శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. బుధవారం తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ను కలసి ఈ అంశంపై చర్చించారు. ఏపీ కొత్త ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి కేటాయించిన 512 టిఎంసిల నుంచే తీసుకుంటామని ఆ ప్రభుత్వం చెబుతున్నా.. దానిపై సరైన పర్యవేక్షణ లేదని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.
2020-05-13శ్రీశైలం ఎగువన కృష్ణా నది నీటిని తోడి రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రయత్నం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి అంశంపై బోర్డు ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తప్పని కేసీఆర్ పేర్కొన్నారు. రోజుకు 3 టిఎంసిల నీటిని తోడిపోసేలా ఓ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించా
2020-05-11సస్పెండ్ అయిన నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ మానసిక పరిస్థితి బాగా లేదంటూ.. పోలీసులు ఆయనను విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. ఆయనను కొట్టిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కరోనా నుంచి రక్షణకు ఎన్95 మాస్కులను ప్రభుత్వం సరఫరా చేయలేదని విమర్శించి సస్పెండ్ అయిన సుధాకర్, శనివారం విశాఖ రోడ్డుపై నిరసన తెలిపారు. తాగిన మత్తులో సిఎంను ధూషించారంటూ పోలీసులు సుధాకర్ ను కొట్టి చేతులు కట్టేసి అరెస్టు చేశారు. ఆయనకు ‘ఎక్యూట్ ట్రాన్సియంట్ సైకోసిస్’ అనే మానసిక సమస్య ఉన్నట్టు ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి ప్రకటించారు.
2020-05-16వలస కార్మికుల వర్ణనాతీతమైన కష్టాలకు పోలీసుల లాఠీ దెబ్బలు తోడవుతున్నాయి. శనివారం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో.. చెన్నై- కోల్ కత జాతీయ రహదారిపై తాడేపల్లి వద్ద జరిగిన లాఠీచార్జ్ ఇందుకు నిదర్శనం. సైకిళ్ళపై, కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. అయితే, లాఠీచార్జ్ జరగలేదని గుంటూరు జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ చెప్పారు. రెండు రోజుల్లో రైళ్ళలో పంపుతామని చెప్పినా వినకుండా వెళ్తున్నవారిని భయపెట్టడానికే పోలీసులు లాఠీలు ఝళిపించారని ఎస్పీ రామకృష్ణ చెప్పారు.
2020-05-16‘కరోనా’ నుంచి రక్షణ కోసం తమ ఆసుపత్రిలో కనీసం ఎన్95 మాస్కులు కూడా లేవని విమర్శించి సస్పెండ్ అయిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ ను శనివారం విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వీధుల్లో చొక్కా విప్పి నిరసన తెలిపిన డాక్టర్ సుధాకర్ రెక్కలు విరిచి కట్టిన పోలీసులు నడిరోడ్డుపై కొద్దిసేపు పడుకోబెట్టారు. లాఠీతో రెండు దెబ్బలు కొట్టి లాక్కుంటూ వెళ్లారు. అంతకు ముందు.. సుధాకర్ తాగిన మత్తులో పోలీసులను, ముఖ్యమంత్రిని ధూషించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
2020-05-16ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి మరో దశకు చేరుకుంది. శనివారం ఒక్క రోజే దేశంలో 5000 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న ఉదయం వెల్లడించిన సమాచారం ప్రకారం కేసుల సంఖ్య 85,940 కాగా ఆదివారం ఉదయం 90,927కు పెరిగింది. 24 గంటల్లో 4,987 కేసులు పెరిగినట్టు ఈ డేటా చెబుతోంది. మొత్తం కరోనా బాధితులు మహారాష్ట్రలో 30 వేలు, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో 10 వేలు దాటారు. మహారాష్ట్రలో 1135 మంది, గుజరాత్ లో 625 మంది మరణించారు. దేశం మొత్తంగా ‘కరోనా’ మరణాలు 2872కు పెరిగాయి. ప్రపంచ ‘కరోనా’ చిత్రపటంపై ఇండియా ఇప్పటికే చైనాను అధిగమించింది.
2020-05-17‘లాక్ డౌన్’ ప్రకటించి 53 రోజులు గడిచినా ఇండియాలో ‘కరోనా’ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారానికే వైరస్ సోకినవారి సంఖ్య 85,940కి పెరిగింది. ‘కరోనా’ బారిన పడిన మొదటి దేశం చైనాను ఇండియా అధిగమించింది. ఇప్పటికి ఇండియాలో 86,595 కేసులు, చైనాలో 84,038 కేసులు నమోదైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ డేటా చెబుతోంది. అయితే, ఇండియాలోని అనేక రాష్ట్రాల్లో శనివారం కొత్తగా నమోదైన కేసులను కలిపితే ఈ సంఖ్య 90 వేలకు చేరుతుంది. అత్యధికంగా ‘కరోనా’ బాధితులున్న దేశాల జాబితాలో ఇప్పుడు ఇండియాది 11వ స్థానం కాగా, చైనా 13వ స్థానానికి తగ్గింది.
2020-05-16కోటీ 10 లక్షల నగర జనాభాలో 30 లక్షల మందికి ‘కరోనా’ పరీక్షలు నిర్వహించినట్టు చైనాలోని ‘వుహాన్’ అధికారులు శుక్రవారం వెల్లడించారు. నగరంలో ‘కరోనా’ను కట్టడి చేసినా.. ఇటీవల రోజుకో డజను ‘లక్షణాలు వెల్లడికాని’ కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరం మొత్తం జనాభాకు ‘న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష’లు నిర్వహించాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని జిల్లా యంత్రాంగాలు బుధవారం ‘మాస్ టెస్టింగ్’ ప్రారంభించాయి. రెండు రోజుల్లోనే 30 లక్షల మందికి పరీక్షలు పూర్తి కాగా.. మే 20 లోపు అందరికీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇండియాలో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం పరీక్షలు 20 లక్షలే కావడం గమనార్హం. తనను పరీక్షించడం ఇది రెండోస
2020-05-15అక్వా ఉత్పత్తులతో సహా రైతులు పండించిన పంటలన్నీ గ్రామంలోనే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ‘వైఎస్ఆర్ జనతా బజార్ల’ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం రైతుభరోసాపై జిల్లాల యంత్రాంగంతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో సిఎం ఈ విషయంపై మాట్లాడారు. గ్రామాల్లో జనతా బజార్ల ఏర్పాటుకు ఒక సంవత్సరం సమయం కావాలని సిఎం పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్ల వంటి మౌలిక సదుపాయాలను కూడా గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటించారు.
2020-05-15దేశమంతటా వలస కూలీలు రోడ్లకు, రైళ్ళకు బలవుతున్న వేళ.. ప్రకాశం జిల్లాలో వ్యవసాయ కూలీలు 9 మంది విద్యుదాఘాతంతో మరణించారు. గురువారం కూలీలు మిరపకాయలు కోయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్టు సమాచారం. విద్యుత్ తీగలు ట్రాక్టర్ పైన పడి అందులో ఉన్న కూలీలు షాక్ కు గురయ్యారు. మృతులలో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు. నాగులుప్పాడు మండలం రాపర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
2020-05-14