జె.ఎన్.యు. విద్యార్ధుల పరామర్శకు వెళ్ళిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఎల్లుండి విడుదల కానున్న ఆమె సినిమా ‘ఛపాక్’కు ఈ సెగ తగులుతోంది. దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూర్ బాటలోనే హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఛపాక్ బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఛపాక్ ఎవరూ చూడొద్దని రాజాసింగ్ కోరారు.
2020-01-08అమరావతి పరిరక్షణ ఉద్యమం తీవ్రతరం కావడంతో..విజయవాడ బెంజ్ సర్కిల్ బుధవారం రాత్రి ఆందోళనతో దద్దరిల్లింది. మాజీ సిఎం చంద్రబాబు, సీపీఐ నేత రామక్రిష్ణ సహా పలు పార్టీల నేతలు రహదారిపై బైఠాయించడంతో కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతకు ముందు రైతుల బస్సు యాత్రను అడ్డుకొని బస్సులను సీజ్ చేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. వేదిక కళ్యాణ మండపంలో పరిరక్షణ సమితి సమావేశం తర్వాత పాదయాత్రగా రోడ్లపైకి వచ్చారు.
2020-01-08రాజధాని ఉద్యమానికి మద్ధతు సమీకరించేందుకు బస్సు యాత్ర తలపెట్టిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఐక్య కార్యాచరణ సమితి నేతలను నిలువరించి బస్సులను సీజ్ చేశారు. తుళ్ళూరు నుంచి విజయవాడ వెళ్తున్న మహిళలను అదుపులోకి తీసుకొని మందడం డి.ఎస్.పి. కార్యాలయానికి తరలించారు. బస్సు యాత్రను అడ్డుకున్నందుకు, మహిళలను నిర్భంధించినందుకు ఆగ్రహించిన రైతులు డి.ఎస్.పి. కార్యాలయాన్ని ముట్టడించారు.
2020-01-08భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు తక్షణం వైద్య సాయం అందించాలని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజస్ట్రేట్ ఆరుల్ వర్మ బుధవారం తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. ఆజాద్ డిసెంబర్ 21 నుంచి జైలులో ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినందుకు ఆయనను అరెస్టు చేశారు. రక్త సంబంధ వ్యాధితో బాధపడుతున్న తాను ఢిల్లీ ‘ఎయిమ్స్’లో వైద్యం చేయించుకోవలసి ఉందని ఆజాద్ వేసిన పిటిషన్ ను పరిశీలించిన జడ్జి తక్షణ వైద్యానికి ఆదేశించారు.
2020-01-08 Read More#BoycottDeepika పేరిట బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనేపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని డి.ఎం.కె. నేత కనిమొళి తప్పుపట్టారు. నటిని బహిష్కరించాలన్న పిలుపు... ప్రజలు ఇష్టంతో ఆమె సినిమా చూసేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. తాను హిందీ సినిమాలు పెద్దగా చూడనన్న కనిమొళి, ఇప్పుడు మాత్రం ‘ఛపాక్’ చూస్తానని స్పష్టం చేశారు. జె.ఎన్.యు.లో దాడికి గురైన విద్యార్ధులను నిన్న దీపిక పరామర్శించిన నేపథ్యంలో ఆమెను బహిష్కరించాలని బిజెపి నేతలు పిలుపునిచ్చారు.
2020-01-08తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న జనసేన కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలోకి దిగడానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటి చేయడం లేదని జనసేన బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్వతంత్రులుగా పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్ధతు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
2020-01-08దీపికా పదుకొనే నూతన చిత్రం ‘ఛపాక్’ను బహిష్కరించాలని బి.జె.పి. దక్షిణ ఢిల్లీ ఎం.పి. రమేష్ బిధూరి పిలుపునిచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో ఎ.బి.వి.పి. దాడికి గురైన విద్యార్ధులను నిన్న దీపిక పరామర్శించిన నేపథ్యంలో ఎం.పి. ఇలా స్పందించారు. యాసిడ్ దాడికి గురైన యువతి తన జీవితాన్ని పునర్నిర్మించుకున్న తీరును వివరించే సందేశాత్మక చిత్రం ‘ఛపాక్’. దీపికపై కోపంతో బిజెపి నేతలు..,జనవరి 10న ‘ఛపాక్’తో పాటు విడుదలవుతున్న ‘తన్హాజీ’కి ప్రమోటర్లుగా మారారు.
2020-01-08ఇరాన్ లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రానికి సమీపంలో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.9గా నమోదైంది. యుద్ధ వాతావరణం మధ్య అణువిద్యుత్ కేంద్రం వద్ద భూమి కంపించడంతో... ప్రకృతిసిద్ధం కాదేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, భూకంప కేంద్రం, లోతును బట్టి ఇది ప్రకృతిసిద్ధమైనదేనని నిర్ధారించారు. భూకంప కేంద్రం బొరజ్జాన్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో...10 కిలోమీటర్ల లోతున ఉంది.
2020-01-08 Read Moreఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికల నగారా మోగింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 17వ తేదీన జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఎంపిపి, జడ్.పి.పి. అధ్యక్షుల ఎన్నిక ఫిబ్రవరి 15న జరుగుతుంది. ఇదే విధంగా పంచాయతీల ఎన్నికలకోసం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 3లోగా ప్రక్రియ పూర్తవుతుంది.
2020-01-08ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో చెప్పిన విధంగా..జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మార్చి 3వ తేదీలోపు ముగించాలని కోర్టు నిర్దేశించింది. స్థానిక సంస్థల్లో 59.85 రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
2020-01-08