‘కరోనా’ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పాఠశాలలకు ఎట్టకేలకు సెలవులు ప్రకటించారు. రేపటి (మార్చి 19) నుంచి 31 వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి విశ్వ విద్యాలయాల వరకు.. అన్నీ మూసివేయాలని ఆదేశించింది. కోచింగ్ సెంటర్లకు కూడా ఈ ఆదేశం వర్తిస్తుంది. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 31 నుంచి పదో తరగతి పరీక్షలు మాత్రం యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు.
2020-03-18ఏపీలో ‘కరోనా వైరస్’ సోకినవారున్నారని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా.. ఈ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ఫ్రాన్స్ లో మున్సిపల్ ఎన్నికలు పెడితే ఒక్క రోజే 900 కేసులు పెరిగాయని, ఇప్పుడు యూరప్ దేశాల్లో ప్రజలను ఇళ్లలోనే నిర్భంధించి ఆర్మీతో కవాతులు నిర్వహిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ‘‘రాష్ట్రంలోనూ ఆ పరిస్థితి తేవాలనుకుంటున్నారా?’’ అని సిఎంను ప్రశ్నించారు. తమను బూతులు తిట్టడం మాని పని చేయాలని హితవు పలికారు.
2020-03-18స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. ‘కరోనా వైరస్’ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల వాయిదాను సమర్ధిస్తూ.. నిర్వహణపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. అయితే, వాయిదా కాలంలో ఎన్నికల నిబంధనావళిని అమలు చేయవద్దని ఆదేశించింది. కొత్త పథకాలు చేపట్టకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వాయిదా కాలం ముగిశాక.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కమిషన్ కు సూచించింది.
2020-03-18సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యాక నాలుగు నెలలకు రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడయ్యారు. అంతకు రెండు నెలల ముందే ఆయన సోదరుడు అంజన్ గొగోయ్ కి ఓ పదవి దక్కింది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అంజన్ గొగోయ్ ని ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి సభ్యుడిగా నియమిస్తూ జనవరిలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులిచ్చారు. 8 రాష్ట్రాల అభివృద్ధికి సలహా మండలిలా పని చేసే ఈ వ్యవస్థలో సభ్యునిగా మాజీ ఆర్మీ అధికారిని నియమించడం ఇదే తొలిసారి. అంజన్ గొగోయ్ 2013లో పదవీ విరమణ చేస్తే.. ఏడేళ్లకు మరింత పెద్ద హోదాలో నియమించడం గమనార్హం.
2020-03-18ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో కనీసం 254 మందికి ‘కరోనా వైరస్ వ్యాధి’ సోకినట్టు సమాచారం. వారిలో విద్యార్ధులు, యాత్రికులు ఉన్నారు. ఆ జాబితా తమ వద్ద ఉన్నట్టు ‘ద వైర్’ తన కథనంలో పేర్కొంది. అయితే, జాబితా సాధికారతపై తాను మాట్లాడలేనని భారత రాయబార కార్యాలయం అధికారి చెప్పినట్టు కూడా తెలిపింది. కార్గిల్, లే ప్రాంతాల నుంచి సుమారు 850 మంది యాత్రికులు ఇరాన్ వెళ్ళారు. మార్చి 6, 10 తేదీల మధ్య వారికి పరీక్షలు నిర్వహించినట్టు బాధితుల్లో ఒకరు చెప్పారు. ‘కరోనా’ నిర్ధారణ అయినవారి జాబితాను వారి వాట్సాప్ గ్రూపులో అధికారులు పోస్టు చేశారని ‘ద వైర్’ తెలిపింది.
2020-03-17ఎ- గ్రూపు రక్తం ఉన్నవాళ్లకు ‘కరోనా వైరస్’ ఎక్కువగా సోకే అవకాశం ఉందని, తీవ్రత కూడా ఆ గ్రూపువారికే ఎక్కువని చైనా పరిశోధకులు గుర్తించారు. ఆ గ్రూపుతో పోలిస్తే ఒ- గ్రూపు రక్తం ఉన్నవారికి రిస్క్ తక్కువని, వారిలో ‘కరోనా’ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకోసం వుహాన్, షెంజెన్ నగరాల్లో 2000 మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. దీనిపై ఇంకా పరిశోధించాల్సి ఉందంటూ.. వైరస్ (సార్స్-సిఒవి-2) సోకినవారికి వైద్యం చేసే సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని శాస్తవేత్తలు సూచించారు.
2020-03-17 Read More‘కరోనా’ భయంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అన్ని విద్యాలయాలనూ మూసివేయగా.. ఆ పని దేశమంతటా చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అన్ని స్థాయిలలోని విద్యాలయాలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ సహా గుంపులుగా చేరే అన్ని ప్రదేశాలనూ ఈ నెల 31 వరకు మూసివేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ గట్టిగా సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు 15 సూచనలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. వీలైతే పరీక్షలు కూడా వాయిదా వేయాలని సూచించింది. ఒకరి నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తపడటమే ‘కరోనా’ వ్యాప్తి నిరోధంలో కీలకమైన అంశమని పేర్కొంది.
2020-03-16పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)లో మత ప్రస్తావన, దేశాల పేర్లు తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. సిఎం కేసీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) అమలుతో పెద్ద సంఖ్యలో ప్రజలు తొలగింపునకు గురవుతారన్న ఆందోళన తీర్మానంలో వ్యక్తమైంది. ‘సమానత్వం’, ‘సెక్యులరిజం’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు సిఎఎ పూర్తి విరుద్ధంగా ఉందని, పౌరసత్వ చట్టాల నుంచి వాటిని తొలగిండం ద్వారా మత పాలనను వ్యవస్థీకృతం చేయవచ్చని తీర్మానంలో పేర్కొన్నారు.
2020-03-16ఇండియా పేరు చెబితే ప్రపంచానికి మొదట గుర్తుకొచ్చే ప్రదేశాల్లో తాజ్ మహల్ తప్పనిసరిగా ఉంటుంది. కరోనా వైరస్ ప్రభావంతో మంగళవారం నుంచి తాజ్ మహల్ సందర్శనను నిలిపివేస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. సోమవారం వరకు ఇండియాలో 114 ‘కరోనా’ కేసులు నమోదు కాగా ఇద్దరు చనిపోయినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తాజ్ మహల్ తోపాటు టికెట్లు అమ్మి అనుమతించే ఇతర ప్రముఖ దర్శనీయ స్థలాలను కూడా మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది.
2020-03-17‘కరోనా వైరస్’ చైనాలోని ‘వుహాన్’లో విజృంభణ ప్రారంభించి ప్రపంచానికి వ్యాపించింది. ఇప్పుడు రోగుల సంఖ్య, మరణాల్లో చైనాను మిగిలిన ప్రపంచం మించిపోయింది. తాజా సమాచారం ప్రకారం 150 దేశాల్లో 1.81 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 7,131 మంది మరణించారు. ‘కరోనా’ కేసుల్లో 80,880, మరణాల్లో 3213 చైనాలో నమోదు కాగా.. వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నవారిలో (78,339లో) చైనీయులు 67,819 మంది. సోమవారం కొత్త కేసులు ప్రపంచ వ్యాప్తంగా 12,083, చైనాలో 36 నమోదయ్యాయి. మరణాలు ప్రపంచవ్యాప్తంగా 626, చైనాలో 14 నమోదయ్యాయి.
2020-03-17