రాజధానిని ‘అమరావతి’ నుంచి మార్చడానికి వీల్లేదంటూ ఆందోళన చేస్తున్న మహిళా రైతులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం కావడంతో మందడంలో రైతులు ఆందోళన తీవ్రతరం చేశారు. మరోవైపు పోలీసులు ఉద్యమంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా శుక్రవారం మందడంలో నిరసనలో పాల్గొన్న మహిళలు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో నిరసనకారులను బలవంతంగా పోలీసు వాహానాల్లో తరలించారు.
2020-01-03వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల కేన్సర్లకూ ఫిబ్రవరి 1 నుంచి ఉచిత వైద్యం అందించనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇదివరకు కేన్సర్ పేషెంట్లకు ముష్ఠి వేసినట్టు సాయం చేసేవారని, కొన్ని రకాల కేన్సర్లకే ఆరోగ్య శ్రీ వర్తించిందని చెప్పారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్యక్రమ విస్తరణ పైలట్ ప్రాజెక్టును సిఎం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఆ జిల్లాలో శుక్రవారం నుంచి 2059 వ్యాధులకు ఈ పథకం వర్తిస్తుంది.
2020-01-03పాకిస్తాన్ గగనతలంపై విమానాలు నడిపే పౌర విమానయాన సంస్థలకు,పైలట్లకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాద, తీవ్రవాద చర్యల ప్రమాదం ఉన్నందున అమెరికా ఎయిర్ లైన్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) ఈమేరకు ‘‘నోటీస్ టు ఎయిర్ మెన్ (నోటమ్-NOTAM) జారీ చేసింది. ఈ నోటీసు అమెరికా కేంద్రంగా పని చేసే అన్ని విమాన యాన సంస్థలకు, పైలట్లకు వర్తిస్తుంది.
2020-01-03 Read More2020 ప్రారంభంలో వాల్ స్ట్రీట్లో స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. గురువారం మూడు ప్రధాన ఇండెక్స్ రికార్డు స్థాయికి చేరాయి. తన ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు చైనా తీసుకుంటున్న ఉద్ధీపన చర్యలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం పరిష్కార దిశగా సాగడం వంటి పరిణామాలు ఈ సానుకూలతకు కారణాలు. చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందం 15న కుదురుతుందని, తర్వాత తాను చైనా వెళ్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
2020-01-02 Read Moreమూడు రాష్ట్రాల్లోని 7 కొత్త ఆయిల్, గ్యాస్ క్షేత్రాల కాంట్రాక్టులపై ప్రభుత్వ రంగ సంస్థ ఒ.ఎన్.జి.సి. గురువారం సంతకాలు చేసింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 5 క్షేత్రాలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక క్షేత్రానికి ఎవరూ పోటీ బిడ్ దాఖలు చేయలేదు. రాజస్థాన్ లోని ఒక బ్లాకుకు ఒకే బిడ్డర్ పోటీ రాగా అది కూడా ఒ.ఎన్.జి.సి.కే దక్కింది. ఈ 7 బ్లాకులతో మరో 18,510 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూమి కంపెనీ పరిధిలోకి వచ్చింది.
2020-01-02 Read More2020లో పది కాదు.. ఇరవై కాదు.. 50 అంతరిక్ష ప్రయోగాలకు చైనా సిద్ధమవుతోంది. చైనా అంతరిక్ష పరిశ్రమకు ఇది సూపర్ బిజీ సంవత్సరం. 40కి పైగా లాంచ్ మిషన్లను చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టు చైనాలో అతి పెద్ద స్పేస్ కాంట్రాక్టు సంస్థ ‘చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్ప్’ గురువారం వెల్లడించింది. ‘బీడో’ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను పూర్తి చేయడంతోపాటు వాణిజ్య ఉపగ్రహాలు కూడా ఈ లక్ష్యంలో ఉన్నాయి.
2020-01-02కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడే సమయంలోనూ ఫోన్ చెక్ చేసుకోకుండా 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారట! ‘‘వివో-సిఎంఆర్’’ అధ్యయనంలో అభిప్రాయాలు చెప్పిన ప్రతి ముగ్గురిలో ఒకరి పరిస్థితి ఇదే. స్మార్ట్ ఫోన్ వినియోగం ఇదే స్థాయిలో ఉంటే... మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఈ సర్వేలో 73 శాతం అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ లోనూ, ముఖాముఖీ 2000 మంది సేకరించి గురువారం ఈ అధ్యయన నివేదికను వెల్లడించారు.
2020-01-02దేశంలో అనేక రంగాల తరహాలోనే ఇంథన సరఫరా కూడా తిరోగమనంలో ఉంది. డిసెంబరులో సరఫరా గత ఏడాది కంటే 1.1 శాతం తగ్గింది. 2018 డిసెంబరులో 103.04 బిలియన్ యూనిట్లు సరఫరా చేయగా 2019 డిసెంబరులో 101.92 బిలియన్ యూనిట్లు సరఫరా అయింది. వరుసగా ఐదో నెల తిరోగమనం నమోదైంది. పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అక్టోబరులో 12.8 శాతం, నవంబరులో 4.2 శాతం తగ్గింది.
2020-01-02 Read Moreఇండియన్లకు స్మార్ట్ ఫోన్ బలహీనత పట్టుకుందా? ఓ కొత్త అధ్యయనం అదే చెబుతోంది. రోజూ మెళకువగా ఉండే సమయంలో మూడో వంతు ఇండియన్లు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారని ‘‘వివో- సిఎంఆర్’’ అధ్యయనం వెల్లడించింది. రోజుకు సుమారు 5 గంటలు లేదా సంవత్సరానికి 1800 గంటలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ‘‘స్మార్ట్ ఫోన్.. మానవ సంబంధాలపై వాటి ప్రభావం’’ పేరిట వెలువరించిన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు.
2020-01-02‘‘మీసం మెలేసి చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ నాయుడే..! పాలకొల్లు పవన్ నాయుడు!! మీమీద మీకేమైనా డౌట్ ఉంటే డి.ఎన్.ఎ. పరీక్ష చేయించుకోండి’’...అని తెలుగుదేశం మాజీ శాసన సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలకు సూచించారు. చంద్రబాబు దంపతులపైనా, పవన్ కళ్యాణ్ పైనా వైసీపీ నేతలు చేసిన విమర్శలకు బొండా ఘాటుగా బదులిచ్చారు. ‘చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు’ అన్న వ్యాఖ్యపై.. ‘మీరు జగన్ పెంపుడు కుక్కలా’ అంటూ మండిపడ్డారు.
2020-01-02