దేశంలో కరోనా వైరస్ కేసులు 28కి పెరిగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం స్పందించారు. ఈ ఏడాది తాను ఏ హోలీ మిలన్ కార్యక్రమంలోనూ పాల్గొనబోనని ఆయన ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంకోసం... మూకుమ్మడి సమావేశాలు తగ్గించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచించారని ప్రధాని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హోలీ పండుగ చేసుకోవడంలేదని ప్రకటించారు. ఇందుకు కరోనా వైరస్ కు తోడు, ఢిల్లీ అల్లర్లను మరో కారణంగా చెప్పారు.
2020-03-04ఇండియాలో ‘కరోనా’ కేసుల సంఖ్య 28కి పెరిగింది. అయితే, వైరస్ సోకినవారిలో 14 మంది ఇటలీ దేశస్తులు. విహారానికి ఇండియా వచ్చినవారు. వారితో కలసి తిరిగిన డ్రైవర్ కూ వైరస్ సోకినట్టు సమాచారం. మరో ఆరుగురు ఒకే కుటుంబానికి (ఆగ్రా) చెందినవారు. మొన్న ఢిల్లీలో నమోదైన కరోనా బాధితుడి కుటుంబ సభ్యులు. వీరికి తోడు తెలంగాణలో రెండు కేసుల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇటాలియన్లను ఢిల్లీ సమీపంలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) క్యాంపులో ఉంచి చికిత్స చేస్తున్నారు.
2020-03-04పారదర్శకంగా పరిపాలిస్తానని ప్రమాణ స్వీకార వేదికపై నొక్కి చెప్పారు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి. కానీ, ప్రభుత్వంలో పారదర్శకత లేమికి నిదర్శనంగా చెప్పుకునే రహస్య జీవోలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. మంగళవారం అర్దరాత్రికి కొద్ది నిమిషాల ముందు ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే 10 రహస్య జీవోలను జారీ చేశారు. అవన్నీ ఎంపిటిసి, జడ్.పి.టి.సి. ఎన్నికలకు సంబంధించినవేనని సమాచారం. సోమవారం కూడా రెండు రహస్య జీవోలు విడుదలయ్యాయి. ఈ రహస్య జీవోలు రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించే అంశంపై కావచ్చనే అనుమానాలున్నాయి.
2020-03-04 Read Moreఅమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి ఎంపిక ప్రక్రియలో సెనెటర్ బెర్నీ శాండర్స్ కు మద్ధతు పెరుగుతోంది. కీలక రాష్ట్రమైన టెక్సాస్ బెర్నీకి జై కొట్టింది. మంగళవారం జరిగిన ఈ అంతర్గత ఎన్నికల్లో శాండర్స్ 36.3 శాతం ఓట్లు సాధించి సమీప ప్రత్యర్ధి మైకేల్ బ్లూంబెర్గ్ (23.5 శాతం) కంటే బాగా ముందున్నారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ కనీస ఓట్లను (15.2 శాతం) మాత్రం దక్కించుకున్నారు. అమెరికాలో హిందూ మత సంస్థల మద్ధతుతో ఎదిగిన తుల్సీ గబ్బర్డ్ అభ్యర్ధిత్వానికి కేవలం 1.1 శాతం ఓట్లు లభించాయి.
2020-03-04మద్యం సరఫరాదారులకు చెల్లించాల్సిన రూ. 1783 కోట్ల బకాయిలకోసం ప్రపంచ బ్యాంకునుంచి అప్పు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి చెప్పారు. బ్యాంకుకు తనఖా పెట్టడానికి ఎపి బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద సొంత భూమి లేనందున.. రుణం పొందడానికి ఇతర మార్గాలను ఆశ్రయిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మంగళవారం డిప్యూటీ సిఎం చేసిన ఈ విశేష ప్రకటనకు వెలగపూడి సచివాలయం వేదికైంది. డిస్టిలరీలకు గత టీడీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని నారాయణస్వామి విమర్శించారు.
2020-03-03 Read Moreవిశాఖపట్నంలో ఈ నెల 18 నుంచి 28 వరకు జరగాల్సిన అంతర్జాతీయ నౌకా విన్యాసాలు (మిలన్ 2020) వాయిదా పడ్డాయి. ‘కరోనా వైరస్’ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత నౌకాదళం మంగళవారం ప్రకటించింది. తర్వాత వీలైన సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపింది. 1995 నుంచి భారత నౌకాదళం ‘మిలన్’ పేరిట బహుళ పక్ష నౌకా విన్యాసాలను నిర్వహిస్తోంది. ఈ ద్వైవార్షిక కార్యక్రమం చివరిగా 2018 మార్చి 6-13 తేదీల్లో పోర్టు బ్లెయిర్ లో జరిగింది. అప్పుడు 16 దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.
2020-03-03 Read Moreఢిల్లీ అల్లర్లపై అధికార బిజెపి, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలతో వరుసగా రెండో రోజు పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. గత నెలలో జరిగిన అల్లర్లలో 48 మరణించిన నేపథ్యంలో... తక్షణమే ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు నిన్నటి నుంచీ డిమాండ్ చేస్తున్నాయి. అయితే, హోలీ పండుగ ముగిశాక మార్చి 11న చర్చిద్దామని ప్రభుత్వం చెప్పినట్టు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం సభకు తెలిపారు. అధికార, విపక్షాల సభ్యులు బాహాబాహీకి దిగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
2020-03-03పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై అభ్యంతరాలతో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం హైకమిషనర్ మిచెల్ బాచెలెట్ భారత సుప్రీంకోర్టులో ‘ఇంటర్వెన్షన్ అప్లికేషన్’ వేశారు. మానవ హక్కులపై ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం 48/141ని మిచెల్ తన దరఖాస్తులో ఉటంకించారు. సిఎఎ వేల మంది శరణార్దులకు ప్రయోజనకరమేనని, అదే సమయంలో..ఈ చట్టం మానవ హక్కులపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తిందని ఆమె పేర్కొన్నారు. తాము జోక్యం చేసుకోవడం అంటే.. పిటిషనర్ల ఆరోపణలన్నిటినీ ఆమోదిస్తున్నట్టు కాదని కూడా మిచెల్ పేర్కొన్నారు.
2020-03-032019 జూన్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో 12,500 నాటుసారా కేసులు నమోదైనట్టు ఏపీ ఉపముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ మంత్రి కె. నారాయణస్వామి మంగళవారం వెల్లడించారు. 36,73,682 లీటర్ల బెల్లం ఊటను.. 1,43,915 లీటర్ల నాటుసారాను, 939 వాహనాలను స్వాధీనం చేసుకొని 8,171 మందిని అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. అక్రమ మద్యం కేసులు 7,805 నమోదు కాగా 8,046 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 170 గంజాయి కేసుల్లో 31,609 కేజీల సరుకు స్వాధీనం చేసుకొని 317 మందిని అరెస్టు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.
2020-03-03కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంకోసం... ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశస్తుల వీసాలను ఇండియా సస్పెండ్ చేసింది. ఈ రోజు (మార్చి 3) లేదా అంతకంటే ముందు జారీ చేసిన రెగ్యులర్ (స్టిక్కర్) వీసాలు, ఇ-వీసాలు రెండూ సస్పెండ్ అయ్యాయి. ఆయా దేశాల నుంచి రావలసి ఉన్నవారు రావద్దని ప్రభుత్వం సూచించింది. ఆ నాలుగు దేశాల్లో కరోనా విస్తరణ వేగంగా ఉండటం, ఇండియాలో కొత్త కేసులు నమోదవుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ (బిఒఐ) మంగళవారం తాజా ప్రయాణ ఆంక్షలను విధించింది.
2020-03-03 Read More