శరవేగంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), క్లౌడ్, డేటా ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రంగాల్లో నైపుణ్య కొరతను తీర్చడానికి ‘మైక్రోసాఫ్ట్’, జనరల్ అసెంబ్లీ (జిఎ) అనే విద్యా సంస్థ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాయి. 2022 నాటికి 15,000 మందికి నైపుణ్యం పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలి సంవత్సరం 2000 మందికి, తర్వాత మూడేళ్లలో 13,000 మందికి శిక్షణ ఇస్తారు. భవిష్యత్తులో మనుషులు, మెషీన్లు, అల్గారిథమ్స్ మధ్య పని విభజన కారణంగా 13 కోట్ల కొత్త రోల్స్ వస్తాయని అంచనా.
2019-05-21 Read Moreపాకిస్తాన్ నుంచి 200 కేజీల ‘హెరాయిన్’తో వస్తున్న ఓ చేపల బోటును భారత కోస్టు గార్డు దళం మంగళవారం గుజరాత్ తీరంలో స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న మాదకద్రవ్యం విలువ రూ. 600 కోట్లు. ‘అల్ మదీనా’ అనే పేరుగల చేపల బోటు గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను మరో ఇండియన్ బోటుకు సరఫరా చేయబోతోందని సోమవారం సాయంత్రం కోస్టు గార్డు దళానికి ఉప్పందింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ), ఇతర ఏజెన్సీలు అందించిన సమాచారంతో మంగళవారం వేకువజామున నిఘా వేసి పాకిస్తాన్ బోటును పట్టుకున్నారు.
2019-05-21 Read Moreనిన్న ఎన్నికల నిర్వహణపై ఈసీని అభినందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మంగళవారం ఇవిఎంల ట్యాంపరింగ్ వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును తిరగరాయబోతున్నారన్న ఆరోపణల వార్తలు తనను ఆందోళనకు గురి చేశాయని ప్రణబ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా తీర్పు అత్యున్నతమైనదని, ఆ విషయంలో ఏ చిన్న సందేహానికీ తావుండరాదని ఉద్ఘాటించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవిఎం)ల భద్రత భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బాధ్యత అని ప్రణబ్ స్పష్టం చేశారు.
2019-05-21 Read Moreగురువారం లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సమావేశమయ్యారు. మంగళవారం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మిత్రపక్షాలకు చెందిన మంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో సహచర మంత్రులు మోదీకి పూలమాల వేసి అభినందనలు తెలిపారు. మంత్రులకు కృతజ్ఞత తెలపడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు బిజెపి తెలిపింది. రాత్రికి అమిత్ షా బిజెపి, మిత్రపక్షాల నేతలకు విందు ఏర్పాటు చేశారు.
2019-05-21 Read Moreబీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకోసం చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈ క్రమంలో ఆదివారం యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఇందుకోసం చంద్రబాబు తొలిసారి 10 జన్ పథ్ వెళ్లారు. గత 3 రోజులుగా రాహుల్ గాంధీ, వామపక్షాల నేతలతో సహా పలుప్రాంతీయ పార్టీల నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో శని, ఆదివారాల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఆ చర్చల సారాన్ని సోనియాగాంధీతో పంచుకున్నట్టు సమాచారం.
2019-05-19అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. యుద్ధం చేయాలనుకుంటే... అధికారికంగా ఇరాన్ చరిత్ర ముగిసిపోతుందని ట్రంప్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికాను మరెప్పుడూ బెదిరించవద్దని హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిననాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవలే ఇరాన్ చుట్టుప్రక్కలకు భారీగా యుద్ధ నౌకలను, బాంబర్లను అమెరికా పంపింది. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం తీవ్రమైంది.
2019-05-20 Read Moreఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అయోమయాన్ని నింపాయి. సర్వే సంస్థలు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సూచిస్తుండగా, మరికొన్ని సంస్థలు టీడీపీ కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీనివల్ల సీట్ల అంచనాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. టీడీపీకి కేవలం 37-40 సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేస్తే లగడపాటి రాజగోపాల్ 110 వరకు రావచ్చని చెప్పారు. కనిష్ఠ అంచనాకంటే గరిష్ఠం మూడు రెట్లు ఉండటం గమనార్హం. అలాగే వైసీపీకి కనిష్ఠం 52, గరిష్ఠం 135గా అంచనాలున్నాయి.
2019-05-19మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే వస్తుందని ప్రకటించాయి. అయితే, ‘న్యూస్ ఎక్స్-నేత’ ఎన్డీయే కూటమిగా కూడా మెజారిటీ సాధించలేదని, 242 సీట్ల వద్దనే ఆగిపోతుందని తెలిపింది. యూపీఏకు ఈ పోల్ అత్యధికంగా 164 సీట్లు, ఇతరులకు 126 ఇచ్చింది. ఎన్డీయేకి అత్యధికంగా (336 నుంచి 364) సీట్లు అంచనా వేసింది ‘న్యూస్ 24-టుడేస్ చాణక్య’. ఎన్డీయేకి అత్యధిక, అత్యల్ప అంచనా మధ్య 126 సీట్ల తేడా ఉంది. అలాగే యూపీయేకి అత్యధిక, అత్యల్ప (70 సీట్లు) అంచనాల మధ్య 94 తేడా ఉంది.
2019-05-19ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఇండియాటుడే, టైమ్స్ నౌ, వీడీపీ అసోసియేట్స్, సీపీఎస్, ఆరా సంస్థలు ప్రకటించాయి. టైమ్స్ నౌ మినహా మిగిలిన సంస్థలన్నీ వైసీపీకి మూడంకెల్లో (111 నుంచి 135 వరకు) సీట్లు అంచనా వేశాయి. టీడీపీకి 37 నుంచి 65 వరకు సీట్లను ఆయా సంస్థలు చూపించాయి. ఇండియాటుడే వైసీపీకి 130-135, టీడీపీకి 37-40, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని తెలిపింది. టైమ్స్ నౌ వై.ఎస్ఆర్.సి.కి 98, టీడీపీకి 65, ఇతరులకు 2 సీట్లు వస్తాయంది.
2019-05-19ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లోక్ సభ సీట్లను కూటమిగా ఎన్డీయే సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వేలు ఎన్డీయేకు మెజారిటీ రాదంటున్నాయి. అయితే, ముఖేష్ అంబానీ సంస్థ ‘న్యూస్ 18’ మాత్రం బీజేపీకి 276 సీట్లు, ఎన్డీయేకు మొత్తంగా 336 సీట్లు వస్తాయని ప్రకటించింది. 2014లో బీజేపీకి 282 సీట్లు లభించాయి. ఇప్సోస్ సంస్థతో కలసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను న్యూస్ 18 ఆదివారం విడుదల చేసింది. యూపీఎ కూటమికి ఈ సంస్థ ఇస్తున్న సీట్లు కేవలం 82.
2019-05-19 Read More