కర్నాటక కొత్త ముఖ్యమంత్రి యెడియూరప్ప ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, జెడి(ఎస్) బహిష్కరించాయి. ఈ కార్యక్రమాన్ని ‘అపవిత్ర పరిణామం’గా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. మూడు రోజుల క్రితం విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జెడి(ఎస్) కూటమి ఓడిపోగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎడియూరప్ప ముందుకొచ్చారు. విశ్వాస పరీక్షలో ఓటు వేస్తామని కాంగ్రెస్-జెడి(ఎస్) రెబల్ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చాకే బిజెపి ఇందుకు సమ్మతించినట్టు సమాచారం.
2019-07-26శుక్రవారం కర్నాటక సిఎంగా బిఎస్ యెడియూరప్ప ప్రమాణం చేస్తే ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేత డికె శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఇదే రోజు.. సుప్రీంకోర్టులో ఓ కేసు విషయంలో మాత్రం ఇద్దరిదీ ఒకే వైఖరి. 2008 భూ ఆక్రమణ కేసును తిరగదోడే ప్రయత్నాన్ని ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో బెంగళూరు డెవల్ మెంట్ అధారిటీ (బిడిఎ) సేకరించిన 4.2 ఎకరాల భూమిని యెడియూరప్ప ప్రభుత్వం డీనోటిఫై చేయగా, డికె శివకుమార్ మంత్రిగా ఉండగా కొనుగోలు చేశారు. అదీ కథ.
2019-07-26 Read Moreకాంగ్రెస్-జెడి(ఎస్) ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత సిఎంగా ప్రమాణం చేసిన యెడియూరప్ప సోమవారం విశ్వాస పరీక్షకు సిద్ధమైనట్టు సమాచారం. బలపరీక్షకు జూలై 31వరకు గడువు ఇవ్వగా ఆయన ఈలోగానే విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం కూలిపోయాక రెండు రోజులపాటు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసిన యెడియూరప్ప శుక్రవారం ఉదయం గవర్నర్ వాజూభాయ్ వాలాను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరారు.
2019-07-26కర్నాటకలో కాంగ్రెస్-జెడి(ఎస్) కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేలలో ముగ్గురిపైన అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. అనర్హత వేటుతో వారు 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కోల్పోయారు. సొంత పార్టీలకు వ్యతిరేకంగా మారిన ఈ ముగ్గురికీ.. బిజెపి ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవులు వస్తాయని భావించారు. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జెడి(ఎస్) కూటమి ప్రభుత్వం 99-105 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
2019-07-25 Read Moreకర్నాటక కొత్త సిఎం పేరేంటి..? మొన్నటిదాకా యెడ్యూరప్ప (Yeddyurappa). ఇకపై యెడియూరప్ప (Yediyurappa). రెండవ డి స్థానంలో ఐ చేర్చారు. నిజానికి ఈ సీనియర్ నేత అసలు పేరు అదే (యెడియూరప్ప). తొలిసారి సిఎం అయినప్పుడూ అలాగే ప్రమాణస్వీకారం చేశారు. అయితే, న్యూమరాలజిస్టుల సలహా మేరకు ‘యెడ్యూరప్ప’గా మార్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత పేరుతో ‘యెడియూరప్ప’గా ప్రమాణం చేశారు. యెడియూరప్ప గతంలో తీవ్రమైన ఆరోపణలతో పదవి కోల్పోయి జైలు పాలయ్యారు.
2019-07-26 Read Moreకర్నాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యెడియూరప్ప (76) శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా రాజ్ భవన్ వేదికగా యెడియూరప్ప చేత ప్రమాణం చేయించారు. యెడియూరప్ప సిఎం కావడం ఇది నాలుగోసారి. గత ఏడాది మేలో మూడోసారి ప్రమాణం చేసిన యెడియూరప్ప బలం నిరూపించుకోలేక కేవలం మూడు రోజుల్లోనే తప్పుకొన్నారు. కాంగ్రెస్-జెడిఎస్ కూటమి ప్రభుత్వంలో సంక్షోభంతో మరోసారి యెడియూరప్పకు అవకాశం వచ్చింది.
2019-07-26 Read Moreఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ను పొగిడారు. గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయరుకు తరలించే ఉమ్మడి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వైఖరిని జగన్ కొనియాడారు. ఆయన మంచివాడని ప్రశంసించిన జగన్, తాను మాట్లాడే సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం లేవు. ఈ మనిషిని చూస్తే దెయ్యం, రాక్షసి గుర్తుకొస్తాయి’’ అని జగన్ దుయ్యబట్టారు.
2019-07-25చెన్నైలో భూగర్భ జలాల సమస్య ఎంత తీవ్రంగా ఉందో కేంద్ర భూగర్భ జల బోర్డు (సి.జి.డబ్ల్యు.బి) గణాంకాలు చెబుతున్నాయి. ఈ బోర్డు పర్యవేక్షణకు ఎంచుకున్న బావులలో 85 శాతం చోట్ల 0 నుంచి 2 మీటర్ల మేరకు భూగర్భ జలాలు తగ్గిపోయాయి. 2018లో రుతుపవనాలు రాక ముందు సేకరించిన సమాచారాన్ని బోర్డు క్రితం దశాబ్దపు సగటుతో పోల్చి చూసింది. దేశవ్యాప్తంగా సర్వే చేసిన బావుల్లో 56 శాతం చోట్ల ఇదే మోతాదులో భూగర్భ జలాలు తగ్గాయని గురువారం లోక్ సభలో కేంద్రం పేర్కొంది.
2019-07-25పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం.. ఇండియా నుంచి రోజుకు 600 విమానాల రాకపోకలపై ప్రభావం చూపించిందని కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో వెల్లడించింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై (ఫిబ్రవరి 27న) ఇండియా వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయగా.. విమానాలన్నీ అరేబియా సముద్రంపై నుంచి నడపవలసి వచ్చింది. తమ గగనతలంపై నిషేధాన్ని పాకిస్తాన్ ఈ నెల 16న ఎత్తివేసింది.
2019-07-25‘ట్రిపుల్ తలాక్’ చెప్పినవారిని జైలుకు పంపించేలా రూపొందించిన బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో పాటు బిజెపి మిత్రపక్షం జెడి(యు) సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. గతంలో ‘ట్రిపుల్ తలాక్’ నిషేధంపై ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టంది. గురువారం లోక్ సభలో బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది ఓటు వేశారు.
2019-07-25