ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ కు అవసరమైన సిబ్బందిని, ఎన్నికల సామాగ్రిని తరలించడంకోసం 7,300 బస్సులు సమకూర్చాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది ఆర్టీసీని కోరారు. రవాణా ఏర్పాట్లపై ఆయన మంగళవారం అమరావతి సచివాలయంలో సమీక్ష జరిపారు. ఆర్టీసీ బస్సుల కొరత ఉన్న కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇతర జిల్లాలనుంచి సమకూర్చాలని సూచించారు. 300 ప్రైవేటు బస్సులను కూడా సమకూర్చాలని రవాణా శాఖ అధికారులను ద్వివేది కోరారు.
2019-04-02‘‘దేశాన్ని కుదిపేస్తున్న రాఫేల్ కుంభకోణం’’.. చెన్నై సామాజిక కార్యకర్త ఎస్. విజయన్ రాసిన ఈ పుస్తకాన్ని హిందూ గ్రూపు సంస్థల ఛైర్మన్ ఎన్. రామ్ మంగళవారం సాయంత్రం విడుదల చేయవలసి ఉంది. అయితే, విడుదలకు ముందు స్థానిక ఎన్నికల కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తేనాయంపేటలోని భారతి పుట్టకళాయం ప్రచురణాలయానికి వెళ్లి పుస్తకాల కాపీలను మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఆ పుస్తకాన్ని విడుదల చేయడాన్ని గానీ, అమ్మడాన్ని గానీ అనుమతించబోమని వారు స్పష్టం చేశారు.
2019-04-02 Read Moreఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నిక ప్రణాళికలో చేర్చింది. దాంతోపాటు పుదుచ్ఛేరికి పూర్తి రాష్ట్ర గుర్తింపు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. మంగళవారం విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టోలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న కొన్ని శాసనపరమైన అంశాలను రాష్ట్రాలకు బదలాయిస్తామని హామీ ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
2019-04-02ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి ఎన్నిక కావాలని చెప్పడం ద్వారా రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారని సీఈసీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు వార్తలు వచ్చాయి. తనను తాను ‘బీజేపీ కార్యకర్త’గా పేర్కొన్న కళ్యాణ్ సింగ్, ఉన్నతమైన ఆయన హోదాను చిన్నబుచ్చారని రాష్ట్రపతికి చెప్పనున్నట్టు ఓ అధికారి అనధికారికంగా చెప్పారు.
2019-04-02 Read Moreకాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. అందులో టాప్ 5 అంశాలివి. * రుణం చెల్లించలేని రైతులు జైలుకు పోరు. ఆ ఎగవేతను క్రిమినల్ నేరంగా పరిగణించం. * ఉపాధి హామీ పథకంలో 100కు బదులు 150 పని దినాలు. * మూడేళ్లపాటు స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు అనుమతులు అవసరంలేదు. * విద్యకు జీడీపీలో 6 శాతం వ్యయం. * 20 శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా రూ. 72,000 నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమ.
2019-04-02బ్యాంకు రుణాన్ని చెల్లించలేని రైతులు ఇకపైన జైలుకు పోరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇదివరకు రైల్వే బడ్జెట్ ఉన్నట్టే ఇకపైన రైతులకోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని రాహుల్ చెప్పారు. జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చినాటికి దేశంలోని 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి పార్టీ హామీ ఇచ్చిందని, అలాగే ఉపాధి హామీని మరో 100 రోజులు పెంచుతామని హామీ ఇచ్చారు. దేశంలోని నిరుపేద కుటుంబాలకు ఏటా రూ. 72 వేలు ఇచ్చే పథకం మేనిఫెస్టోలోని ఐదు ప్రాధానాంశాల్లో ఒకటి అని రాహుల్ చెప్పారు.
2019-04-02 Read More‘మీతో మేము ఉంటాం’ అనే సందేశాన్ని దక్షిణ భారత దేశానికి ఇవ్వడానికే తాను కేరళ నుంచి కూడా పోటీ చేస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథితోపాటు కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానంనుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో తమను పరిగణించడంలేదని దక్షిణాది ప్రజలు భావిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను వెల్లడించిన సందర్భంగా రాహుల్ ఈ అంశంపై మాట్లాడారు.
2019-04-02 Read Moreఒక చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ లోని ఎర్రంమంజిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2010లో సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి పెట్టిన కేసులో మంగళవారం తీర్పు వచ్చింది. మోహన్ బాబు రూ. 41.75 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
2019-04-02ఉపగ్రహాలను కూల్చే సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తూ ఇటీవల ఇండియా చేసిన ప్రయోగాన్ని ‘భయానక పరిణామం’గా వర్ణించింది అమెరికా ‘నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (నాసా). ఈ ప్రయోగం 400 అంతరిక్ష శకలాలను సృష్టించిందని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఒక పాత ఉపగ్రహాన్ని ఇండియా ప్రయోగాత్మకంగా కూల్చివేసింది. ఐఎస్ఎస్ తిరిగే కక్ష్యకంటే ఇది చాలా తక్కువ ఎత్తే! అయితే, 24 శకలాలు ఐఎస్ఎస్ కంటే ఎత్తుకు ఎగసిపడినట్టు ‘నాసా’ చెబుతోంది.
2019-04-02 Read Moreఐదేళ్ళపాటు మనగలిగేలా స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించడమే బీజేపీ వ్యతిరక పార్టీలకు ప్రధానమైన అంశమని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు. ఈ విషయం తాను గతంలోనూ ప్రాంతీయ పార్టీలకు చెప్పానని, మరోసారి చెబుతానని హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు విడి విడిగా పోటీ చేయడాన్ని ముక్కలు చెక్కలైనట్టుగా భావించరాదని, ఎవరి ప్రణాళికలు వారికి ఉంటాయని గౌడ వ్యాఖ్యానించారు. కూటమి నాయకత్వంపై ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
2019-04-02 Read More