2012లో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ ‘నిర్భయ’ సామూహిక మానభంగం కేసులో నలుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. ముఖేష్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలను జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని ఆదేశించింది. బాధితురాలి తల్లి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య విద్యార్ధిని మానభంగం చేసి క్రూరంగా హింసించినవారికి ఏడేళ్ళ తర్వాత శిక్ష అమలు కాబోతోంది.
2020-01-07 Read Moreరేపు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటే పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను హెచ్చరించింది. ప్రభుత్వ సిబ్బంది సమ్మెలు, నిరసనల్లో పాల్గొనడాన్ని నిషేధించినట్టు కేంద్ర సిబ్బంది శాఖ మంగళవారం ఒక ఉత్తర్వులో పేర్కొంది. కాగా, సమ్మెలో 25 కోట్ల మంది శ్రామికులు పాల్గొంటారని 9 సంఘాల నేతలు చెబుతున్నారు. బుధవారం ఉదయం 12 గంటల నుంచి 24 గంటల పాటు సమ్మె కొనసాగుతుంది.
2020-01-07 Read Moreవరంగల్, కరీంనగర్ మాత్రమే కాకుండా అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐ.టి. పరిశ్రమను విస్తరిస్తామని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు చెప్పారు. మంగళవారం ఆయన వరంగల్ నగరంలో టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీల కొత్త బ్రాంచిలను ప్రారంభించారు. సైయంట్ కంపెనీలో 600 టెక్ ఉద్యోగాలు ఉన్నట్టు కంపెనీ అధినేత బివిఆర్ మోహన్ రెడ్డి తెలిపారు.
2020-01-07కరేబియన్ సముద్రలోని ప్యూర్టోరికోలో మంగళవారం ఉదయం 8.25కు (స్థానిక కాలమానం) వరుస భూకంపాలు సంభవించాయి. పెద్ద భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. కొద్దిసేపటికే 5.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 5.2, 4.2, 4.5, 4.3 తీవ్రతతో వరుస భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపాల కేంద్ర స్థానం ఒక్కటే. ఇండియోస్ ప్రాంతానికి 8 కిలోమీటర్ల దక్షిణాన 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉంది.
2020-01-07ఇరాన్ కుర్ద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిం సులేమానీ అంత్యక్రియలకు హాజరైన అశేష జనవాహిని భావోద్వేగాల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన సులేమానీకి ఇరాన్ అంతటా సానుభూతి పెల్లుబికింది. అమెరికాపై ఆగ్రహంతో ఉన్న ప్రజానీకం మంగళవారం కెర్మన్ నగరంలో జరిగిన సులేమానీ అంత్యక్రియలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు.
2020-01-07రాష్ట్ర రాజధాని తరలింపుపై సచివాలయ ఉద్యోగులు మౌనం వీడారు. సచివాలయంలోని మూడవ బ్లాకులో సమావేశమైన ఉద్యోగులు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజననాటికంటే ఎక్కువ బాధను ఇప్పుడు అనుభవిస్తున్నామని ఓ మహిళా ఉద్యోగి చెప్పారు. రైతులకంటే ఉద్యోగులు ఎక్కువ బాధపడుతున్నారని, అయితే... బయటకు వచ్చి చెబితే ఏమవుతుందోనని భయంతో మౌనంగా ఉన్నారని ఆమె చెప్పారు. పార్టీకో రాజధానితో తమను ఇబ్బంది పెట్టడం ఏమిటని మరో ఉద్యోగి ప్రశ్నించారు. .
2020-01-07టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అమరావతి రైతులు తలపెట్టిన జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి హాజరయ్యేందుకు లోకేష్ విజయవాడ నుంచి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తున్నానని లోకేష్ చెప్పినా వినలేదు. లోకేష్ చినకాకాని వెళ్తారని భావించి ఆయనను, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు.
2020-01-0720 రోజుల పాటు రాజధాని అమరావతి గ్రామాలకే పరిమితమైందనుకున్న ఉద్యమం మంగళవారం ఆ ఛట్రాన్ని దాటింది. రాజధాని రైతులు, వారికి మద్ధతుగా అమరావతి జెఎసి, టీడీపీ సహా పలు పార్టీల కార్యకర్తలు చినకాకాని వద్ద చెన్నై-కోల్ కత జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాయకులను ఎక్కడికక్కడ ‘హౌస్ అరెస్టు’లతో నిరోధించినా పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు హాజరయ్యారు.
2020-01-07మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమరావతి రైతుల ఆగ్రహాన్ని చవిచూశారు. మంగళవారం రాజధాని రైతులు చినకాకాని వద్ద జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఆ సమయంలో రహదారిపై వస్తున్న పిన్నెల్లి వాహనాన్ని కూడా ఆపి ఉద్యమానికి మద్ధతు కోరారు. అయితే, ఆయన గన్ మెన్ల సాయంతో దూకుడుగా వెళ్లబోయారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పిన్నెల్లి కారుపై రాళ్లు రువ్వారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
2020-01-07జె.ఎన్.యు.పై మొన్న రాత్రి జరిగిన దాడిలో విద్యార్ధి సంఘం నాయకురాలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే, అదే రోజు.. దాదాపు అదే సమయానికి (రాత్రి 8.39, 8.43లకు ఎఫ్ఐఆర్) ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ముందు రోజు సర్వర్ గదిని ధ్వంసం చేశారనేది ఆ కేసుల సారాంశం. ఆదివారం రాత్రి ఎబివిపి చేసిన దాడిలో ఘోష్ సహా 34 మంది విద్యార్ధులు, అధ్యాపకులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి ఒక్క నిందితుడి పేరు కూడా లేకుండా 3వ ఎఫ్ఐఆర్ నమోదైంది.
2020-01-07