క్షయ వ్యాధి కేసులు, మరణాల్లో ఇండియాలో ఆందోళనకర స్థాయిలో సంభవిస్తున్నాయి. 2018లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో ఇండియా వాటా 27 శాతం. తర్వాత స్థానాల్లో చైనా (9 శాతం), ఇండొనేషయా (8 శాతం), ఫిలిప్పీన్స్ (6 శాతం), పాకిస్తాన్ (6 శాతం), నైజీరియా (4 శాతం), బంగ్లాదేశ్ (4 శాతం), దక్షిణాఫ్రికా (3 శాతం) ఉన్నాయి. గత ఏడాది ఇండియాలో 26.90 లక్షల మందికి టీబీ సోకితే 4.49 లక్షల మంది మరణించారు. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనా కంటే ఇండియాలో మూడు రెట్లు టీబీ కేసులు నమోదు కావడం ఆందోళనకరం.
2019-10-18 Read Moreక్షయ వ్యాధి కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది మరణించారని, అందులో 2.51 లక్షల మంది హెచ్ఐవి సోకినవారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) తెలిపింది. మొత్తంగా 2018లో కోటి మంది టీబీ కారణంగా అనారోగ్యం పాలయ్యారని పేర్కొంది. ‘గ్లోబల్ టీబీ రిపోర్టు 2019’ని ఆ సంస్థ గురువారం విడుదల చేసింది. 57 లక్షల మంది పురుషులు, 32 లక్షల మంది స్త్రీలు, 11 లక్షల మంది పిల్లలకు టీబీ సోకిందని నివేదిక వివరించింది.
2019-10-18రష్యా తన అణు త్రయంలోని అన్ని భాగాలనూ తాజాగా పరీక్షించి చూసింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్షిపణులను జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్లు, భూమిపై నుండే లాంచర్ల నుంచి ప్రయోగించింది. ‘గ్రోమ్ 2019’లో భాగంగా ఈ విన్యాసాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వీక్షించారు. భూమిపైన లాంచర్ నుంచి ‘ఇస్కందర్’ వ్యూహాత్మక మిసైల్ వ్యవస్థను, జలాంతర్గామి నుంచి సినేవా దూరశ్రేణి క్షిపణులను, టియు95 దూరశ్రేణి బాంబర్ల నుంచి అణుసామర్ధ్యం ఉన్న క్రూయిజ్ క్షిపణులను ఈ సందర్భంగా రష్యా పరీక్షించింది.
2019-10-18 Read Moreజర్మనీలో జాతీయోన్మాదాన్ని రగిలించడంలో హిట్లర్ రాసిన పుస్తకం ‘‘మైన్ కంఫ్’’ పాత్ర పెద్దది. హిట్లర్ ఆత్మకథ-మేనిఫెస్టో 2 భాగాలుగా 1925, 1926లలో జర్మనీలో ప్రచురితమైంది. జాత్యహంకారంతో 60 లక్షల మంది యూదుల ఊచకోతకు, రెండో ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణానికి కారణమైంది ‘‘హిట్లర్ మేనిఫెస్టో’’. ఇప్పుడలాంటి పుస్తకం (విమర్శలతో సహా) ఫ్రెంచ్ అనువాదాన్ని ప్రచురించడానికి జరుగుతున్న ప్రయత్నం ఆ యూరోపియన్ దేశంలో కలకలం సృష్టించింది. ఆ మృగాన్ని మళ్లీ లేపొద్దని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
2019-10-18 Read Moreఉత్తర సిరియాలో కుర్దులకు వ్యతిరేకంగా చేపట్టిన మిలిటరీ దాడిని 120 గంటలపాటు నిలిపివేసేందుకు టర్కీ అంగీకరించిందని అమెరికా వెల్లడించింది. గురువారం అంకారా వెళ్ళిన అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చర్చల తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. కుర్దు దళాలు సిరియా సరిహద్దులనుంచి 20 మైళ్ళు లోపలికి వెళ్లడానికి ఈ ఐదు రోజుల సమయాన్ని వినియోగించుకోవాలని పెన్స్ సూచించారు. సిరియాలో టర్కీ సరిహద్దు పొడవునా ఆ 20 మైళ్ళ ప్రాంతంలో ‘‘రక్షిత జోన్’’ ఏర్పాటు చేయాలని టర్కీ తలపెట్టింది.
2019-10-17 Read Moreదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ భారీగా పతనమై నోట్ల రద్దు నాటి స్థితికి చేరినట్టు ఓ సర్వే నివేదిక తెలిపింది. పరిశ్రమల సంస్థలు ‘ఫిక్కి’, ‘నారెడ్కో), ప్రాపర్టీ కన్సల్టెంట్ ‘నైట్ ఫ్రాంక్’ సంయుక్తంగా చేసిన సర్వే ప్రకారం... జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండెక్స్ 42 పాయింట్లకు పడిపోయింది. గత రెండు త్రైమాసికాలలో ఇండెక్స్ 47, 62 పాయింట్ల వద్ద ఉంది. పాత రూ. 1000, 500 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో 2016 జూలై-సెప్టెంబరులో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ 41గా నమోదైంది.
2019-10-17 Read Moreదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం క్షీణించి 65,799 యూనిట్లకు చేరుకున్నాయి. వినియోగదారుల విశ్వాసం, డిమాండ్ తగ్గడంతో కొత్త ప్రారంభాలు ఏకంగా 45 శాతం పడిపోయినట్టు ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ ‘ప్రాప్‌టైగర్’ తెలిపింది. 2018 జూలై-సెప్టెంబర్ కాలంలో 88,078 యూనిట్లు అమ్ముడుపోగా 2019లో 65,799 యూనిట్లకు తగ్గాయని, కొత్త ప్రారంభాలు 61,679 యూనిట్ల నుంచి 33,883 యూనిట్లకు పడిపోయాయని ‘ప్రాప్ టైగర్’ నివేదిక తెలిపింది.
2019-10-17 Read Moreమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 2018-19 సంవత్సరానికి 4.29 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305.5 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ మంచి ఫలితాలను నమోదు చేయడంతో సీఈవో వార్షికాదాయం గత ఏడాది ఏకంగా 66 శాతం పెరిగింది. 52 సంవత్సరాల సత్య వేతనం రూ. 16.37 కోట్లు (2.3 మిలియన్ డాలర్లు) కాగా, మిగిలిన మొత్తం స్టాక్స్ ద్వారా వచ్చినట్టు ‘సిఎన్ఎన్ బిజినెస్’ తెలిపింది. సత్య నాదెళ్ళ స్టాక్ అవార్డు ద్వారా 2.96 కోట్ల డాలర్లు, ఈక్విటీయేతర ప్రోత్సాహకాల కింద 1.07 కోట్ల డాలర్లు సంపాదించారు.
2019-10-17 Read More‘నీతి ఆయోగ్ ఇన్నొవేషన్ ఇండెక్స్’లో కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ తరహాలో తొలిసారిగా రూపొందించిన ఇండియా ఇండెక్స్ నివేదికను ‘నీతి ఆయోగ్’ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ గురువారం విడుదల చేశారు. చత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్ ఆవిష్కరణల్లో చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్... కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, చండీగడ్, గోవా టాప్ 3లో ఉన్నాయి.
2019-10-17 Read Moreసమాచార హక్కు చట్టానికి ఇటీవల చేసిన సవరణలు తిరోగమన చర్యగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. ఆ సవరణలు చట్టం అమలును ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. సతార్క్ నాగరిక్ సంఘటన్ (ఎస్ఎన్ఎస్) అనే పౌర సంస్థ ఆర్టీఐ చట్టం వచ్చి 14 సంవత్సరాలు గడచిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లోకూర్ మాట్లాడారు. ఈ ఏడాది జూలైలో జరిగిన సవరణల ప్రకారం... కేంద్ర, రాష్ట్రాల సమాచార కమిషనర్ల పదవీ కాలం, జీతాలు, ఇతర నిబంధనలను నిర్దేశించే అధికారం కేంద్రానికి దఖలు పడింది.
2019-10-17 Read More