కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు ఉపసంహరించింది. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అన్న రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు ఆ విషయాన్ని నిర్ధారించినట్టుగా పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, తర్వాత రాహుల్ క్షమాపణ చెప్పారు. అయినా అప్పట్లో కోర్టు శాంతించలేదు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా ఆ క్షమాపణను గుర్తు చేస్తూ ఇక చర్యలు అవసరం లేదని అభిప్రాయపడింది. జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది.
2019-11-1436 రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. గతంలో తమ వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ 2018 డిసెంబరు14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విన్నవించారు. అయితే, ఆ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొట్టిపారేసింది. రాఫేల్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
2019-11-142019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) మరింత దారుణంగా ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) రీసెర్చ్ పేర్కొంది. ఆ కాలంలో వృద్ధి రేటు కేవలం 4.2 శాతంగా ఎస్.బి.ఐ. అంచనా వేసింది. తాము పరిగణించిన అంశాల్లో 33 ప్రధాన సూచీల వృద్ధి వేగం తొలి త్రైమాసికంలో 65 శాతంగా ఉంటే రెండో త్రైమాసికంలో అది 27 శాతానికి పడిపోయిందని రీసెర్చ్ సంస్థ తెలిపింది.
2019-11-12ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ నీలం సాహ్ని నియమితులయ్యారు. విభజన తర్వాత మిగిలిన రాష్ట్రానికి ఆమె తొలి మహిళా సీఎస్. మొన్నటిదాకా ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అక్కడ రిలీవ్ కాగానే రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆమె నియామక ఉత్తర్వులను జారీ చేసింది. ఎల్.వి. సుబ్రహ్మణ్యాన్ని తప్పించిన తర్వాత ప్రధాన కార్యదర్శి విధులను తాత్కాలికంగా నిర్వర్తిస్తున్న నీరబ్ కుమార్ నుంచి నీలం సాహ్ని గురువారం బాధ్యతలను స్వీకరించనున్నారు.
2019-11-13మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సిఫారసు చేసిన సమయానికే కేంద్ర కేబినెట్ కూడా ఈ అంశంపై తీర్మానం చేసింది. కేబినెట్ సిఫారసు ఫైల్ ను కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకంకోసం ఆయన కార్యాలయానికి పంపింది. ప్రభుత్వ ఏర్పాటుకోసం మూడో అతి పెద్ద పార్టీ ఎన్సీపీకి ఇచ్చిన గడువులో మరో 5 గంటలు మిగిలి ఉండగానే ఈ రెండు పరిణామాలు జరిగాయి. మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నిర్ధారించారు.
2019-11-12మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకోసం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాత్రి 8.30 వరకు గడువిచ్చిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, ఈలోగానే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. రాజ్యాంగంలోని 356 అధికరణం కింద రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు మంగళవారం నివేదిక పంపినట్టు మహారాష్ట్ర రాజ్ భవన్ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గవర్నర్ అభిప్రాయపడినట్టు ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ విఫలమయ్యాక శివసేనకు ఒకరోజు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
2019-11-12మరాఠా రాజకీయం సోమవారం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 రోజులు గడువు ఇవ్వాలన్న శివసేన విన్నపాన్ని తోసిపుచ్చిన గవర్నర్, మూడో అతి పెద్ద పార్టీ ఎన్సీపీని ఆహ్వానించారు. నిన్న బీజేపీ వెనక్కు తగ్గిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకోసం గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శివసేనను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ఒక్క రోజే గడువు ఇవ్వడంతో... సోమవారం సాయంత్రం శివసేన నేత అదిత్య థాకరే గవర్నర్ ను కలసి మరో 48 గంటలు సమయం కోరారు. దీనికి గవర్నర్ తిరస్కరించినట్టు థాకరే వెల్లడించారు.
2019-11-11ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం లేదని బీజేపీ గురువారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి తెలిపింది. దీంతో గవర్నర్ రెండో అతి పెద్ద పార్టీ శివసేనకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు సమయం ఇచ్చారు. ఎన్నికలకు ముందు కలసి పోటీ చేసిన ఈ రెండు పార్టీల మధ్య సిఎం సీటు విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సిఎం కుర్చీని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని శివసేన తెగేసి చెబితే బీజేపీ ససేమిరా అంది.
2019-11-10అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని నిర్మోహీ అఖాడా, సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా విరాజ్ మాన్ లకు సమంగా పంచాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా వ్యాజ్యానికి కాలం చెల్లిందన్న సుప్రీంకోర్టు, రాముడికి ప్రతీకగా కక్షిదారుల జాబితాలో ఉన్న ‘రామ్ లల్లా విరాజ్ మాన్’కు ఆ భూమి చెందుతుందని శనివారం తీర్పు చెప్పింది. మసీదు స్థలంపై తమ హక్కులకు సంబంధించి ముస్లింలు ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొంది.
2019-11-09అయోధ్యలో వివాదాస్పద స్థలానికి రాముడే యజమాని అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకు సాక్ష్యాలుగా ఆ స్థలానికి సమీపంలోనే ఉన్న రామ్ చబుత్ర, సీతా రసోయి తదితర కట్టడాలను పేర్కొంది. వివాదాస్పద స్థలంలోనే రాముడు జన్మించాడన్నది హిందువుల విశ్వాసమని, ముస్లింలు కూడా ఆ మాటే అంటారని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఆధారాలతోనే తాము (వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించాలని) తీర్పు ఇస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
2019-11-09