కోవాలన్నారు పెద్దలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తాను ఓటమి పాలైన విశాఖ నగరంలో అదే పని చేశారు. భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా ఆదివారం నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’ విజయవంతమైంది. మార్చ్ తలపెట్టిన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. వేదిక, పార్కింగ్ విషయంలో పోలీసులు సహాయ నిరాకరణ చేయగా వాహనం పైనుంచే పవన్ ప్రసంగించారు. రాజకీయ అనుభవం లేదని గత ఎన్నికల్లో తనను ప్రజలు నమ్మకపోయినా... తాను మాత్రం అండగా ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు.
2019-11-03‘‘సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా నామీద మాట్లాడతారా?’’ అని విశాఖపట్నం ‘‘లాంగ్ మార్చ్’’లో పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్న సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. #SuitcaseVijaySaiReddy ఆదివారం రాత్రి ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ అంశమైంది. తన అర్హతను ప్రశ్నించిన విజయసాయిరెడ్డిపై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఆర్థిక నేరాల్లో జైలుకెళ్లి వచ్చి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే మీకు నైతిక అర్హత ఉందా?’’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కోర్టులకు వెళ్తే బాగుంటుందా? అని పోలీసులను ఉద్ధేశించి పవన్ అడిగారు.
2019-11-03