తాము అధికారంలోకి వస్తే ‘‘నీతి ఆయోగ్’’ సంస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని మోదీ మార్కెటింగ్ కోసం ప్రెజెంటేషన్లు చేయడం, గణాంకాలను వక్రీకరించడం తప్ప ఆ సంస్థ చేసిందేమీ లేదని శుక్రవారం ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ స్థానంలో.. ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులతోపాటు 100మంది సిబ్బంది ఉండేలా ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని రాహుల్ తెలిపారు. భారత ప్రథమ ప్రధాని ప్రారంభించిన ప్రణాళికా సంఘాన్ని నరేంద్ర మోదీ ప్రధాని కాగానే రద్దు చేసి ‘నీతి ఆయోగ్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
2019-03-30ఉపగ్రహాన్ని కూల్చిన మిసైల్ (మిషన్ శక్తి) ప్రయోగం తర్వాత జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగలేదని ఈసీ శుక్రవారం రాత్రి స్పష్టం చేసింది. సీపీఎం నేత సీతారాం ఏచూరి చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అధికారులు ముగ్గురు విచారించి.. ప్రధాని నిబంధనావళిని ఉల్లంఘించలేదని తేల్చారు. మార్చి 27వ తేదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కాలేదని, ఎఎన్ఐ ఇచ్చిన వీడియోనే దూరదర్శన్ ఉపయోగించిందని కమిటీ పేర్కొంది. రక్షణ సంబంధ ప్రకటనల్లో ఈసీ అనుమతి అవసరం లేదని కూడా అధికారులు చెప్పారు.
2019-03-30 Read Moreభారత అతిపెద్ద ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీపై శుక్రవారం లండన్ కోర్టులో ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. విజయ్ మాల్యాను పెట్టే జైలు గదిలోనే నీరవ్ మోదీని కూడా ఉంచుతారా? అని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎమ్మా అర్బత్ నాట్ ప్రాసిక్యూషన్ లాయర్ ను అడిగారు. నీవర్ మోదీ అప్పగింతను ఇండియాలోని ఏ ప్రాంతం కోరుతోంది? అని జడ్జి అడిగిన ప్రశ్నకు, ‘‘ముంబయికి పంపవచ్చు. విజయ్ మాల్యాకోసం సిద్ధం చేసిన ఆర్ధర్ రోడ్డు జైలులోనే మోదీనీ ఉంచవచ్చు’’ అని ప్రాసిక్యూషన్ లాయర్ బదులిచ్చారు. దీంతో ఆమె సరదాగా ‘ఒకే సెల్’ ప్రశ్న వేశారు.
2019-03-30 Read Moreఇండియానుంచి పరారైన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి లండన్ కోర్టు రెండోసారి కూడా బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే నిందితుడు లండన్ నుంచి కూడా పరారయ్యే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేయవచ్చని, ఆధారాలను నాశనం చేయవచ్చని ప్రాసిక్యూషన్ వాదించింది. సాక్షులను చంపుతామని మోదీ బెదిరించారని ఇండియా తరపున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు (సిపిఎస్) లాయర్ టోబీ క్యాడ్ మన్ కోర్టుకు నివేదించారు. మార్చి 19న అరెస్టయిన వెంటనే బెయిల్ కోరిన మోదీకి నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 26న జరగనున్న మరో హియరింగ్ వరకు మోదీ జైల్లోనే గడపాల్సి ఉంటుంది.
2019-03-30బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఎంపీ శత్రుఘ్న సిన్హా నిర్ణయాన్ని ఆయన కుమార్తె, బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా సమర్ధించారు. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం ‘‘హిందూస్థాన్ టైమ్స్’’తో మాట్లాడిన సోనాక్షి.. తన తండ్రికి దక్కాల్సిన గౌరవం బీజేపీలో లభించలేదని చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీన సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీహార్ లోని పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు ఎన్నికైన సిన్హా, గత రెండేళ్ళుగా నరేంద్ర మోదీ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
2019-03-30ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాదుల్లా మారారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రధాని కర్నూలు సభ తర్వాత ముఖ్యమంత్రి స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సహకరించలేదని, రాజధాని శంఖుస్థాపనకు పిలిస్తే మట్టి, నీళ్ళు ఇచ్చిపోయారని ధ్వజమెత్తారు. తనను యు టర్న్ బాబు అంటున్న మోడీ, 31 కేసుల్లో నిందితుడికి కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. ‘‘కోడికత్తి పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్)కి కేసీఆర్ డబ్బు పంపుతాడు. ఈయనా (మోదీ) పంపిస్తాడు’’ అని ఆరోపించారు.
2019-03-29ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి రెండు ఇంజన్లలా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. రాష్ట్ర ముఖ్యమంత్రిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పథకాల రూపకల్పనే కుంభకోణాలతో మొదలవుతోందని ప్రధాని ఆరోపించారు. చంద్రబాబును యూ టర్న్ బాబు, స్టిక్కర్ బాబుగా ఎద్దేవా చేశారు. తాను ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే బాబు యు టర్న్ తీసుకున్నారని, కేంద్ర పథకాలకు తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
2019-03-29‘‘ప్రధాని లోకేష్ స్థాయికి తగ్గాడు. దిగజారి నా కుమారుడిని శాపనార్ధాలు పెడుతున్నాడు. నేను సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాను. మోదీ సన్ సెట్ అంటున్నాడు.. నా కొడుకు అస్తమిస్తాడని’’... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి. కర్నూలు సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘‘నాకు నా కుమారుడంటే ప్రేమ ఉంది. మోడీ.. నీకూ బిడ్డలుంటే ఆ వాత్సల్యం తెలిసేది. విలువలున్నాయా? కుటుంబ సంప్రదాయాలు తెలుసా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
2019-03-29ఏప్రిల్ 11న ప్రజలు వేసే ఓటుతో ఆంధ్రప్రదేశ్ లో సూర్యోదయం (SUN-Rise), కుమార అస్తమయం (SON-Set) ఒకేసారి జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శుక్రవారం కర్నూలు బహిరంగ సభలో మాట్లాడిన మోదీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ని ఉద్ధేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘SUN అంటే సూర్యుడు.. SON అంటే కుమారుడు. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో SUN రైజ్ అవుతుంది. రాసి పెట్టుకోండి... అవినీతి కుమార అస్తమయం చూస్తారు’’ అని మోదీ ఉద్ఘాటించారు. సూర్యోదయం కావాలంటే... కుమార అస్తమయం జరగాలా వద్దా? అని సభికులను ప్రశ్నించారు.
2019-03-29‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే అందరూ భయపడ్డారు. నేను భయపడను. ఏం చేస్తాడు.. చంపేస్తాడు..అంతే కదా! లేదంటే ఈడీతో దాడులు చేయిస్తాడు’’ అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రధానమంత్రి కర్నూలు సభలో చేసిన విమర్శలకు రాజమండ్రి రోడ్ షోలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలకు ముందు కర్నాటకలో మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్ళపైన ఐటీ దాడులు చేయించారని, ఏపీలో తెలుగుదేశం నాయకులపై మళ్లీ పడతారని వార్తలు వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.
2019-03-29