రాజధాని తరలింపు వ్యవహారం మరొకరి ప్రాణం బలితీసుకుంది. తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి చెందిన కర్నాటి ఎర్రమ్మ గుండెపోటుతో కన్నుమూశారు. ఎర్రమ్మకు రెండెకరాల పొలం ఉంది. ఇద్దరు కుమార్తెలకు చెరో ఎకరం చొప్పున ఇచ్చారు. వారు ఆ భూమిని రాజధానికిచ్చారు. తాజా పరిణామాలతో కూతుళ్ళ భవిష్యత్ పై ఆమె ఆందోళన చెందారు. ఆ ఆవేదనతోనే ఆమెకు గుండెపోటు వచ్చిందని బంధువులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
2020-01-07జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జె.ఎన్.యు)పై దాడికి నిరసనగా, ఆ వర్శిటీ ప్రొఫెసర్ సి.పి. చంద్రశేఖర్ ఓ కీలక ప్రభుత్వ కమిటీకి రాజీనామా చేశారు. ఆర్థిక గణాంకాలపై కేంద్ర గణాంక శాఖ గత నెలలో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో చంద్రశేఖర్ సభ్యుడు. మంగళవారం ఆ కమిటీ సమావేశానికి ముందే సోమవారం రాత్రి ఆయన ఇ-మెయిల్ ద్వారా తన రాజీనామాను పంపారు. ‘‘విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వంతో కలసి పని చేయలేం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
2020-01-07 Read Moreమోర్గాన్ స్టాన్లీ సేల్స్ అండ్ ట్రేడింగ్ సంస్థ (అమెరికా) ప్రకటించిన ప్రపంచ టాప్ 20 స్టాక్స్ లో ‘మారుతి సుజుకి ఇండియా’ చోటు దక్కించుకుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఈ దిగ్గజ కార్ల సంస్థ ముందుంటుందని మోర్గాన్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రగతి మార్గంలో ఉన్న కంపెనీల జాబితాలో మారుతికి మాత్రమే చోటు దక్కింది. ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ తిరోగమనంలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ... ఈ పరిస్థితి మారితే ‘మారుతి’ లాభపడుతుందని తెలిపింది.
2020-01-07మన యూనివర్శిటీలు విద్వేష రాజకీయాలకు, హింసకు స్వర్గధామాలు కాకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...పిల్లలు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వెళ్ళేప్పుడు విజ్ఞానంతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలన్నారు. వర్శిటీలలో విద్యా ప్రమాణాలు, అనుబంధ కార్యకలాపాలు ప్రాముఖ్యతను సంపాదించాలని, అంతేగాని వర్గ విభజన ధోరణలు కాదని ఉద్భోదించారు.
2020-01-07తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. 118 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్ ప్రకటించారని ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.
2020-01-07‘‘రాజధాని అమరావతి’’ పరిరక్షణకోసం జరుగుతున్న ఉద్యమానికి ఓ విద్యార్ధిని అసాధారణ విరాళం ఇచ్చింది. అంబుల వైష్ణవి అనే విద్యార్ధిని ఓ ఎకరం పొలాన్ని అమరావతి పరిరక్షణ సమితికి రాసి ఇచ్చింది. సంబంధిత పత్రాలను మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు అందించింది. కృష్ణాజిల్లాకు చెందిన ఈ విద్యార్ధిని 2018 జనవరిలో రాజధాని నిర్మాణం కోసం రూ. లక్ష విరాళంగా ఇచ్చింది. అప్పట్లో ఆమెను ‘అమరావతి బ్రాండ్ అంబాసడర్’గా వ్యవహరించారు చంద్రబాబు.
2020-01-07ఈ నెల 20న ప్రభుత్వానికి హై పవర్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని మంత్రి బుగ్గన చెప్పారు. ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో హై పవర్ కమిటీ తొలి భేటీ జరిగింది. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రతినిధులు హై పవర్ కమిటీకి తాము సమర్పించిన నివేదికల గురించి వివరించారు. అభివ్రుద్ది, పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందేనని కమిటీ అభిప్రాయపడిందని మంత్రి కన్నబాబు చెప్పారు. రెండు నివేదికలపై తదుపరి సమావేశంలో మరింత విస్త్రుతంగా చర్చిస్తామని తెలిపారు.
2020-01-072008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపింది. ఆ ఏడాది స్థూల జాతీయోత్పత్తి కేవలం 3.1శాతం పెరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు దానితో పోల్చదగినంత తక్కువ స్థాయిలో వృద్ధి రేటు నమోదు కానుంది. కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖ మంగళవారం వెల్లడించిన అంచనా ప్రకారం జీడీపీ వృద్ధి 5 శాతం ఉండొచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో ఉద్ధీపన చర్యలను ప్రకటించే అవకాశం ఉంది.
2020-01-072019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు 5 శాతం లోపేనని అనేక సంస్థలు అంచనా వేశాయి. ఇప్పుడు స్వయంగా భారత ప్రభుత్వం కూడా తన అంచనాను 5 శాతానికి తగ్గించింది. 11 సంవత్సరాల్లో ఇదే కనిష్టం కానుంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5 శాతం, రెండో త్రైమాసికంలో ఇంకా తగ్గి 4.5 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. 2018-19లో సవరించిన లెక్కల ప్రకారం వృద్ధి రేటు 6.8%.
2020-01-07 Read Moreస్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై జిల్లాకో వడ్డీ రేటు వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాంకర్లతో చెప్పారు. 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారని వారి దృష్టికి తెచ్చారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్.ఎల్.బి.సి) 209వ సమావేశంలో సిఎం కోరారు. సంఘాలకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, వడ్డీకి ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు.
2020-01-07