ఆంధ్రప్రదేశ్ లోనూ ‘కరోనా’ వైరస్ విజృంభించింది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 2432 కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 100కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 20 మందికి వైరస్ నిర్ధారణ కాగా మిగిలిన 2412 కేసులూ రాష్ట్రంలో విస్తరిస్తున్న మహమ్మారికి దర్పణం పడుతున్నాయి. పాజిటివిటీ రేటు అసాధారణంగా పెరిగింది. గత నెల వరకు 2 శాతం కంటే తక్కువగా ఉండగా.. మంగళవారం నిర్వహించిన 22,197 పరీక్షలలో ఏకంగా 10.87 శాతానికి వైరస్ నిర్ధారణ అయింది.
2020-07-15‘కరోనా’పై పోరాటంలో భాగమైన బెంగాల్ ఐఎఎస్ అధికారి దేవదత్తా రే ఆ వైరస్ తీవ్రతకే బలయ్యారు. 38 సంవత్సరాల దేవదత్తా హుగ్లీ జిల్లా చందన్ నగర్ సబ్ డివిజన్ డిప్యూటీ కలెక్టరుగా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ‘కరోనా’ లక్షణాలు బయటపడటంతో.. ఉత్తర కోల్ కత లోని డమ్ డమ్ ప్రాంతంలో ‘హోం క్వారంటైన్’లో ఉంటున్నారు. ఆదివారం శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో సెరంపూర్ లోని శ్రమజీవి ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయానికి మరణించారు. దేవదత్తా రే మానవీయంగా వ్యవహరించే అధికారి అని సహచరులు, తన కింది స్థాయి సిబ్బంది కొనియాడుతున్నారు.
2020-07-14కరోనా వైరస్ డిసీజ్ (కోవిడ్) బాధితులకు వైద్యం చేయడానికి నిరాకరించే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ‘కోవిడ్’తో మరణించినవారి అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇవ్వాలని సిఎం మంగళవారం ‘కరోనా’ సమీక్షా సమావేశంలో ఆదేశించారు. కరోనా బాధితుల అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కరోనా’ వ్యాప్తిని ఎదుర్కోవడానికి 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పైగా నర్సుల ‘డేటాబేస్’ సిద్ధం చేశామని అధికారులు సిఎంకు వివరించారు.
2020-07-14‘కరోనా’ కాలంలో సాధారణ ప్రజలు ఆదాయాలు కోల్పోయి అల్లాడుతుంటే.. ముంబై మహా సంపన్నుడు ముఖేష్ అంబానీ మాత్రం ప్రపంచ కుబేరుల్లో రోజుకొక్కరిని వెనుకకు నెట్టి పైపైకి ఎగబాకుతున్నారు. అపర కుబేరుల్లో ఆయన తాజా ర్యాంకు 6. ముఖేష్ తన సంపదకు తాజాగా రూ. 16,300 కోట్లను జోడించి 72.4 బిలియన్ డాలర్ల (రూ. 5,43,000 కోట్ల)కు పెంచుకున్నారు. అదే సమయంలో గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ 1.12 బిలియన్ డాలర్లు కోల్పోయి 71.6 బిలియన్ డాలర్లతో 7వ స్థానానికి జారిపోయారు. లారీ పేజ్ కంటే ముందు ఎలోన్ ముస్క్, వారెన్ బఫెట్ లను ముఖేష్ అధిగమించారు.
2020-07-14ఇరాన్ లోని చాబహార్ పోర్టు నుంచి ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని జహేదాన్ వరకు తలపెట్టిన రైల్వే లైన్ ప్రాజెక్టు ఇండియా చేజారిపోయింది. చాబహార్ పోర్టు ఇండియాకు వ్యూహాత్మకంగా కీలకమైనది. అక్కడినుంచి జహేదాన్ వరకు 628 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ నిర్మాణానికి ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ (ఐ.ఆర్.సి.ఒ.ఎన్), ఇరాన్ రైల్వేస్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. అయితే, అమెరికా ఒత్తిడితో ఇండియా గత ఏడాది చమురు దిగుమతులను పూర్తిగా తగ్గించడం, చైనాతో ఇటీవల కుదిరిన 400 బిలియన్ డాలర్ల వ్యూహాత్మక ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒప్పందం కుదిరి నాలుగేళ్ళయినా ఇండియా ఈ ప్రాజెక్టును ప్రారంభించకపోవడాన్ని
2020-07-14 Read Moreతాను డిప్యూటీ సిఎంగా ఉన్న సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ఉధ్వాసనకు గురయ్యారు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఆయనను అధిష్ఠానం తొలగించింది. సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసినా.. సిఎం అశోక్ గెహ్లాట్ రాజకీయ అనుభవం, చాతుర్యంతో నిన్న సిఎల్పీ సమావేశంలో బలప్రదర్శన చేశారు. మంగళవారం మళ్ళీ సమావేశమైన సీఎల్పీ సచిన్, ఆయన సహచర తిరుగుబాటు నేతలు ఇద్దరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని తీర్మానించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
2020-07-14ఇటీవల ఇండియాపై విరుచుకుపడుతున్న నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇప్పుడు ఏకంగా ‘రామబాణం’ వదిలారు. నిజమైన అయోధ్య ఇండియాలో లేదని, అది తమ దేశంలో ఉందని సోమవారం సరికొత్త వాదన వినిపించారు. ‘రాముడు నేపాలీ, ఇండియన్ కాదు’ అని ఓలి వ్యాఖ్యానించినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. రాముని జన్మస్థలం అయోధ్య.. దక్షిణ నేపాల్ లోని తోరిలో గల వాల్మీకి ఆశ్రమం దగ్గరలో ఉందని, ఉత్తరప్రదేశ్ లో కాదని ఓలి ఉద్ఘాటించారు. సాంస్కృతిక దురాక్రమణలో నేపాల్ బాధితురాలు అని, చరిత్ర వక్రీకరణకు గురైందని ఓలి వాపోయారు.
2020-07-14ఎల్.జి. కెమికల్స్ గ్యాస్ లీకేజీ, ఇతర పారిశ్రామిక ప్రమాదాలతో వణికిపోయిన విశాఖలో మరో విపత్తు సంభవించింది. పరవాడ ఫార్మా సిటీలోని రాంకీ సిఇటిపి సాల్వెంట్స్ ఫ్యాక్టరీ సోమవారం రాత్రి అగ్ని కీలల్లో చిక్కుకుంది. లోపల ఉన్న ట్యాంకుల పేలుడుకు ఓ భవనం పూర్తిగా ధ్వంసమైంది. భారీ పేలుళ్ళతో విశాఖ నగర, శివారు గ్రామాల ప్రజల గుండెలు గుభేలుమన్నాయి. ఘటన విషయం తెలిసి అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు. ఫ్యాక్టరీ వర్కర్లలో కొంతమంది లోపల చిక్కుకుపోయారు. అగ్ని కీలల కారణంగా దట్టమైన పొగ చుట్టుప్రక్కలకు వ్యాపించింది.
2020-07-14‘కరోనా’ ఆరోహణ క్రమం ఇప్పట్లో నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. శనివారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2.3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇండియాలో 28 వేలకు పైగా నమోదు కాగా, అమెరికాలో 66,528 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఒక్క ఫ్లోరిడా రాష్ట్రంలోనే 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి వైరస్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా 1.3 కోట్లకు, అమెరికాలో 34 లక్షలకు, ఇండియాలో 8.75 లక్షలకు చేరువయ్యారు.
2020-07-12అమితాబ్ బచ్చన్ కుటుంబంలో మూడు తరాలూ ‘కరోనా’ బారిన పడ్డాయి. అమితాబ్, అభిషేక్ లకు ‘కరోనా’ సోకినట్టు నిన్న నిర్ధారణ కాగా.. ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఆయన కోడలు, నటీమణి ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య (8) లకు కూడా ‘కరోనా’ సోకినట్టు నిర్ధారణ అయింది. వారిద్దరూ ఇంట్లోనే ‘స్వీయ నియంత్రణ’లో ఉంటారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇతర కుటుంబ సభ్యులకు నెగెటివ్ ఫలితం వచ్చిందని తెలిపారు. ‘‘ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, భద్రంగా ఉండండి. దయచేసి నిబంధనలు పాటించండి’’ అని అభిషేక్ ఈ సందర్భంగా విన్నవించారు.
2020-07-12