ఇండియాలో ప్రముఖ ఆద్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్.. సోషలిజంపై చేసిన వ్యాఖ్యానం ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో బాగా ప్రచారంలో ఉంది. ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ కమ్యూనిస్టు రష్యా వెళ్లినప్పుడు.. రెండు కోళ్ళతో కనిపించిన వ్యక్తిని ఓ కోడి అడిగితే ఎలా స్పందించాడో జగ్గీ చెప్పుకొచ్చారు. 1910లో మరణించిన మార్క్ ట్వైన్ 1917లో స్థాపించిన సోవియట్ రష్యా ఎలా వెళ్లారని కొందరికి ధర్మ సందేహం వచ్చింది. అయితే, ఆ చర్చను నిర్వహించిన కార్పొరేట్ ప్రముఖుడు కె.వి. కామత్ (పద్మభూషణ్)కు గానీ, జగ్గీ అనుయాయులకుగానీ ఈ సందేహం రాలేదు. పైగా సోషలిజంపై జగ్గీ వెటకారానికి పగలబడి నవ్వారు. ఆధ్యాత్మి‘కథ’లింతేనా?
2020-06-10ఇంతకు ముందే నిర్ణయించినట్టుగా జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ప్రకటించారు. ‘కరోనా’ కేసులు పెరుగుతున్న తరుణంలో టెన్త్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. ఏపీలో వైరస్ పాజిటివ్ కేసులు 5247కు పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధులు, అధ్యాపకుల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ చెబుతున్నారు.
2020-06-10రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఆటలాడుకుంటారా అని ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన జగన్ ప్రభుత్వం, నిమ్మగడ్డను తొలగిస్తూ జీవో ఇచ్చింది. ఆ ఉత్తర్వులన్నిటినీ హైకోర్టు కొద్ది రోజుల క్రితం కొట్టివేయగా.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, సమగ్రంగా విచారణ జరుపుతామంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
2020-06-102021 క్యుఎస్ ప్రపంచ యూనివర్శిటీల ర్యాంకుల్లో భారత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు తిరోగమించాయి. గత ఏడాది 152వ స్థానంలో ఉన్న ఐఐటి ముంబై ఈ ఏడాది 172కి దిగజారింది. ఢిల్లీ ఐఐటి 182వ స్థానం నుంచి 193కి పడిపోయింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి) ర్యాంకు 184 నుంచి 185కి తగ్గింది. ప్రపంచ టాప్ 200 విద్యా సంస్థల్లో ఇండియావి ఈ మూడే ఉన్నాయి. టాప్ 1000 విద్యా సంస్థల్లో ఇండియావి గత ఏడాది 24 ఉండగా ఈ ఏడాది 21 సంస్థలకే చోటు దక్కింది. మద్రాస్ ఐఐటి (ర్యాంకు 275), ఐఐటి ఖరగ్ పూర్ (315), ఐఐటి కాన్పూర్ (350) ర్యాంకులు కూడా దిగజారాయి.
2020-06-10ఇండియాలో ‘కరోనా’ వైరస్ కరాళ నృత్యం ప్రారంభమైనట్టే. మంగళవారానికి దేశంలో 2,76,583 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారిలో 7745 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. మొత్తం కేసుల్లో ఇండియా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. బుధ, గురువారాల్లో నమోదయ్యే కేసులతో యు.కె.ను దాటి 4వ స్థానానికి వెళ్లనుంది. యు.కె.లో 2,90,581 కేసులు నమోదయ్యాయి. అయితే, కొత్త కేసులు 1200కు పరిమితమయ్యాయి. అదే సమయంలో ఇండియాలో రోజూ 11 వేల చొప్పున నమోదవుతున్నాయి. ఇక అమెరికా (19,79,411), బ్రెజిల్ (7,39,503), రష్యా (4,84,630)ల తర్వాత మనమే!
2020-06-10‘కరోనా’ వైరస్ పీడిత రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తాజాగా ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ఎమ్మెల్యే అన్బళగన్ ‘కరోనా’తో మరణించడం ఆ రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. దేశంలో ‘కరోనా’తో మరణించిన తొలి ఎమ్మెల్యే అన్బళగన్. వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. 62 సంవత్సరాల అన్బళగన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన సినీ నిర్మాత కూడా. బుధవారం అన్బగళన్ పుట్టిన రోజు. ఇదే రోజు ఆయన మరణించడం మరింత విషాదకరం.
2020-06-10ఇండియాలో ‘కరోనా’ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం 2,26,588 కేసులతో ఏడో స్థానంలో ఉన్న ఇండియా శుక్రవారం ఇటలీని, వచ్చే వారం యు.కె, స్పెయిన్ దేశాలను దాటే అవకాశాలున్నాయి. 24 గంటల్లో కొత్తగా 9,764 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో అమెరికా (9,934)తో ఇండియా పోటీ పడుతోంది. మొత్తం కేసుల్లో అమెరికా (18,60,890), బ్రెజిల్ (5,84,016), రష్యా (4,40,538) తొలి 3 స్థానాల్లో ఉండగా ఇండియా శరవేగంగా 4వ స్థానానికి దూసుకెళ్తోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 29 వేల కేసులు నమోదు చేస్తూ బ్రెజిల్ అమెరికాకు సమీపంగా వెళ్తోంది.
2020-06-04‘కరోనా’ విస్తరణకు ఒకానొక కేంద్ర బిందువుగా మారిన ‘తబ్లిఘీ జమాత్’పై కేంద్ర హోంశాఖ మరో చర్య తీసుకుంది. కరోనా కాలంలో ఇండియాలో ఉన్న 2,550 మంది విదేశీ తబ్లిఘీ సభ్యులు వచ్చే పదేళ్ళపాటు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మసీదులలో నివశించినవారిపై రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నట్టు హోం శాఖ తెలిపింది. ఢిల్లీ నిజాముద్ధీన్ మర్కజ్ మసీదులో తబ్లిఘీ ప్రార్ధనా సమావేశాల సందర్భంగా ‘కరోనా’ వ్యాపించిన సంగతి తెలిసిందే.
2020-06-04‘గణనీయమైన సంఖ్య’లో చైనా సైనిక దళాలు తూర్పు లడఖ్ ప్రాంతంలోకి ప్రవేశించాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం అంగీకరించారు. దాదాపు నెల రోజుల క్రితం.. గాల్వన్ లోయ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లోకి 5000 నుంచి 10,000 మంది చైనా సైనికులు ప్రవేశించి బంకర్లు, రోడ్లు నిర్మించినట్టు రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. 6వ తేదీన ఇరు దేశాల సైన్యంలోని ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్టు రాజ్ నాథ్ చెప్పారు. కాగా, మేజర్ జనరల్ స్థాయిలో మంగళవారం చర్చలు జరిగినట్టు సమాచారం.
2020-06-0268 రోజులు దేశం మొత్తాన్ని దిగ్బంధించాక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘కరోనా’ కేసులు శరవేగంగా పెరుగుతున్న వేళ ఆంక్షలు సడలిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. శనివారం నాటికి ‘కరోనా’ మరణాలు 5,185కు, కేసుల సంఖ్య 1,81,827కి పెరిగాయి. ఈ ఒక్క రోజే 8,336 కొత్త కేసులు నమోదయ్యాయి. ‘లాక్ డౌన్’కు ముందు మార్చి 24 నాటికి కేవలం 536 కేసులు ఉన్నాయి. ఎక్కడ 536.. ఎక్కడ 1,81,827!. భూగోళంపై కనీ వినీ ఎరగని స్థాయిలో 138 కోట్ల జనాభాను ఇళ్ళకు పరిమితం చేసేలా ఆంక్షలు విధించినా.. కేంద్రం ‘కరోనా’ను కట్టడి చేయలేకపోయింది. ఇంత సుదీర్ఘ కాలం ఆంక్షలు విధించాక కేసులు పెరుగుతున్న దేశం ఇండియా ఒక్కటే.
2020-05-31