చైనాలోని చోంగ్ కింగ్ నగరంలో ‘స్కై బ్రిడ్జి’ నిర్మాణం తుది దశకు చేరుకుంది. 11.2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం ఉండే ఈ మెగా నిర్మాణంలో 8 ఆకాశ హర్మ్యాలను ఓ స్కై బ్రిడ్జి కలుపుతుంది. ఈ స్కై బ్రిడ్జి పొడవు 300 మీటర్లు.. వెడల్పు 32.5 మీటర్లు.. ఎత్తు 26.5 మీటర్లు. దానికి దిగువన ఉండే ఆకాశ హర్మ్యాలలో రెండు 350 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మిగిలినవాటి ఎత్తు 250 మీటర్లు. 9.2 హెక్టార్ల స్థలంలో తలపెట్టిన వీటి నిర్మాణానికి ఆరు సంవత్సరాలు పట్టింది. అధునాతన టెక్నాలజీని వినియోగించారు.
2019-02-27పాకిస్తాన్ యుద్ధ విమానం ఒకదాన్ని భారత ఆర్మీ కూల్చివేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని గుర్తించి వెంటనే భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 బైసన్ కూల్చేసిందని, పాకిస్తాన్ యుద్ధ విమానం ఆ దేశ సరిహద్దుకు లోపల కూలిపోవడాన్ని మన ఆర్మీ చూసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ ప్రతిదాడి క్రమంలో మిగ్ 21ను నష్టపోయామని, పైలట్ తప్పిపోయారని పేర్కొన్నారు. కూలిపోయిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్16గా వార్తలు వచ్చాయి.
2019-02-27పాకిస్తాన్ లోని జైషే మహ్మద్ స్థావరంపై భారత వైమానిక దళం బాంబు దాడి చేసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ఎదురు దాడికి దిగింది. ఐఎఎఫ్ ఫైటర్ విమానం మిగ్ 21ను తాము కూల్చేసినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిన ఆ యుద్ధ విమానం పైలట్ అభినందన్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్నాడు. విమానం కూలే సమయంలో పారాచ్యూట్ సాయంతో దిగిన అభినందన్ స్థానికుల చేతిలో దాడికి గురై రక్తమోడుతుండటం, తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ నని చెప్పడం వీడియోలలో స్పష్టంగా ఉంది.
2019-02-27ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధం కావాలని పాకిస్తాన్ ప్రజానీకానికి ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. బాలాకోట్ జైషే మహ్మద్ స్థావరంపై భారత వైమానిక దళం దాడులు చేసిన నేపథ్యంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత దాడికి పాకిస్తాన్ తప్పనిసరిగా స్పందిస్తుందని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరంపై దాడి చేశామని, చాలా మంది చనిపోయారని భారత ప్రభుత్వం చేసిన ప్రకటనను ‘‘కల్పితం’’గా ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేశారు.
2019-02-26పుల్వామా టెర్రిరిస్టు ఆత్మహుతి దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరంపై విరుచుకుపడింది. మంగళవారం వేకువ జామున భారత వైమానిక దళానికి చెందిన 12 మిరేజ్-2000 యుద్ధ విమానాలు బాలాకోట్ వద్ద ఉన్న జైష్ ఎ మహ్మద్ శిక్షణా కేంద్రంపై దాడి చేశాయి. సుమారు ఒక టన్ను బాంబులను మిరేజ్ యుద్ధ విమానాలు ప్రయోగించినట్టు సమాచారం. ఈ ‘మిలిటరీయేతర దాడి’లో పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు మరణించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు.
2019-02-26బీసీ వర్గాలకు సంబంధించి మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు ఇదివరకే తీసుకున్న నిర్ణయానికి సోమవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అందులో ఒకటి... ముదిరాజ్/ముత్రాసి/తెనుగోళ్ల సహకార ఆర్థిక సంస్థ. రెండవది నగరాలు/నాగవంశ సహకార ఆర్థిక సంస్థ. మూడవది కల్లుగీత/నీరాగీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ. ఏపీ సహకార సంఘాల చట్టం 1964 కింద ఈ సంస్థలు ఏర్పాటవుతాయి. బీసీ వర్గాలకోసం ఏర్పాటు చేసిన 13 కార్పొరేషన్లకు మేనేజింగ్ కమిటీల రూపురేఖలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2019-02-25విశాఖపట్నంలో ప్రతిపాదించిన అదానీ డేటా సెంటరుకు కోరిన రాయితీలను ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మతించింది. సోమవారం అమరావతిలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రాయితీ ప్రతిపాదనలను ఆమోదించింది. స్టాంపు డ్యూటీ, విద్యుత్ సుంకాలలో రాయితీలతోపాటు డేటా సెంటరు పరికరాలపై జీఎస్టీ రీ ఇంబర్స్ మెంట్ కావాలని అదానీ సంస్థ కోరింది. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ శ్రేణి’ డేటా సెంటరు వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది.
2019-02-25నదిలో మునక వేసినంత మాత్రాన చేసిన పాపాలు మాసిపోవని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రయాగ్ రాజ్ వద్ద నదిలో స్నానమాచరించిన నేపథ్యంలో మాయ ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ఎన్నికల హామీలను ఉల్లంఘించడం, ద్రోహం, ప్రభుత్వ పరంగా చేస్తున్న తప్పుల వంటి పాపాలను సంగంలో మునక వేయడం ద్వారా కడిగేసుకోగలరా? తమ జీవితాలను బాధామయం చేసిన బీజేపీని క్షమించడం ప్రజలకు సాధ్యం కాదు’’ అని మాయ ట్విట్టర్లో స్పష్టం చేశారు.
2019-02-25విధి నిర్వహణలో మరణించిన కేంద్ర పారా మిలిటరీ జవాన్లకు ‘‘అమరుల’’ హోదా కల్పించాలన్న తన విన్నపాన్ని ప్రధాని మోదీ అమలు చేయకపోవడానికి ఆయన అహంభావమే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ అంశంపై ఓ ట్వీట్ ను మోదీపై ఎక్కుపెట్టారు. ‘‘మన పారామిలిటరీ దళాల త్యాగాలను మనం గుర్తించి తీరాలి. వారికి అమరవీరుల గుర్తింపు ఇవ్వాలి’’ అని రాహుల్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమైనా మోదీ పారామిలిటరీ బలగాలకు మెరుగైన వేతనాలు ఇస్తారన్న ఆశాభావాన్ని రాహుల్ వ్యక్తం చేశారు.
2019-02-25 Read Moreరాష్ట్ర రాజధాని పేరుకు అమరావతే అయినా... తన మనసుకు మాత్రం కర్నూలు నగరమే రాజధాని అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కర్నూలు పర్యటనలో ఉన్న జనసేనాని సోమవారం ఆ నగరంలోని ఓ కన్వెన్షన్ హాలులో విద్యార్ధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తే కర్నూలు నగరానికి పూర్వ వైభవం తెస్తామని, రాజధాని అమరావతిని మించిన నగరంగా నిర్మిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ‘‘రాయలసీమకు ఎవరు ఎంత చేశారో తెలియదు. నేను మాత్రం బాధ్యతతో పని చేసి సీమలోని ప్రతి చెట్టు, గట్టును కాపాడతా’’ అని ఉద్ఘాటించారు.
2019-02-25 Read More