మేఘాలయ, జార్ఖండ్, మద్రాస్, మధ్యప్రదేశ్, పాట్నా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మహ్మద్ రఫీక్ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవిరంజన్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మిగిలిన ముగ్గురూ ప్రధాన న్యాయమూర్తుల హోదాలో ఉన్నవారినే బదిలీ చేశారు.
2019-10-17 Read Moreఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరమ్‌ను అక్టోబర్ 24 వరకు పోలీసు కస్టడీకి రిమాండ్ చేస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన కేసులో కూడా చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంకు 14 రోజుల రిమాండ్ విధించాలని ఇడి కోరింది.
2019-10-17 Read Moreతూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్యకు సంబంధించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)పైన కేసు నమోదైంది. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు ఎమ్మెల్యే సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు పెద్దాపురం డి.ఎస్.పి. శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రజ్యోతి తొండంగి మండల విలేకరి సత్యనారాయణ మంగళవారం రాత్రి తుని మండలం ఎస్. అన్నవరం వద్ద హత్యకు గురైన విషయం తెలిసిందే.
2019-10-17పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. పాట్నా హైకోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ రాకేశ్ కుమార్ న్యాయవ్యవస్థలో అవినీతి, అక్రమాలపై గత ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. హైకోర్టులో అవినీతి ‘ఓపెన్ సీక్రెట్’ అని, జడ్జిలకు న్యాయాన్ని అందించడంకంటే అధికారాలను అనుభవించడంపైనే శ్రద్ధ ఎక్కువని రాకేశ్ కుమార్ ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో బదిలీ కావడం గమనార్హం.
2019-10-17 Read Moreపంజాబ్‌కు చెందిన ఒక యాపిల్ వ్యాపారిని ఈ రోజు జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ లోని ట్రెంజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. ఇటీవలి కాలంలో కాశ్మీర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను చంపడం ఇది మూడోసారి. బాధితురాలు చరణ్ జీత్ సింగ్ తో పాటు వచ్చిన వ్యక్తికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ రోజే పుల్వామాలో ఛత్తీస్‌గడ్ కు చెందిన ఒక కార్మికుడిని ఉగ్రవాదులు చంపేశారు.
2019-10-16 Read Moreసెప్టెంబరు నాలుగు వారాలలో ఎనిమిది శాతం మార్కు కంటే తక్కువగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబర్లో మళ్లీ పెరిగింది. ఈ నెల మొదటి రెండు వారాల్లో నిరుద్యోగిత రేటు వరుసగా 8.4 శాతం, 8.6 శాతంగా నమోదైంది. ఈ పెరుగుదల గ్రామీణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. గ్రామీణ నిరుద్యోగం ఆగస్టులో 7.5 శాతం నుంచి సెప్టెంబర్‌లో 6 శాతానికి పడిపోయింది. అక్టోబర్ 6తో ముగిసిన వారానికి భారీగా పెరిగి 8.3 శాతం నమోదైంది. రెండో వారాంతానికి 8.2 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 9 శాతం పైగానే కొనసాగుతోంది.
2019-10-16 Read More2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతీయుల వ్యక్తిగత సంపద మొత్తం రూ. 799 లక్షల కోట్లకు చేరుకుంటుందని కార్వీ సంస్థ అంచనా వేసింది. ‘‘ఇండియా వెల్త్ రిపోర్టు 2019’’ని ఆ సంస్థ బుధవారం విడుదల చేసింది. వచ్చే నాలుగేళ్ళలో ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీగా మారితే ఇండియన్ల వ్యక్తిగత సంపద సగటున 13.2 శాతం పెరుగుతుందని కార్వీ అంచనా వేసింది. ప్రస్తుతం వ్యక్తిగత సంపద మొత్తం రూ. 430 లక్షల కోట్లుగా, ఈ ఏడాది వృద్ధి రేటు 9.6 శాతంగా పేర్కొంది.
2019-10-16 Read Moreభారతీయుల వ్యక్తిగత సంపద మొత్తం రూ. 430 లక్షల కోట్లకు చేరిందని ‘కార్వీ ప్రైవేట్ వెల్త్’ అంచనా వేసింది. సంస్థ ‘ఇండియా వెల్త్ రిపోర్టు 2019’ బుధవారం విడుదలైంది. దాని ప్రకారం 2019లో ఇండియన్ల వ్యక్తిగత సంపద మొత్తం 9.62 శాతం పెరిగింది. భౌతిక ఆస్తుల పెరుగుదల 7.59 శాతంగా ఉంటే, ఫైనాన్షియల్ ఆస్తులు 10.96 శాతం పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. రూ. 167 లక్షల కోట్ల భౌతిక సంపదలో రియల్ ఎస్టేట్ ఆస్తులు, బంగారం వాటా 92.57 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
2019-10-16 Read Moreప్రాంతీయ పార్టీలు కులతత్వం, అవినీతిలో మునిగి తేలుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత వైఎస్ (సుజనా) చౌదరి వ్యాఖ్యానించారు. ‘గాంధీ సంకల్ప యాత్ర’ పేరిట కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న చౌదరి, బుధవారం తన సొంత ప్రాంతమైన కంచికచర్లలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ‘‘బిజెపికి అవకాశం ఇవ్వండి. రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడండి. నేను పుట్టిన గడ్డ కంచికచెర్ల నుంచి పిలుపు ఇస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వండి’’ అని విన్నవించారు.
2019-10-16గత ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’కి అప్పనంగా భూమి కేటాయించిందన్న ఏపీ మంత్రివర్గం వ్యాఖ్యానాన్ని పత్రిక యాజమాన్యం ఖండించింది. విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమిని జగన్ మంత్రివర్గం రద్దు చేసిన కొద్దిసేపటికే పత్రిక యాజమాన్యం స్పందించింది. తమకు చంద్రబాబు ప్రభుత్వం భూకేటాయింపు చేయలేదని, 1986లో అప్పటి ప్రభుత్వం 1.5 ఎకరాలు కేటాయించగా తర్వాత రహదారి విస్తరణకోసం తిరిగి తీసుకున్నారని, దానికి పరిహారంగా మాత్రమే పరదేశిపాలెంలో 2017లో 1.5 ఎకరాలను కేటాయించారని వివరణ ఇచ్చింది.
2019-10-16 Read More