ఇండియా నుంచి అక్రమ మార్గాల్లో నేపాల్ లోకి ప్రవేశించిన భారతీయులు ‘కరోనా’ను వ్యాపింపజేస్తున్నారని ఆ దేశ ప్రధానమంత్రి కె.పి. ఓలి విమర్శించారు. చైనా, ఇటలీ కంటే ఇండియా నుంచి వచ్చిన వైరస్ మరింత ప్రాణాంతకంగా కనిపిస్తోందని ఆయన పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇండియన్లను సరిగ్గా పరీక్షించకుండా దేశంలోకి తేవడంలో కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల పాత్ర ఉందనీ ఆయన ఆక్షేపించారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాలను తమవిగా చూపుతూ ‘కొత్త మ్యాప్’ విడుదల చేశాక ‘కరోనా’ విషయంలోనూ నేపాల్ కఠువుగా మాట్లాడటం గమనార్హం.
2020-05-20‘‘దుర్మార్గం.. పచ్చి మోసం.. దగా.. అంకెల గారడీ.. అంతా గ్యాస్’’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘20 లక్షల కోట్ల ప్యాకేజీ’పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన ఇది. ‘కరోనా’ను ఎదుర్కోవడానికి రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని తాము కోరుతుంటే.. బిక్షగాళ్ళుగా భావించి కేంద్రం ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి సడలింపుతో రాష్ట్రాలు అప్పు చేసి రాష్ట్రాలే తీరుస్తాయని, కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వదని, దానికి కేంద్రం పెట్టిన షరతులు దరిద్రంగా ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఫ్యూడల్ పద్ధతిలో వ్యవహరిస్తోందని, ఆపత్కాలంలో రాష్ట్రాలపై పెత్తనం చేయడం సమాఖ్య వ్యవస్థకే విఘాతమని విమర్శించ
2020-05-18తెలంగాణలోనూ ‘లాక్ డౌన్’ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతి లేదని.. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ వంద శాతం పని చేయవచ్చని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ మినహా మిగిలినచోట్ల మొత్తం షాపులు, హైదరాబాద్ నగరంలో షాపు మార్చి షాపు తెరవవచ్చని, కంటైన్మెంట్ జోన్లలో అన్నీ బంద్ అని కేసీఆర్ చెప్పారు. ప్రార్ధనా స్థలాలకు, మత కార్యక్రమాలకూ అనుమతి లేదన్నారు. సెలూన్లకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.
2020-05-18ప్రణాళికారహితమైన ‘లాక్ డౌన్’ను ప్రజలపై రుద్దిన ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన వార్త ఇది. జార్ఖండ్ లోని లాతెహార్ జిల్లా హెసాటు గ్రామంలో ఐదేళ్ల దళిత బాలిక నిమాని ఆకలి బాధతో మరణించినట్టు ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. ‘‘అమ్మాయి ఆకలితోనే మరణించింది’’ అని చెప్పిన బాలిక తల్లి కమ్లావతి.. ‘‘ఆమె నాలుగైదు రోజులుగా ఏమీ తినలేదు. తినడానికి ఏమీ లేనప్పుడు ఏం తినగలం?’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. నిమాని ఓ ఇటుక బట్టీ కార్మికుడి కుమార్తె. శనివారం సాయంత్రం స్పృహ తప్పి పడిపోయిన నిమానిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మరణించింది. అయితే, ఆకలిచావును నిర్ధారించడానికి ఆ జిల్లా అధికారులు నిరాకరించారు.
2020-05-17ఇండియాలో ‘కరోనా’ బారిన పడి మరణించినవారి సంఖ్య 3 వేలు దాటింది (మొత్తం 3,025). జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా 95,639 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వర్శిటీ డేటా ప్రకారం శనివారం నాటికి కేసుల సంఖ్య 90,648. అంటే 24 గంటల్లోపలే 4,991 కొత్త కేసులు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లోనే సుమారు 10 వేల కొత్త కేసులు నమోదు కావడం ఇండియాలో వైరస్ వ్యాప్తి వేగాన్ని సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 46,86,012 మంది వైరస్ బారిన పడగా 3,13,127 మంది మరణించారు.
2020-05-17ప్రపంచాన్ని వణికిస్తున్న ‘కరోనా’ మహమ్మారి ఇండియాలో అడుగుపెట్టి నేటికి 108 రోజులు. జనవరి 30న తొలి కేసు నమోదు కాగా మార్చి 24 వరకు గడచిన 54 రోజుల్లో 536కి పెరిగాయి. ‘కరోనా’ను కట్టడి చేయడానికంటూ.. మార్చి 24 అర్ధరాత్రి నుంచి ‘లాక్ డౌన్’ పేరిట దేశం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం దిగ్బంధించింది. ఆ రోజు నుంచి శనివారం వరకు గడచిన 53 రోజుల్లో ఏకంగా 90,391 మందికి ‘కరోనా’ నిర్ధారణ అయింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో ఇవి 99.41%. ఆదివారం కేసుల లెక్క ఇంకా తేలలేదు. ప్రపంచమే కనీవినీ ఎరుగని స్థాయిలో 138 కోట్ల జనాభా గత 54 రోజుల్లో దిగ్బంధానికి గురైనా ఫలితం స్వల్పమే.
2020-05-17‘కరోనా’ కట్టడికోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘దేశ దిగ్బంధం’ మరో రెండు వారాలు (మే 31వరకు) కొనసాగనుంది. లాక్ డౌన్ 4.oగా వ్యవహరిస్తున్న ఈ పొడిగింపునకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ ఆదివారం జారీ చేసింది. దేశీయ విమాన సర్వీసులు, మెట్రో సేవలు మే 31వరకు ఉండవు. ప్రార్ధనా స్థలాలు, సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్ కూడా తెరవకూడదు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆయా రాష్టాలు పరస్పర అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. ‘కంటైన్మెంట్ జోన్’లలో ఆంక్షలను కఠినతరం చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది.
2020-05-17‘‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు..’’ అన్న రాష్ట్రాల విమర్శలకు కేంద్రం విరుగుడు మంత్రం వేసింది. ఎక్కువ అప్పులు చేసుకోండంటూ ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 3% నుంచి 5%కి (రాష్ట్రాల జి.ఎస్.డి.పి.లో) పెంచింది. ఈ పెంపుదలతో రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం చెప్పారు. ‘కరోనా’ దెబ్బకు ఆర్థికంగా కష్టాలపాలైన రాష్ట్రాలు కేంద్ర సాయాన్ని, తమకు రావలసిన బకాయిలను కోరుతున్నాయి. వాటి విషయం ప్రక్కన పెట్టి అప్పులు పెంచుకునేందుకు అనుమతించిన కేంద్రం, దానికీ ‘సంస్కరణల’ షరతు పెడుతున్నట్టు సమాచారం.
2020-05-17విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అరెస్టు తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్రంగా తప్పు పట్టారు. డాక్టర్ సుధాకర్ చేతులు వెనక్కి కట్టి పోలీసు కొడుతున్న వీడియోను చంద్రబాబు ఆదివారం సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేశారు. దళిత వైద్యుడి పట్ల ఈ ప్రవర్తన పౌర సమాజానికి కళంకం అని బాబు మండిపడ్డారు. ఈ చర్య అనాగరికమని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపు ఈ విపరీత చర్య మనుషులు, జంతువులకు మధ్య ఉన్న తేడాను చెరిపేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.
2020-05-17కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య ఏపీలో 50కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 19 మంది, కృష్ణా జిల్లాలో 15 మంది, గుంటూరులో 8మంది, అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఒకరు ‘కరోనా’ కాటుకు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 2230 మంది వైరస్ బారిన పడగా 1433 మంది కోలుకున్నారు. 747 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 25 కొత్త కేసులు నమోదు కాగా ఒకరు మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా ప్రకటించారు. కృష్ణా జిల్లాలో తాజాగా నిర్ధారణ అయిన మరణంతో మొత్తం మృతుల సంఖ్య 50కి పెరిగింది.
2020-05-17