కాంగ్రెస్, బీజేపీయేతర ‘‘సమాఖ్య సంఘటన’’ కోసమంటూ పలు రాష్ట్రాలు తిరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు తమిళనాట అనూహ్యమైన ఆహ్వానం లభించింది. సోమవారం చెన్నైలో డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ను కలసిన కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’లో చేరాలని ఆహ్వానించారు. అయితే, తాము కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తున్న విషయాన్ని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా తానే ప్రతిపాదించిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్టు సమాచారం. కేసీఆరే తమతో కలసి రావాలని స్టాలిన్ కోరడం ఇక్కడ కొసమెరుపు.
2019-05-13 Read Moreముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్నికల సంఘం నియామకం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సీనియర్ ఐఎఎస్ ఎల్.వి. సుబ్రహ్మణం ఈ మధ్య ఉప్పు-నిప్పుగా వ్యవహరించారు. అయితే, మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ చిటపటలు ఏమీ కనిపించలేదు. సిఎంకు అధికారాలు లేవన్న సిఎస్, బిజినెస్ రూల్స్ అతిక్రమిస్తున్నవారిపై చర్యలు ఉంటాయన్న సిఎం.. నవ్వుకుంటూ సామరస్యంగా సమావేశాన్ని నడిపించారు. ఈ భేటీ ఉభయతారకంగా జరిగేలా ఓ వాతావరణాన్ని ఇరుపక్షాలూ ముందే ఏర్పాటు చేసుకున్నాయి.
2019-05-14ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర విభజనానంతరం 2014లో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇది 108వ సమావేశం. ఫని తుపాను, అకాల వర్షాలు, కరువు, ఉపాధి హామీ పథకం పనులు, తాగునీటి సమస్య వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. తుపాను నష్టం, ప్రజలకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాల్లో అధికారులు రూపొందించిన అంచనాలను మంత్రివర్గం పరిశీలించింది. కరువు మండలాల్లో చెల్లించాల్సిన పరిహారం విషయమై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సిఎం సూచించారు.
2019-05-14ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) సీనియర్ నేత దొరై మురుగన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్ చెన్నై వెళ్లి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తో సమావేశమైన మరుసటి రోజే.. కీలక నేత దొరై మురుగన్ అమరావతికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయం కోసమంటూ కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు తిరుగుతుండగా.. ప్రస్తుతం మూడో ప్రత్యమ్నాయం కుదరదని స్టాలిన్ తేల్చి చెప్పారు.
2019-05-142010 సంవత్సరంనుంచి 290 మంది ఇండియన్లు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. అందులో 207 మంది ఒక్క 2018 సంవత్సరంలోనే ఇండియాకు బైబై చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సమాధానం ఇచ్చినట్టు ‘‘ద హిందూ’’ మంగళవారం రాసింది. 2010లో కేవలం ముగ్గురు భారత పౌరసత్వాన్ని వదులుకోగా 2012, 2015 మధ్య ఎవరూ వదల్లేదు. 2016లో 19 మంది, 2017లో 60 మంది ఆ పని చేశారు. ఆర్థిక కారణాలవల్ల ఇండియాకు బైబై చెబుతున్నట్టు ఎక్కువ మంది పేర్కొన్నారు.
2019-05-14 Read Moreతెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ ‘‘మహానాడు’’ను 2019లో నిర్వహించరాదని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జాతీయ స్థాయిలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ‘‘మహానాడు’’ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని చంద్రబాబు భావించారు. సాధారణంగా మే 27,28,29 తేదీలలో ‘‘మహానాడు’’ నిర్వహిస్తుంటారు. ఈసారి ఎన్నికల ఫలితాలకు, మహానాడు తేదీలకు నాలుగు రోజులు కూడా వ్యవధి ఉండటంలేదు. ఫలితాల తర్వాత చంద్రబాబు జాతీయ స్థాయిలో బీజీ కానున్నారని టీడీపీ చెబుతోంది.
2019-05-14బడా డిఫాల్టర్ల పారు బకాయిలు జాతీయ బ్యాంకులను వెన్నాడుతున్నాయి. ఫలితంగా.. ఇండియన్ బ్యాంకు 2018-19 చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ. 189.77 కోట్ల మేరకు నికర నష్టాన్ని నమోదు చేసింది. 2017-18 చివరి త్రైమాసికంలో రూ. 131.98 కోట్లు, ఆ ఏడాది మొత్తంలో రూ. 1,262.92 కోట్లు నికర లాభాన్ని ఇండియన్ బ్యాంకు ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకుంటే... లాభం రూ. 320.93 కోట్లకు తగ్గిపోయింది. మొత్తం ఆదాయం పెరిగినప్పటికీ లాభం తగ్గిపోవడం గమనార్హం. నిరర్ధక ఆస్తులు 7.11 శాతంగా బ్యాంకు పేర్కొంది.
2019-05-14 Read Moreరుతుపవన వర్షాలు దక్షిణ కేరళలో జూన్ 4వ తేదీన ప్రవేశిస్తాయని అంచనా. అయితే, ఈసారి వర్షాలు తక్కువగానే ఉంటాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ మంగళవారం తెలిపింది. గత అనేక సంవత్సరాల్లో కురిసిన వర్షపు సగటులో ఈసారి 93 శాతమే పడవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. 2019లో రుతుపవనాల ప్రభావం గతం కంటే తక్కువగా ఉంటుందన్న అంచనా భారత ఆర్థిక వ్యవస్థకు కాస్త చేదువార్తే. సాధారణంగా జూన్ 1వ తేదీనే రుతుపవనాలు కేరళకు వస్తుంటాయి. జూలై మధ్యనాటికి దేశమంతటికీ విస్తరిస్తాయి.
2019-05-14 Read Moreతాప్సీ పన్ను నటించిన తాజా చిత్రం ‘‘గేమ్ ఓవర్’’ కొత్త పోస్టర్ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సినిమా టీజర్ విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రం రూపొందింది.
2019-05-14ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం కమిషనర్ గా హోటల్ వ్యాపారి ఐలాపురం రాజాను నియమిస్తూ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐలాపురం రాజా నియామకానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. సమాచార కమిషనర్ పదవీ కాలం ఐదేళ్లు. నియమితులైనవారి వయసు 65 ఏళ్లు నిండినా పదవీ కాలం ముగుస్తుంది.
2019-05-14