జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) ప్రక్రియపై కేంద్రం ఈ నెల 17న ఏర్పాటు చేస్తున్న సమావేశానికి తాను గానీ, ప్రభుత్వ ప్రతినిధిగానీ వెళ్లడంలేదని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రం ఆదేశాలను పాటించనందుకు తన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని గవర్నర్ ధంఖర్ కు సవాలు విసిరారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)లకు వ్యతిరేకంగా రాష్ట్రంలో స్వయంగా ర్యాలీలను నిర్వహించిన మమత, ఎన్.పి.ఆర్. ప్రక్రియను రాష్ట్రంలో నిలిపివేశారు.
2020-01-16 Read Moreఅధికార పార్టీనా.. మజాకా! ఆదాయ వ్యయాల్లో బిజెపి మరెవరికీ అందనంత ఎత్తులో ఉంది. జాతీయ పార్టీలు అధికారికంగా సమర్పించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) మదించింది. 2018-19లో బిజెపికి రూ. 2,410.08 కోట్లు ఆదాయం రాగా, మిగిలిన 5 జాతీయ పార్టీలకు కలిపి అందులో సుమారు సగమే (రూ. 1288.58 కోట్లు) వచ్చింది. బిజెపి రూ. 1005.33 కోట్లు ఖర్చు చేసి రూ. 1,404.75 కోట్లు మిగుల్చుకుంటే...మిగిలిన పార్టీల వ్యయం మొత్తం రూ. 612.24 కోట్లుగా ఉంది.
2020-01-15రష్యాలో బుధవారం అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని డిమిత్రి మెద్వెదేవ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేసింది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తలపెట్టిన రాజ్యాంగ సంస్కరణలకోసం ప్రభుత్వ రాజీనామాకు ఆదేశించారు. దేశ ‘‘అధికార సమతుల్యత’’లో గణనీయమైన మార్పులను అధ్యక్షుడు ప్రతిపాదించారని, అందువల్ల ‘‘ప్రస్తుత రూపం’’లో ప్రభుత్వం రాజీనామా చేసిందని మెద్వెదేవ్ చెప్పారు. ఇక తదుపరి నిర్ణయాలన్నీ అధ్యక్షుడే తీసుకుంటారని ఆయన తెలిపారు.
2020-01-15విదేశీ పెట్టుబడుల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు రానుంది. దీనికి సంబంధించి 40 పేజీల ముసాయిదా సిద్ధమైంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టుల పీపీఎలను రద్దు చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో అవిశ్వాసాన్ని తొలగించడం అనివార్యంగా కేంద్రం భావించింది. వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా వృద్ధి రేటును పెంచుకోవడం లక్ష్యాలుగా కొత్త బిల్లు రూపొందింది.
2020-01-15 Read Moreఆర్థిక మందగమనం ప్రజల ఆదాయాలను దెబ్బ తీస్తుంటే.. ధరల పోటు మరింత బాధిస్తోంది. 2019 డిసెంబరులో రిటైల్ ధరల సూచీ జాతీయ సగటు 7.35 శాతం ఉంటే... ఒడిషా, తెలంగాణలలో ఏకంగా 9.4 శాతం ఉంది. 2018 డిసెంబరులో తెలంగాణలో ధరల పెరుగుదల దాదాపు శూన్యం. ఇక సోదర తెలుగు రాష్ట్రం ఏపీ తక్కువేం కాదు. ధరల సూచీ 2018లో ‘మైనస్’లో ఉంటే 2019 డిసెంబరులో ప్లస్ 8 శాతంగా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్భణం బీహార్లో మాత్రమే గత ఏడాదితో దాదాపు సమానంగా ఉంది.
2020-01-152019-20 తొలి 9 నెలల్లో ఇండియా సరుకుల ఎగుమతులు తగ్గాయి. ఏప్రిల్- డిసెంబర్ కాలంలో 239.29 బిలియన్ డాలర్ల విలువైన సరుకు ఎగుమతులు జరిగాయి. ఇది గత ఏడాది కంటే 1.96 శాతం తక్కువ. అయితే, దిగుమతులు 8.90 శాతం తగ్గాయి. వాణిజ్యం తగ్గుదల ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తోంది. సర్వీసుల ఎగుమతులు 5.66 శాతం, దిగుమతులు 7.49 శాతం పెరిగాయి. సరుకు వాణిజ్యంలో 118.10 బిలియన్ డాలర్ల లోటు నెలకొంటే...సర్వీసులలో 60.44 బిలియన్ డాలర్ల మిగులు వచ్చింది.
2020-01-15జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యు.ఎఫ్.బి.యు), ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (ఐబిఎ) మధ్య వేతన సవరణ చర్చలు విఫలమయ్యాయి. ఫోరం 15 శాతం పెంపు అడిగితే ఐబిఎ 12.25 శాతానికి పరిమితం చేసినట్టు సమాచారం. సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి 11-13 తేదీల్లోనూ, ఏప్రిల్ 1 నుంచి నిరవధికంగానూ సమ్మె చేస్తామని ఫోరం నేత ఒకరు తెలిపారు.
2020-01-15 Read Moreభీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు ఢిల్లీ తీస్ హజారీ కోర్టు బుధవారం బెయిలు మంజూరు చేసింది. ఓ నెల రోజులపాటు ఢిల్లీకి రావద్దని, ఆయన సొంత ప్రాంతం (యూపీలోని సహరాన్ పూర్)లో ఉండాలని న్యాయమూర్తి డాక్టర్ కామిని లా ఆదేశించారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి సమస్యా ఉండకూడదనే ఈ మాట చెబుతున్నట్టు జడ్జి పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక ప్రదర్శన నిర్వహించినందుకు అరెస్టయిన, ఆజాద్ డిసెంబరు 21 నుంచి కస్టడీలో ఉన్నారు.
2020-01-15 Read More2020 అమెరికా జనాభా లెక్కల్లో తమను ‘ప్రత్యేక జాతి’గా గుర్తించనున్నట్టు సిక్కు సంస్థలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేక కోడ్ ను జోడించినట్టు అమెరికా సెన్సస్ బ్యూరో అధికారి షగుఫ్త అహ్మద్ తెలిపారు. అమెరికాలో సిక్కుల ప్రత్యేక గుర్తింపుకోసం ‘యునైటెడ్ సిఖ్స్’ గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తోంది. విద్వేషపూరిత నేరాలకు సిక్కులు బాధితులవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పెరిగింది.
2020-01-15 Read Moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవగాహనా రాహిత్యం, ఆత్రం, శాడిజం, నిరంకుశత్వం.. అన్నీ సిఎంలో కనిపిస్తున్నాయని కన్నా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పోలీసు పాలన చేస్తే జగన్ రాక్షస పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కన్నా... ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాష్ట్రం ఆయన జాగీరు కాదని వ్యాఖ్యానించారు.
2020-01-15