హైదరాబాదులో ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, శాసనసభ, పలు కమిషనరేట్లలో ఏపీ వాటా భవనాలు కూడా ఇక తెలంగాణవే! పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన సమయంలో నిర్ణయించి కార్యాలయ భవనాలను పంచారు. అయితే, ఏపీ ప్రభుత్వం అమరావతికి తరలినందున హైదరాబాద్ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన గవర్నర్ ఉత్తర్వులిచ్చారు.
2019-06-02చైనాను విభజించే ప్రయత్నాలు ఫలించవని ఆ దేశ రక్షణ మంత్రి వీ ఫెంగె ఉద్ఘాటించారు. అమెరికా గనుక చైనానుంచి తైవాన్ ను విదీయాలని చూస్తే ‘చివరివరకు’ పోరాడతామని హెచ్చరించారు. సింగపూర్ ‘షాంగ్రి లా డైలాగ్’లో మాట్లాడిన మంత్రి..యుద్ధం వస్తే రెండు దేశాల్లో విధ్వసం జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘అమెరికా అవిభాజ్యం. అలాగే చైనా కూడా.. చైనా ఏకంగానే ఉండాలి. ఉంటుంది’’ అని వీ స్పష్టం చేశారు. అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ స్ట్రెయిట్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో చైనా మంత్రి మాట్లాడారు.
2019-06-02 Read Moreపాకిస్తాన్ లోని భారత హై కమిషన్ శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వచ్చిన అతిధులను ఆ దేశ సెక్యూరిటీ సిబ్బంది వేధించారు. ఈ చర్య ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీస్తుందని ఇస్లామాబాద్ లోని భారత హై కమిషనర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. మే 27న ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా భారత సెక్యూరిటీ సిబ్బంది తమను వేధించినట్టు ఇక్కడి అతిధులూ చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఈ పరిణామాలకు కారణమయ్యాయి.
2019-06-02 Read More‘‘పర్షియన్ గల్ఫ్ లో పేలే మొదటి బుల్లెట్టే చమురు ధరను $100 పైకి తీసుకెళ్తుంది. అమెరికా, యూరప్ లతోపాటు మిత్రులైన జపాన్, దక్షిణ కొరియాలకు అది భరించలేనిది’’- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సలహాదారు మేజర్ జనరల్ యాహ్యా రహీమ్ సఫావి చేసిన హెచ్చరిక ఇది. ఇరాన్ దేశంతో పూర్తి స్థాయి యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థను ముంచుతుందని ఆయన అంచనా వేశారు. అమెరికా తన ఆర్థిక వ్యవస్థ మంచిని కోరుకుంటే యుద్ధానికి దిగదని పేర్కొన్నారు.
2019-06-02 Read Moreఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు మద్ధతు సమీకరించుకోవడంకోసం 20వ శతాబ్దపు ఫాసిస్టుల తరహాలో వ్యవహరిస్తున్నారని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ వ్యాఖ్యానించారు. సోమవారం యుకె పర్యటనకు వస్తున్న ట్రంప్ కోసం రెడ్ కార్పెట్ పరచడం బ్రిటిష్ లక్షణం కాదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ‘ద గార్డియన్’కోసం ఆయనో వ్యాసం రాశారు. ప్రపంచానికి దాపురించిన ప్రమాదాల్లో ట్రంప్ ఒకరని ఖాన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర మితవాదం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
2019-06-02 Read Moreదరఖాస్తుల్లో మతం పేరు ప్రస్తావించడానికి ఇష్టపడని విద్యార్ధులకోసం పశ్చిమ బెంగాల్ లోని 50 కళాశాలలు ఆప్షన్లను ఇచ్చాయి. డిగ్రీ కోర్సుల ఆన్ లైన్ దరఖాస్తుల్లో ‘మతం’ అనే కాలమ్ లో ‘‘మానవత’’, ‘‘అవిశ్వాసి’’, ‘‘లౌకిక’’, ‘‘మతాతీత’’ అనే ఆప్షన్లను చేర్చాయి. కళాశాలల్లో చేరడానికి తమ మతాన్ని వెల్లడించాల్సిన అవసరం ఏముందని విద్యార్ధులు ప్రశ్నిస్తుండటంతో ఈ చర్య తీసుకున్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పుడు చాలా మంది తమకు మత విశ్వాసం లేదని దరఖాస్తుల్లో పేర్కొంటున్నట్టు ఒక అధికారి తెలిపారు.
2019-06-02 Read Moreబీహార్ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విస్తరించారు. ఆదివారం కొత్తగా 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సంకీర్ణ భాగస్వాములైన బీజేపీ, ఎల్.జె.పి. నుంచి ఒక్కరిని కూడా తీసుకోలేదు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో రెండోసారి ఏర్పడిన ఎన్.డి.ఎ. ప్రభుత్వంలో జెడి(యు)కు కేవలం ఒక్క మంత్రిపదవి ఆఫర్ చేయడంపై నితీష్ గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. భవిష్యత్తులో కూడా చేరబోమని నితీష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో బీజేపీకి స్థానమివ్వలేదు.
2019-06-02 Read Moreజాతీయ విద్యా విధానం 2019 ముసాయిదాలో ప్రతిపాదించిన ‘త్రిభాషా నియమం’పై తమిళనాట ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఇది హిందీని బలవంతంగా రుద్దడమేనని రాజకీయ నేతలు విమర్శించారు. కస్తూరి రంగన్ నాయకత్వంలోని కమిటీ ముసాయిదా పాలసీ నివేదికను నిన్న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. శనివారం ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ట్విట్టర్లో #StopHindiImposition హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అంశాల్లో నెంబర్ 1 అయింది. తమిళ నేతలతో ప్రజలు గొంతు కలిపారు.
2019-06-01 Read Moreవస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు మే నెలలోనూ లక్ష కోట్లు దాటాయి (రూ. 1,00,289 కోట్లు). అందులో కేంద్ర జి.ఎస్.టి. వాటా రూ. 17,811 కోట్లు కాగా, రాష్ట్ర జి.ఎస్.టి. రూ. 24,462 కోట్లు. దిగుమతి సుంకాలు రూ. 24,875 కోట్లు కలిపి ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. కింద మరో రూ. 49,891 కోట్లు వసూలయ్యాయి. సెస్ రూపంలో రూ. 8,125 కోట్లు (దిగుమతులపై రూ. 953 కోట్లు) వచ్చాయి. సెటిల్ మెంట్ల అనంతరం కేంద్రానికి రూ. 35,909 కోట్లు, రాష్ట్రాలకు రూ. 38,900 కోట్లు వస్తున్నాయి.
2019-06-01 Read Moreపాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య దాకా అన్ని స్థాయిలలోనూ సంస్కృతాన్ని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా విధానం 2019 డ్రాప్టు నివేదిక సూచించింది. 8 షెడ్యూలు భాషలతో సమానంగా సంస్కృతం ఆప్షన్ ఉండాలని ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ తన నివేదికను నిన్న కేంద్రానికి సమర్పించింది. ప్రాథమిక, మాథ్యమిక దశల్లోని సంస్కృతం సబ్జెక్టు పుస్తకాలను సరళమైన సంస్కృతంలో తిరగరాయాలని కమిటీ సూచించింది.
2019-06-01 Read More