విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం సమ్మతించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలను పునర్వ్యవస్థీకరించి కొత్త జోన్, డివిజన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా తెలియకుండా కసరత్తు చేసిన కేంద్ర ప్రభుత్వం, బుధవారమే ఓ ప్రకటన చేసింది.
2019-03-01పుల్వామా ఉగ్రవాది ఆత్మహుతి దాడిలో జైష్ ఎ మహ్మద్ పాత్ర, ఇతర కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఓ ఆధార పత్రాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపింది. రెండు వారాల క్రితం జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. పుల్వామాలో జెఇఎం పాత్రతోపాటు ఆ సంస్థ ఉగ్రవాద క్యాంపులు, పాకిస్తాన్ లోని ఆ సంస్థ నాయకత్వం, మిలిటెంట్ల రిక్రూట్ మెంట్ తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ ఆధార పత్రంలో ఉన్నట్టు సమాచారం. ఉగ్రవాదుల నియామకంకోసం గత రెండేళ్లలో జెఇఎం పాకిస్తాన్ లో చేపట్టిన ర్యాలీలు, మత సమ్మేళనాలకు సంబంధించి తొమ్మిది ఉదంతాలను ఆ పత్రంలో ప్రస్తావించారు.
2019-03-012018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ - డిసెంబర్)లో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితమైంది. గురువారం కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థ తాజా డేటాను విడుదల చేసింది. గత రెండు త్రైమాసికాల్లో ఇంతకు ముందు నమోదైన వృద్ధి రేటును తాజాగా సవరించారు. అప్పటి అంచనాల ప్రకారం 2018-19 వార్షిక జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం కాగా, తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 7 శాతానికి పరిమితం కానుంది. అంటే, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ వృద్ధి రేటు నిరాశాజనకంగానే ఉంటుందన్నమాట.
2019-03-01పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరంపై దాడికి ప్రతిగా ఆ దేశం భారత సైనిక స్థావరాలపై దాడికి వినియోగించిన యుద్ధ విమానాలు, మిసైళ్లు అమెరికన్ తయారీవేనని తేలింది. అమెరికన్ తయారీ ఎఫ్16 యుద్ధ విమానాలు, ఎఐఎం-120 అమ్రామ్ మిసైళ్లను పాకిస్తాన్ వినియోగించిందనడానికి తిరుగు లేని సాక్ష్యాన్ని భారత సైన్యం గురువారం వెల్లడించింది. అమ్రామ్ మిసైల్ శకలాన్ని త్రివిధ దళాల అధికారులు మీడియా ముందు ప్రదర్శించారు. పాకిస్తాన్ చేతిలో ఉన్న యుద్ధ విమానాల్లో... అధునాతన అమ్రామ్ మిసైళ్లను ప్రయోగించగలిగింది ఎఫ్16లు మాత్రమేనని అధికారులు తెలిపారు.
2019-03-01జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యార్థులకు ఉచిత క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, ఉచితంగానే ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైల్వేలలోనూ విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి వీలు కల్పిస్తామని పవన్ చెప్పారు. ఇందుకోసం అవసరమైతే రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం చెల్లిస్తుందని తెలిపారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ గురువారం కడపలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
2019-03-01పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చే ప్రయత్నంలో సరిహద్దులు దాటి అక్కడి సైన్యానికి పట్టుబడిన భారత పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ రేపే (శుక్రవారం) విడుదల కాబోతున్నారు. అభినందన్ విడుదలను పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఆ దేశ పార్లమెంటులో ప్రకటించారు. భారత పైలట్ విడుదలను ‘శాంతి సంకేతం’గా ఇమ్రాన్ అభివర్ణించారు. అభినందన్ నడిపిన ఐఎఎఫ్ యుద్ధ విమానం మిగ్ 21 బైసన్ బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే పైలట్ విడుదల కానుండటం అరుదైన విషయం.
2019-02-282019 ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని బీజేపీ నేతలు తనతో రెండు సంవత్సరాల క్రితమే చెప్పారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లాలో సభలు, సమావేశాల్లో మాట్లాడిన పవన్... యుద్ధం వస్తుందని రెండేళ్ళ క్రితమే చెప్పారంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తాము మాత్రమే దేశభక్తులం అన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. ముస్లింలు తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరం లేదని ఉద్ఘాటించారు.
2019-02-28పాకిస్తాన్ భూభాగంలోని జైషే మహ్మద్ స్థావరంపై భారత వైమానిక దళం జరిపిన దాడితో బీజేపీ రాజకీయంగా లబ్ది పొందుతుందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను ఎన్నుకోవడానికి, నరేంద్ర మోదీని తిరిగి ప్రధానమంత్రిని చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. కర్నాటకలోని 28 లోక్ సభ సీట్లలో బీజేపీ కనీసం 22 గెలుస్తుందని ఎడ్యూరప్ప అంచనా వేశారు.
2019-02-28జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో చేరారు. గురువారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోగల జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలసిన నార్నె వైసీపీ కండువా కప్పుకున్నారు. నార్నె కొద్ది రోజుల క్రితం ఓసారి జగన్మోహన్ రెడ్డిని కలసి చర్చించారు. అప్పుడే ఆయన చేరిక ఖాయమైంది. ఎన్టీఆర్ కు మామ కావడానికి ముందే నార్నె శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బంధువు. గతంలో నార్నె టీడీపీ తరపున చిలకలూరిపేట అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.
2019-02-28నిన్న తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా అమరావతిలో ఉండకుండా హైదరాబాద్ వెళ్లిపోయారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ‘నూతన గృహప్రవేశం చేసిన జగన్మోహన్ రెడ్డిగారికి శుభాకాంక్షలు. భ్రమరావతి అన్న మీరు నాలుగు సంవత్సరాల 10 నెలల తర్వాతైనా అమరావతికి వస్తే... ఇక్కడే ఉంటారనుకున్నా. కానీ, మీరు ఒక్క రోజు కూడా అమరావతిలో ఉండకుండా లోటస్ పాండ్ (హైదరాబాద్ ఇంటికి) వెళ్ళిపోయారు’ అని లోకేష్ గురువారం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
2019-02-28