2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి బడ్జెట్ సుమారు రూ. 2 లక్షల కోట్లతో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసిన బడ్జెట్ ముందస్తు సమావేశం అనంతరం బుగ్గన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల రూ. 1.91 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
2019-06-21వేగంగా 20,000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సాధించనున్నాడు. శనివారం ఆప్ఘనిస్తాన్ తో ఆడే ప్రపంచ కప్ మ్యాచ్ లోనే ఈ రికార్డు నమోదు చేస్తాడా..లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కోహ్లీ 20,000కు ఇంకో 104 పరుగులు దూరంలో ఉన్నాడు. అన్ని పరుగులు సాధించడానికి సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా 453 ఇన్నింగ్స్ ఆడగా కోహ్లీ ఇప్పటిదాకా 415 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. వన్డేలలో 11,020 పరుగులు, టెస్టులలో 6613 పరుగులు, ట్వంటీ20లలో 2,263 పరుగులు సాధించాడు.
2019-06-21ట్రిపుల్ తలాఖ్ బిల్లును శుక్రవారం లోక్ సభలో కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యతిరేకించారు. ‘ట్రిపుల్ తలాఖ్’కు తాము వ్యతిరేకమేనని, సుప్రీంకోర్టు తీర్పుతో ఆ అనాచారానికి కాలం చెల్లిందని, అయితే దానిపైన ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఒక మతాన్ని లక్ష్యంగా చేసిందని కాంగ్రెస్ నేత శశిథరూర్ విమర్శించారు. ఈ బిల్లులో ముస్లిం పురుషులకు నిర్దేశించిన మూడేళ్ల జైలు శిక్షను ప్రస్తావించిన అసదుద్దీన్ ఒవైసీ, అలాంటి నేరమే చేసిన ముస్లిమేతర పురుషులకు ఏడాది జైలు శిక్ష ఉందని చెప్పారు.
2019-06-21ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు 2019 లేదా ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్ సభ శుక్రవారం 186-74 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. ‘ట్రిపుల్ తలాఖ్’పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అనాచారాన్నినిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరి మాసాల్లో ఆర్డినెన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా దేశంలో 200కు పైగా ట్రిపుల్ తలాఖ్ కేసులు నమోదయ్యాయని బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
2019-06-21క్రికెట్ ప్రపంచకప్2019లో కేవలం రెండో విజయంతో శ్రీలంక జట్టులో సెమీఫైనల్స్ ఆశలు మెరుగుపడ్డాయి. అయితే, శుక్రవారం శ్రీలంకపై ఓడిపోయిన ఇంగ్లండ్ మాత్రం డీలా పడింది. అప్పటికే నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉన్నా ఇంగ్లండ్ టెన్షన్ పడటానికి కారణం.. మిగిలిన మూడు లీగ్ మ్యాచులూ ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజీలాండ్ లతో ఆడాల్సి రావడమే! ఆ మూడింటిలో రెండు మ్యాచులు ఇంగ్లండ్ గెలవాల్సి ఉంటుంది. చరిత్ర చూస్తే అది కష్టసాధ్యం.
2019-06-21క్రికెట్ ప్రపంచ కప్ 2019కి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్ హోం టీమ్ శుక్రవారం శ్రీలంకపై అనూహ్యంగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 232 పరుగులే చేసిన శ్రీలంకపై సునాయాసంగా విజయం సాధిస్తుందనుకుంటే, ఇంగ్లండ్ 47 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్ తో చేయలేకపోయిన పనిని శ్రీలంక జట్టు బౌలింగ్ తో చక్కగా పూర్తి చేసింది. మలింగ 10 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
2019-06-21తన ప్రైవేటు నివాసం ప్రక్కనే ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ‘ప్రజావేదిక’ను ఇప్పుడు ప్రతిపక్ష నేతనైన తనకే కేటాయించాలని మాజీ సిఎం చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం విన్నవించారు. అయితే.. ఆ లేఖకు బదులివ్వని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అక్కడ ఈ నెల 24న కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఆ పేరిట ‘ప్రజావేదిక’ను స్వాధీనం చేసుకుంది. కలెక్టర్ల సమావేశం సచివాలయంలో జరుగుతుందని నిన్న ప్రకటించిన అధికారులు శుక్రవారం వేదికను మార్చారు.
2019-06-21‘‘కాళేశ్వరం’’ నిర్మాణం పూర్తయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాల్లో ఒకటిగా చెప్పవచ్చు. రూ. 80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకోసం ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 1531 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వి 19 పంప్ హౌస్ లతో రోజుకు 3 టిఎంసిల చొప్పున ఎత్తిపోయాలన్నది ప్రణాళిక. ఎత్తిపోతలకే 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరమంటే ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో అర్దం చేసుకోవచ్చు.
2019-06-21అతి పెద్ద ఎత్తిపోతల పథకం ‘‘కాళేశ్వరం’’ జాతికి అంకితమైంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ముహూర్తం ప్రకారం శుక్రవారం ఉదయం 11.23కు మేడిగడ్డ బ్యారేజి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి 11.26కు బ్యారేజీని ప్రారంభించారు. మధ్యాహ్నం 1.07 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేశారు.
2019-06-21తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కావని, భయపడవలసిన అవసరం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలకు అభయమిచ్చారు. ‘‘గతంలో అనేకమంది వీడారు.. పార్టీ మరణించిందన్నారు. ముగిసిన అధ్యాయం అన్నారు. కానీ, మనం సన్యసించలేదు. మళ్ళీ వచ్చాం. లక్షలా కార్యకర్తలు, కోట్లాదిమంది తెలుగు ప్రజలు మన వెనుక ఉన్నారు. చరిత్ర పునరావృతమవుతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.
2019-06-20