భారత ఆర్థిక వ్యవస్థకు ఇరుసువంటి సర్వీసుల రంగమూ తిరోగమనంలో ఉన్నట్టు తాజా రిపోర్టు ఒకటి సూచిస్తోంది. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) ఆగస్టులో ఉన్న 52.4 స్థాయి నుంచి సెప్టెంబరులో 48.7కు పడిపోయింది. 2018 ప్రారంభం నుంచి తొలిసారి కొత్త వ్యాపార ఆర్డర్లు పడిపోవడంతో పిఎంఐ పతనమైంది. పిఎంఐ 50 మార్కుకు తగ్గడం అంటే తిరోగమనమే! ఈ ఏడాది ఆ తిరోగమనం రెండు మాసాల్లో నమోదైంది. సెప్టెంబరు పిఎంఐ 19 నెలల కనిష్ఠ స్థాయిలో ఉంది.
2019-10-04 Read Moreదేశంలో మూక హత్యలను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై బీహార్ లోని ముజఫరాపూర్ పట్టణంలో దేశద్రోహం కేసు నమోదైంది. స్థానిక న్యాయవాది ఒకరి పిటిషన్ పైన పట్టణ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చరిత్రకారుడు రామచంద్రగుహ, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, సినీ ప్రముఖులు అదూర్ గోపాలక్రిష్ణన్, శ్యాంబెనగల్, అపర్ణాసేన్ సహా 50 మందిపైన కేసు నమోదైంది.
2019-10-04 Read Moreన్యూయార్క్ లోని బ్రాంగ్జ్ జూలో సింహాల ఆవరణలోకి ప్రవేశించి రెచ్చగొట్టిన మహిళకోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితురాలిని ‘మ్యా ఆట్రీ’గా గుర్తించారు. ఆమె జూలోని చెక్క ఫెన్స్ దాటి ఒక సింహానికి దగ్గరగా వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వీడియోను స్వయంగా షేర్ చేసింది. సింహం కొన్ని అడుగులు ముందుకు వేస్తున్నా లెక్క చేయకుండా ‘‘బేబీ హాయ్.. ఐ లవ్ యు’’ అంటూ డాన్స్ చేసింది. ఆమె జిరాఫీల ఆవరణలోకి కూడా అలాగే ప్రవేశించింది. జూ అధికారులు ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు.
2019-10-04 Read Moreఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే పథకం ‘‘వైఎస్ఆర్ వాహన మిత్ర’’ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ. 10 వేల చొప్పున ఐదేళ్ళలో రూ. 50 వేలు అందిస్తామని జగన్ ఈ సందర్భంగానూ పునరుద్ఘాటించారు. అక్టోబర్ 30 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆటో డ్రైవర్ తరహాలో ఖాకీ చొక్కా ధరించిన జగన్, యూనియన్ల నేతలు చేసిన చిరు సత్కారాన్ని స్వీకరించారు.
2019-10-04 Read Moreదేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనాల్లో భారతీయ రిజర్వు బ్యాంకు భారీ కోత విధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.1 శాతమే వృద్ధి చెందుతుందని శుక్రవారం ద్వైమాస విధాన ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు అంచనా ప్రకారం జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందవలసి ఉంది. అయితే, అనూహ్యంగా మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. రెండో త్రైమాసికంలో కూడా 5.3 శాతమే ఉంటుందని... 3,4 త్రైమాసికాల్లో 6.6 నుంచి 7.2 శాతం వరకు వృద్ధి నమోదు కావచ్చని తాజా అంచనా.
2019-10-04 Read Moreపోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ కేంద్రానికి నివేదిక పంపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ‘రివర్స్ టెండరింగ్’ చేపట్టింది. నిర్మాణ వ్యయం కింద సుమారు 4,000 కోట్లు రాష్ట్రానికి రావలసి ఉండగా, జూన్-జూలై సమయంలోనే రూ. 3,000 కోట్ల విడుదలకు కేంద్రం సిద్ధమైంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ చర్యల నేపథ్యంలో.. ఆ వ్యవహారం తేలాకే నిధులు విడుదల చేయవచ్చన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్టు తెలిసింది.
2019-10-04 Read Moreఇండియా-పాకిస్తాన్ అణు యుద్ధంతో తక్షణమే 12.5 కోట్ల మంది ప్రజలు చనిపోతారని, ప్రపంచవ్యాప్తంగా ‘‘న్యూక్లియర్ వింటర్’’తో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని ఓ అధ్యయనం అంచనా వేసింది. ‘‘ఆ యుద్ధం.. బాంబులు ప్రయోగించిన ప్రదేశాలకే కాదు. మొత్తం ప్రపంచానికే ప్రమాదం’’ అని హెచ్చరించింది ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రిక. 2025లో రెండు దేశాల మధ్య సంభవించే యుద్ధ దృశ్యాన్ని ఊహాజనితంగా ఈ అధ్యయనంలో ఆవిష్కరించారు. అప్పటికి ఇరు దేశాలవద్ద 400 నుంచి 500 అణుబాంబులు ఉంటాయని పేర్కొన్నారు.
2019-10-03 Read Moreదివాలా తీసిన భారతీయ రియల్ ఎస్టేట్ కంపెనీల సంఖ్య ఒక సంవత్సరంలోపు రెట్టింపు అయ్యింది. దివాలా కోర్టులోకి ప్రవేశించిన డెవెలపర్ల సంఖ్య 2018 సెప్టెంబర్ నాటికి 209 కాగా, 2019 జూన్ చివరి నాటికి 421కు పెరిగింది. కీలకమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్) పతనం తర్వాత సంక్షోభం తీవ్రతరమైంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభాన్ని దశాబ్దం క్రితం అమెరికాను, ఆ తర్వాత ప్రపంచాన్ని కుదిపేసిన లేమాన్ సంక్షోభంతో పోల్చుతున్నారు.
2019-10-03 Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బిజెపి మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ సోదరుడు దీపక్ నికల్జేను నిలబెట్టింది. పశ్చిమ మహారాష్ట్రలోని ఫల్తాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దీపక్ బరిలోకి దిగారు. డాన్ చోటా రాజన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆర్.పి.ఐ. అధినేత రామ్‌దాస్ అథవాలే మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కొన్నేళ్లుగా ఆర్‌పిఐతో ఉన్న నికల్జే, గతంలో ముంబైలోని చెంబూర్ నుంచి పార్టీ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు.
2019-10-03 Read Moreకోర్టుకు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడానికి జగన్ చూపిన కారణాలు సమంజసంగా లేవని, విజయవాడ నుంచి వారానికి ఓసారి హైదరాబాద్ వచ్చిపోవడం కష్టమేమీ కాదని సీబీఐ పేర్కొంది. జైలులో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసిన జగన్, ఇప్పుడు సిఎంగా ఆ పని మరింతగా చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై వాదనలను కోర్టు ఈ నెల 4న విననుంది.
2019-10-01