2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కంటే తమ పార్టీ రెండు సీట్లు అదనంగా తెచ్చుకోలేకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ సవాలు చేశారు. ఒక టీవీ ఛానల్ చర్చలో ఎదురైన ఈ సవాలుకు టీడీపీ నేత లింగారెడ్డి ప్రతి సవాలు విసిరారు. టీడీపీ తెచ్చుకునే సీట్లలో బీజేపీ నాలుగో వంతు సంపాదిస్తే చాలు..తాను రాజకీయ సన్యాసం చేస్తానని లింగారెడ్డి చెప్పారు. తమ సవాలుకు కట్టుబడి ఉంటామని ఇద్దరూ పునరుద్ఘాటించారు.
2019-06-14ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షా కేంద్ర మంత్రి కాక ముందు బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడే ఓసారి జగన్ కలిశారు. అయితే, ఇప్పుడు అధికారికంగా కలసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర విభజననాటి హామీల అమలు అంశంపై జగన్ చర్చించినట్టు చెబుతున్నారు.
2019-06-14పోటీ జరగక ముందే ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించేదే ఇండియా- పాకిస్తాన్ క్రికెట్ ఆట. 2019 ప్రపంచ కప్ క్రికెట్లో అలాంటి సన్నివేశం దగ్గరకు వచ్చింది. ఈ రెండు దేశాల పోటీ ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు మాంచెస్టర్ వేదికగా జరగబోతోంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఇండియా తొలి నుంచి మూడో స్థానంలో ఉండగా పాకిస్తాన్ చివరి నుంచి మూడో స్థానం (8)లో ఉంది. పలు పోటీల రద్దుకు కారణమైన యుకె వాతావరణం దాయాదుల అసాధారణ సంగ్రామానికి సహకరిస్తుందో లేదో చూడాలి.
2019-06-14విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో అసెంబ్లీ తొలి సమావేశాల్లో శుక్రవారంనాటి గవర్నర్ ప్రసంగం గత ఐదేళ్ల ఉపన్యాసాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అప్పట్లో (తన) ప్రభుత్వ విజయాలను కొనియాడిన ఇదే గవర్నర్ నరసింహన్, ఇప్పుడు గత ఐదేళ్ల (తన ప్రభుత్వ) పాలనను విమర్శిస్తూ ప్రసంగించారు. తన (ఇప్పటి) ప్రభుత్వానికి ఖాళీ ఖజానా సంక్రమించిందని, గత ఐదేళ్ళలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శిస్తూ.. ఐదు కోట్ల మంది ఆశలతో నూతన ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.
2019-06-14‘‘పార్టీ 37 ఏళ్ళ చరిత్రలో ఐదుసార్లు గెలిచాం. నాలుగుసార్లు ఓడిపోయాం. గెలిచినప్పుడు ఆనందం ఓడినప్పుడు ఆవేదన సహజం. అయినా ముందుకుపోవలసిన అవసరం ఉంది. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం సరికాదు’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలకు ఉద్భోదించారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలపై విశ్లేషణకోసం ఆయన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులతో శుక్రవారం విజయవాడలో సమావేశమయ్యారు.
2019-06-14ఇండియాకు ప్రత్యేక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే ప్రణాళిక ఉన్నట్టు ‘ఇస్రో’ ఛైర్మన్ శివన్ శుక్రవారం వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు... 2022 ఆగస్టులో చేపట్టున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘‘గగన్ యాన్’’ తర్వాత ఖరారవుతాయని ఆయన చెప్పారు. 20 టన్నుల బరువుతో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్ష కేంద్ర నిర్మాణం ‘‘గగన్ యాన్’’ మిషన్ తర్వాత 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుందని, అక్కడ వ్యోమగాములు 15 నుంచి 20 రోజులు గడపవచ్చని శివన్ వివరించారు.
2019-06-13 Read Moreఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఎంపిక చేసిన సీతారాం పేరును అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం శాసనసభలో ప్రతిపాదించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అందుకు ఆమోదం తెలపడంతో తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభా నాయకుడు జగన్, తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తదితరులు వెంటరాగా సీతారాం సభాపతి స్థానంవద్దకు చేరారు.
2019-06-13ఇంటర్నెట్ వినియోగదారుల్లో 86 శాతం మంది ఫేక్ న్యూస్ బారిన పడుతున్నారని తాజా గ్లోబల్ సర్వేలో తేలింది. అందులో సింహభాగం ‘ఫేస్ బుక్’దేనని ‘ఇప్సోస్’ సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం... ఫేక్ న్యూస్ వ్యాప్తిలో అమెరికాదే ప్రథమ స్థానం. తర్వాత రష్యా, చైనా ఉన్నాయి. సర్వేకోసం 25 దేశాల్లో 25,000 మంది ఇంటర్నెట్ వినియోగదారుల అభిప్రాయాలను ‘ఇప్సోస్’ తీసుకుంది. తప్పుడు వార్తల వ్యాప్తిలో ‘ఫేస్ బుక్’ తర్వాత స్థానాల్లో యూ ట్యూబ్, బ్లాగులు, ట్విట్టర్ ఉన్నాయి.
2019-06-12 Read Moreశ్రీలంక ఈస్టర్ ఉగ్రవాద దాడుల సూత్రధారి జహ్రాన్ హషీమ్ ఫేస్ బుక్ స్నేహితుడిని, మరో ఐదుగురిని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బుధవారం కోయంబత్తూరులో అదుపులోకి తీసుకుంది. మహ్మద్ అజరుద్ధీన్ (32), అతని స్నేహితులు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దాడులకోసం యువతను రిక్రూట్ చేసే లక్ష్యంతో ‘ఇస్లామిక్ స్టేట్’ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని ఎన్ఐఎ పేర్కొంది. అజరుద్ధీన్ ‘‘ఖిలాఫా జిఎఫ్ఎక్స్’’ అనే ఫేస్ బుక్ పేజీని నిర్వహిస్తున్నాడని తెలిపింది.
2019-06-12ఇటీవల ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త శాసనసభ మొదటి సెషన్ ప్రారంభం రోజున ముందుగా సీనియర్ సభ్యుడు శంబంగి చినవెంకట అప్పలనాయుడు ప్రొటెం స్పీకర్ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సహా మిగిలిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
2019-06-12