కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఉద్యమించిన రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయని కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దన్వే ఆరోపించారు. రైతుల ఆందోళన విదేశాల కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)లపై ముస్లింలను తప్పుదారి పట్టించారని, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు కొత్త చట్టాలతో నష్టం అంటూ రైతులకు చెబుతున్నారని మంత్రి ఆరోపించారు. కేంద్ర మంత్రి మాటలపై శివసేన మండిపడింది. బిజెపి నేతలు స్పృహలో లేరని వ్యాఖ్యానించింది.
2020-12-103 వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ప్రతిపక్ష బృందం ఒకటి బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసింది. ఈ బృందంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్.సి.పి. అధినేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, డిఎంకె నాయకుడు టికెఎస్ ఎళంగోవన్ ఉన్నారు. లక్షల మంది రైతుల ఆందోళనకు దారి తీసిన కేంద్ర చట్టాలను రద్దు చేయక తప్పదని వారు స్పష్టం చేశారు. పార్లమెంటులో చర్చ లేకుండా, ప్రతిపక్షాలతో గానీ రైతులతో గానీ చర్చించకుండా చట్టాలు చేయడం రైతులను అవమానించడమేనని పేర్కొన్నారు.
2020-12-093 వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ రాతపూర్వక ప్రతిపాదనలను తిరస్కరించిన తర్వాత.. ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 14న దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ - జైపూర్, ఢిల్లీ - ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలను 12వ తేదీలోగా మూసివేస్తామని ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించకుంటే దేశ రాజధానిలో ప్రవేశించే మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేస్తామని హెచ్చరించారు.
2020-12-09కోవిడ్19 నివారణ కోసమని తాగునీటిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ అధికంగా వేయడమే ఏలూరు ఆరోగ్య విపత్తుకు కారణమై ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది. హఠాత్తుగా మూర్ఛ లక్షణాలతో వందల మంది ఆసుపత్రులకు పోటెత్తిన సంగతి తెలిసిందే. కోవిడ్19 నివారణ చర్యలే నీటి కాలుష్యానికి కారణంగా ఆరోగ్య నిపుణులు భావిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారని ఆ కథనం పేర్కొంది. నీటి కాలుష్య కారకంపై దృష్టి సారించాలని కేంద్ర నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
2020-12-09ఉధృతంగా జరుగుతున్న రైతు ఉద్యమాన్ని బలహీనపరిచే ఎత్తుగడల్లో భాగంగా నిన్న కొన్ని సంఘాలనే చర్చలకు పిలిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈరోజు రైతులకు ఆమోదయోగ్యం కాని ప్రతిపాదనలను రాతపూర్వకంగా పంపారు. ఎం.ఎస్.పి.పై ‘రాతపూర్వకంగా హామీ ఇస్తాం’ అన్నది వాటిలో ఒకటి. బుధవారం ఈ ప్రతిపాదనలు అందిన కొద్ది గంటల్లోనే.. వాటిని తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. ఆ 3 చట్టాలనూ రద్దు చేయవలసిందేనని 31 రైతు సంఘాల సమావేశం తర్వాత నేతలు స్పష్టం చేశారు.
2020-12-09రేపు కేంద్ర మంత్రుల బృందం జరపాల్సిన చర్చలను కాదని మరీ రైతు సంఘాల నేతలను తనవద్దకు ఆహ్వానించిన హోం మంత్రి అమిత్ షా కూడా నిర్ధిష్ట హామీ ఏమీ ఇవ్వలేదు. ఆయనతో మంగళవారం రాత్రి రైతు నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలు మూడింటినీ రద్దు చేయాల్సిందేనన్న తమ డిమాండ్ ను రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. కొంతమందైతే.. రేపు మంత్రుల బృందంతో జరిగే చర్చలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయితే, మరికొందరు కేంద్రం ప్రతిపాదించే సవరణలను బట్టి తర్వాత కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
2020-12-09కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) నాయకుడు హన్నన్ మొల్లా వెల్లడించారు. మంగళవారం రాత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు చర్చలకు హాజరైన నాయకుల్లో మొల్లా ఒకరు. కేంద్ర ప్రభుత్వం రేపు ఉదయం తన ప్రతిపాదనలను రాతపూర్వకంగా రైతు సంఘాలకు పంపుతుందని అమిత్ షా చెప్పినట్టు భేటీ అనంతరం హన్నన్ మొల్లా విలేకరులకు తెలిపారు. రైతులకు నష్టదాయకమైన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే ఉద్దేశం కేంద్రానికి లేదని మొల్లా పేర్కొన్నారు.
2020-12-08కేంద్ర మంత్రుల బృందంతో రైతు సంఘాల ప్రతినిధులు రేపు (బుధవారం) జరపాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి నేతృత్వంలో జరగాల్సిన చర్చలకు ముందే.. రైతు సంఘాల ప్రతినిధులతో హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కేంద్రం తెచ్చిన 3 కొత్త చట్టాలనూ రద్దు చేయవలసిందేనని రైతు ప్రతినిధులు అమిత్ షాను కూడా డిమాండ్ చేశారు. అయితే, ప్రభుత్వం చేయదలచిన సవరణలను రేపు రాతపూర్వకంగా రైతుప్రతినిధులకు పంపుతామని అమిత్ షా చెప్పారు. దీంతో చర్చలు వాయిదా పడ్డాయి.
2020-12-08కోవిడ్ నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన 6 నెలల మారటోరియం కాలానికి అన్ని రకాల రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే రూ. 6 లక్షల కోట్లు కోల్పోవలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మొత్తాన్ని బ్యాంకులు భరించవలసి వస్తుందని, దీంతో వాటి నికర విలువలో గణనీయమైన భాగం తుడిచిపెట్టుకుపోతుందని, వాటి మనుగడే ప్రశ్నార్ధకమవుతుందని కేంద్రం పేర్కొంది. వడ్డీ మాఫీ కోరుతూ వివిధ రంగాలకు చెందిన సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది.
2020-12-08 Read Moreపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ‘స్టే’ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని కొట్టివేసింది. ఏప్రిల్ లో వాయిదా వేసిన ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందని ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికల తేదీలను నిర్ణయించాలంటూ చట్టానికి సవరణల కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రభుత్వానికి ఆ ముచ్చటా తీరాల్సి ఉంది.
2020-12-08