శాసన మండలి లోని పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు యుటిఎఫ్ నేత ఐ. వెంకటేశ్వరరావుకు జే కొట్టాయి. పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థిగా బరిలోకి దిగిన ఐ.వి. అసాధారణ స్థాయిలో 96,670 ఓట్లు సాధించి తొలి ప్రాధాన్యతా ఓట్లతోనే అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఐ.వి. సమీప ప్రత్యర్థి ఎన్. శేషారెడ్డికి కేవలం 38,415 ఓట్లు వచ్చాయి. దీంతో ఐ.వి.కి 58,255 ఓట్ల మెజారిటీ లభించింది.
2019-03-28కృష్ణా - గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అభ్యర్థి కె.ఎస్. లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో సగానికి (75 వేలకు) పైగా పొందిన లక్ష్మణరావుకు ప్రత్యర్థులెవరూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. రెండో స్థానంలో నిలిచిన నూతలపాటి అంజయ్యకు సుమారు 11 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. చివరి రౌండ్ లెక్కింపు మిగిలి ఉండగానే తొలి ప్రాధాన్యతా ఓట్లతోనే లక్ష్మణరావు విజయం సాధించడం అరుదైన విషయం.
2019-03-28మార్చి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని ప్రయోగించినందుకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ)ను అభినందించిన రాహుల్ గాంధీ, అదే ట్వీట్ లో మోదీకి మాత్రం రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
2019-03-27 Read Moreయాంటీ శాటిలైట్ మిసైల్ టెక్నాలజీ (ASAT) అభివృద్ధికోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ) గత దశాబ్ద కాలంగా కృషి చేస్తోంది. మొదటిగా ఈ విషయాన్ని 2010 జనవరిలో తిరువనంతపురంలో జరిగిన 97వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో అప్పటి డి.ఆర్.డి.ఒ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేసే ఆయుధాన్ని తయారు చేస్తున్నామని ఆయన అప్పుడే చెప్పారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 10న అప్పటి డి.ఆర్.డి.ఒ డైరెక్టర్ జనరల్, భారత రక్షణ శాఖ సలహాదారు వి.కె. సారస్వత్ ‘‘యాంటీ శాటిలైట్ వెపన్’’కు అవసరమైన అన్ని హంగులూ ఇండియా వద్ద ఉన్నాయని ప్రకటించారు.
2019-03-27ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. జాతీయ రాజధానిలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వంవల్లనే ‘‘ఆప్’’ పుట్టిందని కేజ్రీవాల్ చెప్పారు. ‘పూర్తి రాష్ట్ర హోదా లేని ఢిల్లీని షీలా దీక్షిత్ పాలించినప్పుడు మీరెందుకు పాలించలేరు’ అని తనను కొంతమంది అడిగారన్న కేజ్రీవాల్... ఆమె బాగా పాలిస్తే ప్రజలు ‘‘ఆప్’’కు ఎందుకు ఓట్లేశారని ఎదురు ప్రశ్నించారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సవ్యంగా ఉంటే ‘‘ఆప్’’ పుట్టేదే కాదన్నారు.
2019-03-27 Read Moreదేశంలోని 5 కోట్ల కుటుంబాలకు ‘‘కనీస ఆదాయ’’ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బుధవారం చెప్పారు. 25 కోట్ల మందికి వర్తించేలా 5 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల చొప్పున నేరుగా బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తామని కొద్ది రోజుల క్రితం రాహుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి అవసరమైన నిధుల మొత్తం ఇండియా జీడీపీలో 1.8 శాతం వరకు ఉండవచ్చని చిదంబరం అభిప్రాయపడ్డారు. 5 కోట్ల కుటుంబాలను దశలవారీగా కవర్ చేస్తామని ఆయన చెప్పారు.
2019-03-27 Read Moreఅంతరిక్ష పరిజ్ఞానంపై అగ్రదేశాలతో పోటీ పడుతున్న ఇండియా తాజాగా మరో అసాధారణ పాఠవాన్ని సొంతం చేసుకుంది. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా కూల్చివేశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్ పేరు ‘‘మిషన్ శక్తి’’. ఇప్పటివరకు ఉపగ్రహాలను కూల్చివేసే మిసైల్ సామర్ధ్యం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. భారత రక్షణ సంస్థ డి.ఆర్.డి.ఒ. గత కొద్ది సంవత్సరాలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు చేస్తోంది.
2019-03-27 Read Moreకృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పి.డి.ఎఫ్. అభ్యర్ధి కె.ఎస్. లక్ష్మణరావు భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. బుధవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్ష్మణరావు 23,592 ఓట్లు సాధించారు. ఆయన సమీపంలో ప్రత్యర్ధి అంటూ ఎవరూ లేకుండా పోయారు. నాలుగు రౌండ్లలో 42 వేల ఓట్లు లెక్కిస్తే... రెండో స్థానంలో ఉన్న అంజయ్యకు కేవలం 2,700 ఓట్లు లభించాయి. కొల్లి నాగేశ్వరరావుకు 2465 ఓట్లు, కృష్ణప్రసన్నకు 2328 ఓట్లు, మోహనరావుకు 1843 ఓట్లు వచ్చాయి.
2019-03-27వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా కప్పిపుచ్చడంకోసమే కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. వివేకా హత్యలో దాగివున్న రహస్యాలను వెలికి తీసేందుకు ఎస్పీ ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. సిట్ దర్యాప్తును వాయిదా వేయించాలని, థర్డ్ పార్టీ విచారణ చేయించాలని వై.ఎస్.ఆర్.సి. హైకోర్టులో వేయించిన కేసు కూడా... ఎన్నికల సమయంలో నిజాలను బయటకు రానివ్వకూడదన్న కుట్రలో భాగమని టీడీపీ నేతలు ఆరోపించారు.
2019-03-27ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పాత్రా లేని ఇంటెలిజెన్స్ డీజీ ఎ.బి. వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడం వెనుక వై.ఎస్.ఆర్.సి.,బీజేపీల కుట్ర దాగి ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మంగళవారం అర్దరాత్రి దాటాక టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, జూపూడి ప్రభాకరరావు ఈ అంశంపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే ప్రధాన బాధ్యత ఇంటెలిజెన్స్ డీజీపైన ఉందని, వై.ఎస్.ఆర్.సి. నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కూడా జరపకుండా ఏకపక్షంగా ఆయనను బదిలీ చేయడం రాజకీయ ప్రేరేపిత కుట్రేనని టీడీపీ నేతలు దుయ్యబట్టారు.
2019-03-27