ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వ్యయాలకు సొమ్ము ఎలా వస్తుంది? 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బదలాయింపులతో కలిపి రూ. 1,78,697.42 కోట్లు రెవెన్యూ పద్దుల రూపంలో వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మిగిలిన మొత్తంలో మెజారిటీ.. అంటే రూ. 46,921 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకోవలసిందే. ఖర్చుల్లో రూ. 1,80,475.94 కోట్లు రెవెన్యూ వ్యయం కాగా అప్పులు, వడ్డీల చెల్లింపులకు రూ. 13,417 కోట్లు పోతుంది.
2019-07-12పాఠశాలలకు వెళ్ళే పిల్లల తల్లులకు రూ. 15 వేలు ఇచ్చే పథకం ‘అమ్మఒడి’కి, ఉన్నత విద్యలో ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం ‘విద్యాదీపం’కి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తన పేరే పెట్టుకున్నారు. ‘‘జగనన్న అమ్మ ఒడి’’గా నామకరణం చేసి ఆ పథకానికి రూ. 6,455.80 కోట్లు కేటాయించారు. ‘‘జగనన్న విద్యాదీపం’’కు రూ. 4,962.3 కోట్లు కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వివిధ పథకాలకు తన పేరు పెట్టుకోవడం విమర్శలకు తావిచ్చింది.
2019-07-12వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తొలి వార్షిక పద్దు (బడ్జెట్)ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ. 2,27,974.99 కోట్లుగా అంచనా వేశారు. 2018-19 బడ్జెట్ అంచనాల కంటే ఇది 19.32 శాతం అధికం కాగా, సవరించిన అంచనాలతో పోలిస్తే ఏకంగా 40.61 శాతం ఎక్కువ. 2018-19 బడ్జెట్ అంచనా వ్యయం రూ. 1,91,063.61 కోట్లు అయితే సవరించిన అంచనాల్లో రూ. 1,62,134.22 కోట్లకు తగ్గింది.
2019-07-12ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ పోటీలోనూ అనూహ్య విజయం! గురువారం ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఛేజింగ్ లో 32.1 ఓవర్లకే 226 పరుగులు సాధించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 8 ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్స్ మెన్ లో జాసన్ రాయ్ 65 బంతుల్లోనే 85 సాధించి జట్టు ఘన విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2019-07-11 Read Moreఅమెజాన్.కామ్ మార్కెట్ విలువ మరోసారి ట్రిలియన్ డాలర్లకు చేరువైంది. బుధవారం ఓ దశలో ట్రిలియన్ డాలర్లు దాటినా మార్కెట్లు ముగిసే సమయానికి $993 బిలియన్లుగా ఉంది. మే నెల చివరినుంచి ఇప్పటికి అమెజాన్ విలువ 128 బిలియన్ డాలర్లు పెరిగింది. అందులో సగం గత వారం రోజుల్లో పెరిగినదే..! గత సెప్టెంబర్లో ఓసారి ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఒక్కటే ట్రిలియన్ డాలర్ల క్లబ్ లో ఉంది. ఆ కంపెనీ ప్రస్తుత విలువ $1.061 ట్రిలియన్లు. అక్టోబర్లో $1.121 బిలియన్ దాటిన యాపిల్ ఇప్పడు $937 బిలియన్లుగా ఉంది.
2019-07-11 Read Moreతెలంగాణ సీఎం కేసీఆర్ ఔదార్యంతోనే ఏపీలో రాయలసీమ నుంచి క్రిష్ణా డెల్టా వరకు గోదావరి జలాలతో తడవనున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన జగన్ ‘‘కేసీఆర్ ఔదార్యం’’ అంటూ పదే పదే ప్రశంసించారు. ‘గోదావరి నీళ్లను శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు తీసుకెళ్లే పరిస్థితి ఉందంటే... గోదావరి నీళ్లు క్రిష్ణా ఆయకట్టుకు తీసుకెళ్ళే పరిస్థితి ఉదంటే.. అది ఆయన ఔదార్యమే’ అని జగన్ ఉద్ఘాటించారు. కేసీఆర్ ఔదార్యానికి సంతోషపడాల్సింది పోయి విమర్శిస్తున్నారని ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.
2019-07-11కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రారంభోత్సవానికి వెళ్ళారన్న టీడీపీ విమర్శపై శాసనసభలో గురువారం ఆయన స్పందించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక నేను వెళ్లాను. జగన్ పోయినా పోకపోయినా వాళ్లు బటన్ నొక్కేవాళ్ళు. నేను చంద్రబాబును అడుగుతున్నా.. ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే గాడిదలు కాశాడా?’’ అని జగన్ ఘాటుగా ప్రశ్నించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
2019-07-11తన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ‘ఎగతాళి చేస్తారా? గాడిదలు కాస్తున్నారా.. అని అడుగుతారా? మేం గాడిదలు కాసేవాళ్ళలా కనిపిస్తున్నామా? మీరేం మాట్లాడినా మేం పడాలా?’ అని సిఎంను ప్రశ్నించిన చంద్రబాబు ‘ఆయన అలా మాట్లాడుతుంటే మీరైనా ఖండించారా?’ అని స్పీకర్ తమ్మినేని సీతారాంను పలుమార్లు ఆగ్రహంగా ప్రశ్నించారు.
2019-07-11అవకాశాల్లో సగం కావాలని మహిళలంతా కోరుతుంటే.. అవినీతిలోనూ సగం కావాలంటున్నారు తాసీల్దారు వి. లావణ్య వంటి వారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో పని చేస్తున్న ఆమె ఇంట్లో బుధవారం ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ. 93.5 లక్షల నగదు, 40 తులాల బంగారం దొరికాయి. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత మొత్తంలో నగదు దొరకడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వీఆర్వో అనంతయ్యను ఆరా తీస్తే లావణ్య అవినీతి బాగోతం తెలిసింది.
2019-07-10ఎవరి ప్రభుత్వ పథకాలు వారికి ఉంటాయని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ‘సున్నా’ వడ్డీ రుణాలకు తాను రూపాయి కూడా ఇవ్వలేదన్న విమర్శపై అసెంబ్లీలో స్పందించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీల అమలు కోరుతూ జనం ఇంటివద్దకు వస్తే 144 సెక్షన్ విధించారని ఎద్దేవా చేశారు. ‘ఆత్మహత్య చేసుకున్న 1450 మంది రైతులకు పరిహారం ఇస్తామన్నారు. మంచిది. వైఎస్ హయాంలో 14,500 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారికి కూడా ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు.
2019-07-11