అమెరికాతో సైనిక-అంతరిక్ష సహకారానికి ఉద్ధేశించిన ద్వైపాక్షిక ఒప్పందంపై భారత ప్రభుత్వం రేపు (మంగళవారం) సంతకాలు చేయనుంది. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల (2+2) సమావేశం సందర్భంగా ప్రాథమిక పరస్పర మార్పిడి, సహకార ఒప్పందం (BECA) కుదుర్చుకోనుంది. సున్నితమైన సైనిక సమాచార మార్పిడికి, ఆధునిక ఆయుధాల కొనుగోలుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని చెబుతున్నారు. అమెరికా అందించే ఉపగ్రహ సమాచారంతో ఇండియా క్షిపణులు, డ్రోన్లు కచ్చితంగా లక్ష్యాలను ఛేదించగలవని భావిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యల నేపథ్యంలో అమెరికాతో భారత ప్రభుత్వం వరుస ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
2020-10-26లడఖ్ లోని లేహ్ స్వయంపాలక కొండప్రాంత అభివృద్ధి మండలి (LAHDC- Leh)కి జరిగిన ఎన్నికల్లో 26 స్థానాలకు గాను బిజెపి 15 గెలుచుకుంది. మిగిలిన తొమ్మిది కాంగ్రెస్ వశమయ్యాయి. 2015 ఎన్నికలతో పోలిస్తే బిజెపికి మూడు సీట్లు తగ్గాయి. కేవలం 1.33 లక్షల జనాభా గల లేహ్ కోసం... బిజెపి ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో పోరాడింది. 8 మంది కేంద్ర మంత్రులు బిజెపి తరపున ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడటానికి రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు హోదా కల్పించాలన్న డిమాండ్ కు బిజెపి మద్ధతు ఇచ్చింది. అయినా సీట్లు తగ్గడం గమనార్హం.
2020-10-26‘‘ఇండియా ఓ పోరులో గెలవాలని అనుకుంటే, అది కరోనా వైరస్ పై పోరులో విజయంపై దృష్టి పెట్టాలి’’ అని చైనా మీడియా సూచించింది. చైనా, పాకిస్తాన్ లపై యుద్ధం చేయబోయే తేదీని మోదీ నిర్ణయించారంటూ బిజెపి యూపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై చైనా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ స్పందించింది. ‘‘దేశంలో పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా కొంతమంది ఇండియన్ల మదిలో మాత్రం యుద్ధం ఎప్పుడూ ఉంటుంది’’ అని పత్రిక వ్యాసంలో పేర్కొన్నారు. ఇలాంటి ఆశావహ ప్రకటనలు... ఇండియా చాలా శక్తివంతమైనదని, చైనా- పాకిస్తాన్ లతో యుద్ధం చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందని తోటి ఇండియన్లను మభ్యపెట్టడానికేనని ఆక్షేపించింది.
2020-10-26ఇతర రాష్ట్రాల్లో తయారైన మద్యాన్ని రాష్ట్రంలోకి రవాణా చేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో అమలవుతున్న పన్నులు, సుంకాలు, ఫీజులు చెల్లించిన మద్యానికే అనుమతి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. అంటే, పొరుగు రాష్ట్రాల్లో పన్నులు చెల్లించినా తిరిగి ఇక్కడా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో విదేశీ మద్యానికి మాత్రం యథాతథంగా అనుమతి ఉంటుంది. పొరుగు మద్యం మూడు సీసాల వరకు తెచ్చుకునేలా గతంలో అవకాశం ఉండగా... ఏపీలో అధిక ధరల కారణంగా చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమ్మకాలపై ఇది ప్రభావాన్ని చూపడంతో
2020-10-26పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడెందుకు కాదంటున్నదో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం అంగీకరించిందని గుర్తు చేశారు. 22 మంది వైసీపీ ‘పనికిమాలిన’ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం కోసం కేంద్రంపై పోరాడాలని సూచించారు. లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
2020-10-262017లో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ చేసిన ఓ తీర్మానం పోలవరానికి శాపమైందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. నిర్వాసితుల పునరావాసం సహా ప్రాజెక్టు మొత్తం కేంద్రం బాధ్యత అయినప్పుడు, నిర్మాణ బాధ్యతను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు తీసుకుందని మంత్రి ప్రశ్నించారు. ‘మీ ప్యాకేజీల కోసం కాదా’ అని టీడీపీని ప్రశ్నించారు. రూ. 29 వేల కోట్ల పునరావాస ప్యాకేజీని వదిలేసి 2013 నాటి అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సిఎం జగన్ ప్రధానమంత్రిని కలుస్తారని చెప్పారు.
2020-10-26విభజన హామీలలో ప్రధానమైన ‘ప్రత్యేక హోదా’కు గతంలోనే సమాధి కట్టిన కేంద్ర ప్రభుత్వం, రెండో ప్రధాన హామీ పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ముసుగు తొలగించింది. ప్రాజెక్టులో డ్యామ్ నిర్మాణానికి మాత్రమే తాము నిధులు ఇస్తామని, ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ-పునరావాస ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. విజయవాడ వాసి సౌరభ్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద సమర్పించిన దరఖాస్తుకు కేంద్రం బదులిచ్చింది. ఇప్పటివరకు ఖర్చయిన రూ. 8,614 కోట్లలో కేంద్రం నుంచి నేరుగా రూ. 950 కోట్లు, నాబార్డు ద్వారా రూ. 7,664 కోట్లు వచ్చినట్టు ఆ సమాధానంలో పేర్కొన్నారు.
2020-10-26పాకిస్తాన్, చైనా స్వాధీనం చేసుకున్న భారత భూభాగంలో ప్రతి అంగుళాన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని బిజెపి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రవీందర్ రైనా ఉద్ఘాటించారు. అందుకోసం సైనిక బలాన్ని వినియోగించడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. చైనా, పాకిస్తాన్ లో యుద్ధం తేదీని మోదీ ముందే నిర్ణయించారని నిన్న యూపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ బిజెపి నేత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ అధినేత మోహగ్ భగవత్... శక్తి, వ్యాప్తిలో చైనా కంటే ఇండియా పెద్దగా ఎదగాలని నిన్ననే వ్యాఖ్యానించారు.
2020-10-26వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వ్యవస్థ విఫలమైందని, ఈ విషయాన్ని ముందుగా ప్రధానమంత్రి అంగీకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించారు. పాత పన్నుల విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ‘ఒక దేశం.. ఒకటే పన్ను’ పేరిట కేంద్ర, రాష్ట్రాల పరోక్ష పన్నులను విలీనం చేసి జి.ఎస్.టి.ని ప్రవేశపెట్టారు. దీంతో ప్రజలపై పన్ను భారం పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిహారమూ చెల్లించకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే డిమాండ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
2020-10-25చైనా, పాకిస్తాన్ లతో దేశం ఎప్పుడు యుద్ధం చేయాలో ప్రధాని మోదీ ముందే నిర్ణయించారా? అవునంటున్నారు ఉత్తరప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్. ఈ వివాదాస్పదాస్పద వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ‘‘రామమందిరం, ఆర్టికల్ 370 తరహాలోనే పాకిస్తాన్, చైనాలతో యుద్ధం ఎప్పుడు జరుగుతుందో మోదీ నిర్ణయించారు’’ అని సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘సంబంధిత తేదీ నిర్ణయమైంది’’ అని ఉద్ఘాటించారు. బిజెపి ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020-10-25 Read More