ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పాకిస్తాన్ చెరనుంచి విడుదలైన ఐఎఎఫ్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఫొటోను వాడి పోస్టర్లు వేయడంపై ఈసీ స్పందించింది. ‘‘పాకిస్తాన్ తల వంచింది. చాలా తక్కువ సమయంలో అభినందన్ ను మోదీ వెనుకకు తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద దౌత్య విజయం’’ అని రాసిన పోస్టర్లను శర్మ సామాజిక మాథ్యమాల్లో షేర్ చేశారు. ఆ పోస్టులను తొలగించాలని ఆదేశించిన ఈసీ, గురువారంలోగా సంజాయిషీ ఇవ్వాలని సూచించింది.
2019-03-13 Read Moreబుధవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఇండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పూర్తయింది. సిరీస్ విజయాన్ని నిర్ణయించే ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్ మ్యాన్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేలలో ఖవాజాకు ఇది రెండో సంచరీ. మొదటి సెంచరీ కూడా ఇదే సిరీస్ మూడో వన్డేలో సాధించారు. ఇండియన్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 45 పరుగులకు 2 వికెట్లు తీశారు.
2019-03-13వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితాను ఈ నెల 16వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ విడుదల చేయనున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలను తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించాక ప్రారంభించడం జగన్ ఆనవాయితీగా పాటిస్తున్నారు. 16న ఉదయం 10.26 గంటలకు జాబితాను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. తొలి ఎన్నికల సభ గుంటూరు జిల్లా గుజరాలలో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
2019-03-13 Read Moreఅభ్యంతరకరమైన పోస్టులు, అకౌంట్లను తొలగించకపోతే ట్విట్టర్ నిర్వాహకులు పెనాల్టీ చెల్లించడంతోపాటు జైలుకు కూడా పోవలసి ఉంటుందని జాతీయ పత్రికల్లో బుధవారం వార్తలు వచ్చాయి. పేరు వెల్లడించని కేంద్ర ఐటీ శాఖ అధికారి ఒకరిని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెలువరించింది. ఐటీ చట్టంలోని మార్గదర్శకాలను పాటించాలని, లేదంటే 69ఎ సెక్షన్ కింద చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధపడాలని కేంద్రం ట్విట్టర్ యాజమాన్యానికి సూచించింది.
2019-03-13 Read Moreతయారీ రంగానికి సంబంధించిన చేదు వార్త ఇది. ఫిబ్రవరిలో వాహనాల రిటైల్ అమ్మకాలు 8.06 శాతం, హోల్ సేల్ అమ్మకాలు 3.05 శాతం తగ్గిపోయాయి. కార్లతోపాటు బైకుల అమ్మకాలు కూడా పడిపోయాయి. పాసెంజర్ కార్ల అమ్మకాలు 8.25 శాతం, వాణిజ్య వాహనాలు 7.08 శాతం తగ్గగా.. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7.97 శాతం తగ్గాయి. 2018 ఫిబ్రవరిలో మొత్తంగా 15,79,349 వాహనాలు అమ్ముడుపోగా 2019 ఫిబ్రవరిలో ఆ సంఖ్య 14,52,078కి తగ్గింది. 2019 జనవరితో (17,14,400 వాహనాలు) పోలిస్తే ఈ తగ్గుదల 15.30 శాతంగా ఉంది.
2019-03-13 Read Moreరామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశిత మధ్యవర్తిత్వం బుధవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల ప్యానల్ ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ పట్టణంలో బుధవారం ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ వివాదంలో భాగస్వాములైన 25 మంది తమ న్యాయవాదులతో సహా ప్యానల్ ఎదుట హాజరయ్యారు. ఇందుకోసం ఫైజాబాద్ అవధ్ యూనివర్శిటీ హాలు సమీపంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు ప్యానల్ సభ్యులు ఫైజాబాద్ లోనే ఉంటారు.
2019-03-13 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు తమిళనాడు పర్యటనకు వచ్చినా ‘‘గో బ్యాక్ మోదీ’’ అనే నినాదం సామాజిక మాథ్యమాల్లో టాప్ ట్రెండింగ్ అంశంగా ఉంటోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో మాత్రం పూర్తి భిన్నత్వం కనిపించింది. ఈ రోజు ‘‘వణక్కం రాహుల్ గాంధీ (#VanakkamRahulGandhi)’’ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ అంశంగా ఉంది. దీంతో, బీజేపీ శ్రేణులు ‘‘గో బ్యాక్ పప్పు (#GoBackPappu)’’ అనే హ్యాష్ ట్యాగ్ ను ముందుకు తెచ్చారు. తమిళనాట ఉండే బీజేపీ వ్యతిరేకతకు మోదీ వ్యతిరేకత తోడై ప్రతిసారీ ఈ ద్రవిడనాడు తీవ్రంగానే స్పందిస్తోంది.
2019-03-13రాబర్ట్ వాద్రాను విచారించాలని కోరిన మొదటి వ్యక్తిని తానేనని, అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా విచారించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. బుధవారం రాహుల్ గాంధీ తమిళనాడులోని నాగర్ కోయిల్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డిఎంకె కూటమిలో ఉంది. ఎండిఎంకె, సిపిఐఎం, సిపిఐ, విసికె, ఐయుఎంఎల్, ఐజెకె, కెడిఎంకె పార్టీలు ఆ కూటమిలో ఉన్నాయి.
2019-03-13పాకిస్తాన్ దేశీయంగా రూపొందించిన కొత్త ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. భూమిపైన లక్ష్యాలను ధ్వసం చేయడానికి ఉద్ధేశించిన ఈ మిసైల్ ను, చైనా తయారీ జెఎఫ్-17 థండర్ యుద్ధ విమానం నుంచి జారవిడిచారు. కొత్త మిసైల్ వివరాలను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించలేదు. అయితే, దాన్ని ‘‘స్మార్ట్ వెపన్’’గా చెబుతోంది. ‘‘పాకిస్తాన్ శాంతికాముక దేశం. అయితే, మా ప్రత్యర్ధులు ఆక్రమణకు పాల్పడితే పూర్తి సామర్ధ్యంతో బదులిస్తాం’’ అని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ముజాహిద్ అన్వర్ ఖాన్ ఈ సరికొత్త ప్రయోగం సందర్భంగా చెప్పారు.
2019-03-13సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘చిత్రలహరి’ టీజర్ విడుదలైంది. ఒకప్పటి దూరదర్శన్ పాపులర్ కార్యక్రమం ‘చిత్రలహరి’ ప్రస్తావనతో టీజర్ ప్రారంభమవుతుంది. కథానాయికలుగా నివేథా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ నటించారు. కథానాయకుడు సునీల్ ప్రత్యేక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఏప్రిల్ 12 (శుక్రవారం) విడుదల కానుంది. అలనాటి ‘చిత్రలహరి’ డీడీలో శుక్రవారమే ప్రసారమయ్యేది.
2019-03-13