47 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపై పరిశోధన కోసం రష్యా ప్రయోగించిన ‘లూనా-25’ విఫలమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫీగా దిగడానికి నిర్దేశించిన కక్ష్య నుంచి లూనా అంతరిక్ష వాహనం అనూహ్యమైన మలుపు తీసుకుందని, ఫలితంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్ కాస్మోస్’ ఓ ప్రకటనలో తెలిపింది. లూనా వైఫల్యంతో ఇప్పుడు అందరి దృష్టి ‘చంద్రయాన్ 3’పైనే కేంద్రీకృతమైంది. చంద్రయాన్ 3 లాండర్ కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగవలసి ఉంది.
2023-08-20భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన మానవ రహిత వైమానిక వాహనం (యు.ఎ.వి) ‘తపస్’ ఆదివారం కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో కూలిపోయింది. సాంకేతిక లోపంతోనే ‘తపస్’ కూలిపోయిందని పేర్కొన్న DRDO, ఈ ఘటనతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. కూలిన ఘటనపై సదరు సంస్థ విచారణ చేపట్టింది. ‘తపస్’ ఓ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరన్స్ (MALE) డ్రోన్. వాయుమార్గంలో నిఘా కార్యకలాపాలకు ఉద్ధేశించినది. ఇప్పటివరకు ఈ యు.ఎ.వి.ని 200 సార్లు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
2023-08-20సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీసు రికార్డుల్లో మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. ఆదివారం నాటికి (11 రోజుల్లో) ఇండియాలో రూ. 279.15 కోట్లు వసూలు చేసిన జైలర్ సినిమా, విదేశాల్లో మరో 220.85 కోట్లు రాబట్టింది. అమెరికాలో మంచి ఫలితాలు సాధించి గల్ఫ్ దేశాల్లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అత్యధిక వసూళ్ళు సాధించిన రజినీకాంత్ సినిమాల్లో జైలర్ రెండవది. ఇంతకు ముందు రోబో-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 723 కోట్లు రాబట్టింది.
2023-08-20దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవరించిన వేళ.. కేంద్ర ప్రభుత్వం 9,79,327 ఖాళీ పోస్టులపై కదలకుండా కూర్చుంది. ఒక్క కేంద్ర ప్రభుత్వ శాఖలలోనే ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమైన విషయమైతే.. అందులో 70 శాతం వ్యూహాత్మకంగా ముఖ్యమైన రక్షణ, రైల్వే, హోం శాఖలలోనే ఉండటం గమనార్హం. గురువారం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ప్రకారం.. రక్షణ శాఖ (సివిల్)లోనే 2,64,706 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2,93,943 ఖాళీలతో రైల్వే శాఖ ప్రథమ స్థానంలో ఉండగా, హోం శాఖ 1,43,536 ఖాళీలతో మూడో స్థానంలో ఉంది.
2023-02-02రూ. 15,993 కోట్ల అంచనా వ్యయంతో 75.3 కి.మీ. పొడవున నిర్మించ తలపెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనా అందలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అధికార వైసీపీ ఎం.పి.లు ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ), బివి సత్యవతి (అనకాపల్లి) అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి కౌశల్ కిశోర్ లోక్ సభలో బదులిచ్చారు. 2018 సెప్టెంబరులో లైట్ మెట్రో ప్రాజెక్టు (42.55 కి.మీ) కోసం ప్రతిపాదన అందిందని, అయితే దానికి నిధులివ్వలేమని కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు తెలిపిందని వివరించారు.
2023-02-022014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు.. పోలవరం ప్రాజెక్టు భూసేకరణకోసం రూ. 3431.59 కోట్లు, పునరావాసానికి రూ. 2110.23 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం సహా అనుమతించిన ఖర్చులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యమూ లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా భూసేకరణ కింద రూ. 3,779.5 కోట్లకు, పునరావాస పనులకు కింద రూ. 2,257.29 కోట్లకు బిల్లలు సమర్పించినట్టు కేంద్రం గురువారం లోక్ సభలో వివరించింది.
2023-02-02పోలవరం నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నగదు బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రతికూల స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టు ఆమోదానికి అనుగుణంగా లేదని జలవనరుల శాఖ మంత్రి గురువారం లోక్ సభలో తేల్చి చెప్పారు. ‘‘పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ చేయాలని 2022 ఏప్రిల్ లో ఏపి ప్రభుత్వం విన్నవించింది. అయితే, ఈ సూచన.. ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే చేపట్టేలా భారత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదానికి అనుగుణంగా ఉన్నట్టు మేం భావించలేదు’ అని మంత్రి స్పష్టం చేశారు.
2023-02-02ఇవే తనకు చివరి ఎన్నికలన్న చంద్రబాబు మాటల్లో ఓటమి భయం, నిస్పృహ కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడూ సెల్ టవర్లు ఎక్కి దూకేస్తామని బెదిరించే వారిలాగే ఇప్పుడు ‘అధికార భగ్నప్రేమికుడు’ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ‘ఇదేం ఖర్మరా బాబూ’ అనుకుంటున్నారని జగన్ సోమవారం నరసాపురం సభలో వ్యాఖ్యానించారు.
2022-11-21ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శంకుస్థాపన చేశారు. నవంబర్ 21 ప్రపంచ ఫిషరీస్ దినోత్సవమని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, ఈ వర్శిటీతో రాష్ట్రంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే అక్వా యూనివర్శిటీలు ఉన్నాయని సిఎం జగన్ చెప్పారు.
2022-11-21జి20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా వెళ్ళనున్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇండోనేషియాలో ఉండే ప్రధాని, జి20 సదస్సులో భాగంగా జరిగే సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. ఇండోనేషియాలోని భారత సంతతితో కూడా ఆయన సమావేశమవుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి గురువారం చెప్పారు.
2022-11-10