దేశంలో ‘కరోనా వైరస్’ కేసులు 30కి పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని ప్రాథమిక పాఠశాలలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని ఆదేశించింది. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు పద్ధతిని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆదేశించింది. జాతీయ రాజధాని ప్రాంతంలోని గజియాబాద్ లో గురువారం ఓ కరోనా కేసు నమోదైంది. బాధితుడు చత్తీస్ గఢ్ వాసి. మణిపూర్ ప్రభుత్వం కూడా బయోమెట్రిక్ పద్ధతిని సస్పెండ్ చేసింది.
2020-03-052012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు దోషులు నలుగురినీ మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా కోర్టు తాజా డెత్ వారెంట్ జారీ చేసింది. దోషులు ఒక్కరొక్కరే క్షమాబిక్ష పిటిషన్లు పెట్టుకొని ఇంతకు ముందు జారీ అయిన డెత్ వారంట్లను రద్దు వేయించుకోలిగారు. దోషులకు ఉన్న అన్ని అవకాశాలూ ముగిశాయంటూ గురువారం జడ్జి ధర్మేంద్ర రాణా తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడిక ఉరిశిక్ష తేదీని ఖరారు చేయడానికే ఇంకేమీ న్యాయపరమైన అడ్డంకి లేదని దోషుల తరపు న్యాయవాది కూడా అంగీకరించారు.
2020-03-05 Read Moreనరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారత ప్రజాస్వామ్య విలువలనుంచి ఆందోళనకరంగా వైదొలగుతోందని ‘‘ఫ్రీడం ఇన్ ద వరల్డ్ 2020’’ నివేదిక విమర్శించింది. ఫ్రీడం హౌస్ సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఇండియాకు తిమోర్ లెస్తె, సెనెగల్ వంటి దేశాలతో సమానంగా 83వ ర్యాంకు ఇచ్చింది. స్వేచ్ఛాయుత దేశాల్లో ఇదే చివరి ర్యాంకు. ఇండియా స్కోరు 4 పాయింట్లు తగ్గి 71కి చేరింది. 25 పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే గరిష్ఠ పతనం. ట్యునీషియా మాత్రమే అంతకంటే తక్కువ స్కోరును నమోదు చేసింది.
2020-03-05 Read Moreమార్చి 31లోపు ఖజానా నింపాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంటే.. పన్నుల అధికారులు పని భారంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పని వాతావరణం మెరుగు పడాలని, లేదంటే తామే పని భారం తగ్గించుకుంటామని బుధవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 97 శాతం అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు యూనియన్లు ఈమేరకు ఒక ప్రకటన చేశాయి. తమ డిమాండ్లు తీర్చకపోతే.. కొన్ని నివేదికలు సమర్పించడం మానేస్తామని, మార్చి 12న సోదాలు నిలిపేస్తామని నేతలు హెచ్చరించారు. మార్చి 15 నుంచి ఓవర్ టైమ్ పని మానేస్తామని స్పష్టం చేశారు.
2020-03-05 Read More‘కరోనా’ వంటి వైరస్ లు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నాయని అనేక వార్తలు చూశాం. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధమైన కథనం ఇది. హాకాంగ్ నగరంలో ఓ పెంపుడు కుక్కకు కరోనో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆ కుక్క యజమాని ‘కరోనా వైరస్’ పేషెంట్. ఆయన నుంచి కుక్కకు కూడా సంక్రమించి ఉంటుందని అంచనా. కుక్కను పరీక్షించినప్పుడు వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించాయి. దాంతో.. ఆ కుక్కను వైద్య పర్యవేక్షణలో విడిగా ఉంచారు. మనిషి నుంచి జంతువుకు వైరస్ వ్యాపించిన తొలి కేసు ఇదే కావచ్చు.
2020-03-04‘కరోనా’ ప్రభావం మన కరెన్సీపై బాగానే కనిపిస్తోంది. గురువారం మార్కెట్లు ప్రారంభమవుతూనే రూపాయి విలువ 20 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుకు 73.42 రూపాయల వద్ద ట్రేడింగ్ నడుస్తోంది. ఈ రోజు డాలరుకు 73.25 - 73.90 రేంజ్ లో రూపాయి ఊగిసలాడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. ఇండియాలో కరోనా కేసులు నిన్న (మార్చి 4న) 29కి పెరగడం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించబోతున్నట్టు సంకేతాలు వెలువడటం... రూపాయి విలువపై ప్రభావం చూపినట్టు విశ్లేషిస్తున్నారు.
2020-03-05 Read Moreవి.డి. సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్లపై రికార్డు ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు సమాధానమిచ్చింది. అండమాన్ & నికోబార్ సాంస్కృతిక శాఖ చెప్పిన ప్రకారం.. అలాంటి క్షమాబిక్ష పిటిషన్లను అండమాన్ సెల్యులర్ జైలులో ప్రదర్శించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం పేర్కొంది. ‘‘అండమాన్ సెల్యులర్ జైలు లైట్ అండ్ సౌండ్ షోలో సావర్కర్ క్షమాబిక్ష పిటిషన్ల విషయం ప్రస్తావించని మాట వాస్తవమేనా’’ అని రాజ్యసభ సభ్యుడు రీతబ్రత బెనర్జీ అడిగిన ప్రశ్నకు కేంద్రం పై సమాధానమిచ్చింది.
2020-02-05భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చే విదేశీయుల సంఖ్య ఏటా కొన్ని వందలకు మించదు. అదే సమయంలో భారత పౌరసత్వం వదులుకుంటున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. 2015 నుంచి 2019 (అక్టోబర్) వరకు 5,84,364 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయారు. వారిలో ఎక్కువ మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ దేశస్తులయ్యారు. 2016లో అత్యధికంగా 1,32,445 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోగా... 2019 తొలి 10 నెలల్లో ఈ సంఖ్య 1,11,244గా ఉంది.
2020-03-05భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)ను అమ్మే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభలో చిరాగ్ కుమార్ పాశ్వాన్ అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ బదులిచ్చింది. బిఎస్ఎన్ఎల్ రుణ బాధ్యతలు గత ఏడాది మార్చినాటికి రూ. 35,729 కోట్లకు పెరిగినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్రం వెల్లడించింది. 2016 మార్చి 31 నాటికి రూ. 1,02,460 కోట్లుగా ఉన్న సంస్థ నికర విలువ మూడేళ్ల తర్వాత 74,734 కోట్లకు తగ్గిపోయినట్టు పేర్కొంది. అప్పులే అందుకు కారణమని కేంద్రం తెలిపింది.
2020-03-05జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దయ్యాక... ఆ రాష్ట్రంలో రూ. 13,120 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు ఆసక్తి చూపించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2019 ఆగస్టు 5 నుంచి డిసెంబర్ 31 వరకు ఇంత మొత్తంలో 44 ఇఒఐలు వచ్చినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని కేంద్రం పేర్కొంది. అన్ని ప్రతిపాదనలనూ సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని బుధవారం లోక్ సభలో సమాధానమిచ్చింది.
2020-03-05