ఆఫీసులు మారిస్తే అభివృద్ధి జరుగుతుందా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రాజధానితోనే అభివృద్ధి జరగదని చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ముఖ్యపట్టణం మచిలీపట్నం అయినా విజయవాడే అభివృద్ధి చెందిందని, చిత్తూరు జిల్లా ముఖ్య పట్టణం కాకుండా తిరుపతి అభివృద్ధి చెందిందని ఉదహరించారు. విశాఖపట్నం ప్రజలు రాజధాని కాావాలని కోరలేదని, అభివృద్ధి కావాలన్నారని చెప్పారు.
2020-01-12తొమ్మిది నెలల నుంచి తాను మద్యం తాగలేదని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్ చెప్పారు. కావాలంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలని కోరారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు. పదవి లేదు కాబట్టి ఇప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, రేపటి నుంచి ఏదైనా మాట్లాడతానని, అందరినీ కడిగిపారేస్తానని అన్నారు. అమరావతి రైతులందరినీ తాను పెయిడ్ ఆర్టిస్టులనలేదని పృథ్వీ వివరణ ఇచ్చారు.
2020-01-12ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తాను ఢిల్లీ సమావేశం ముగించుకొని నేరుగా కాకినాడకే వస్తానని, అక్కడే తేల్చుకుందామని వైసీపీకి సవాలు విసిరారు. జరిగిన సంఘటనకు కారకులైన వైసీపీ నాయకులను వదిలేసి, జనసేన నాయకులపై ఐపిసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని పవన్ విమర్శించారు. శనివారం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జనసేన అధినేతను బూతులు తిట్టడంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ మొదలైంది.
2020-01-12ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. టీటీడీ ఉద్యోగినితో పృథ్వీ సరస సంభాషణల ఆడియో బయటకు వచ్చిన కొన్నిగంటలకే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. సంభాషణ విషయంలో పృథ్వీపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారని, చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారని వార్తలొచ్చాయి. ఆ వెంటనే పృథ్వీ తనంతతానుగా పదవికి రాజీనామా చేశారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ తనది కాదని, ఆ ఆరోపణలను ఖండిస్తున్నానని పృథ్వీ చెప్పారు.
2020-01-12అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైన నాటినుంచి గ్రామాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. ఎక్కడ నిరసన తలపెడితే అక్కడ గ్రామ వీధుల్లో కవాతు చేస్తూ ప్రజలను భయపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం పొద్దున్నే మందడం వీధుల్లో పోలీసులు భారీ కవాతును నిర్వహించారు. సందులు, గొందుల్లో తిరుగుతూ నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మైకులో హెచ్చరించారు. 144 సెక్షన్ పేరు చెప్పి బయటకే రాకుండా నిరోధించే ప్రయత్నం చేశారు.
2020-01-12శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్.వి.బి.సి) ఛైర్మన్ పృథ్వీరాజ్ ‘‘సరస సంభాషణ’’ల ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా ఉద్యోగితో ‘‘నిన్ను ఆఫీసులో చూసి వెనుకనుంచి గట్టిగా పట్టుకోవాలనిపించింది. అరుస్తావేమోనని ఆగిపోయాను’’, ‘‘ఐ లవ్ యూ’’ అంటూ ఫోనులో మాట్లాడటం రికార్డయింది. ఆ మహిళ కూడా నవ్వుతూ స్పందించారు. పృథ్వి వ్యవహార శైలిని బయటపెట్టాలనే ఉద్ధేశంతో సానుకూలంగా మాట్లాడినట్లు అనిపిస్తోంది.
2020-01-12రాజధాని అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం విచారణ చేపట్టింది. ఆదివారం తుళ్ళూరులో కమిషన్ సభ్యులు బాధితుల గోడు విన్నారు. తమను తమ గ్రామంలోనే బంధీలను చేశారని, పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఫిర్యాదు చేశారు. ‘మమ్మల్ని బతకనిచ్చేలా లేదు ఈ ప్రభుత్వం’ అని ఓ మహిళ కన్నీళ్ళతో చెప్పింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు కొట్టారని పలువురు గాయాలు చూపించారు. సెల్ ఫోన్ వీడియోలనూ చూపించారు.
2020-01-12కాకినాడ రాజకీయ రణరంగమైంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటివద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. నిన్న పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి ‘నువ్వు చేసే పనులు లం.. చేసినట్టు చేస్తున్నావు దొంగ నా కొ..కా’ అని ఎమ్మెల్యే బూతులు తిట్టారు. అందుకు నిరసనగా ఆదివారం జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి ప్రదర్శనగా వెళ్ళారు. ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో, రాళ్ళతో దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు.
2020-01-12ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కావాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని ఆర్థికవేత్తలు చెబుతుంటే.. హోంమంత్రి అమిత్ షా మాత్రం 2024 నాటికి అయి తీరుతుందని చెబుతున్నారు. శనివారం గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జిటియు) స్నాతకోత్సవంలో షా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితి (మందగమనం) తాత్కాలికమేనని షా అభిప్రాయపడ్డారు. ఇండియా తొలి 70 సంవత్సరాలలో $2 ట్రిలియన్లకు మాత్రమే చేరిందని పేర్కొన్నారు.
2020-01-11మిడతల దండు వాలిన పొలాలు ఎలా ఉంటాయో... రాజధాని అమరావతి గ్రామాలు ఇప్పుడు అలా ఉన్నాయి. పోలీసుల పదఘట్టనలతో కళ తప్పాయి. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి ఆనుకొని ఉంది మందడం. రెండు రోజులుగా అక్కడ కనిపిస్తున్న దౌర్జన్య దృశ్యాలు శనివారం శృతి మించాయి. పై చిత్రంలోని యువతి... పొత్తికడుపు దగ్గర తొక్కిపట్టడం వల్ల ఆసుపత్రి పాలైంది. ఓ వృద్ధ మహిళకు చేయి విరిగింది. పోలీసులు లాఠీలు, చేతులకు పని చెప్పడంతో మరికొంతమంది గాయపడ్డారు.
2020-01-11