2015 అణు ఒప్పందంలోని చివరి కట్టుబాటును కూడా ఇరాన్ వదిలేసింది. ఎలాంటి పరిమితులూ లేకుండా యురేనియం శుద్ధి చేపట్టనున్నట్టు ఆదివారం ప్రకటించింది. అయితే, అమెరికా ఆంక్షలను ఎత్తివేస్తే మళ్లీ ఆ చట్రంలోకి రావడానికి సిద్ధమని కూడా పేర్కొంది. 2015లో అమెరికా అధ్యక్షుడు ఒబామా చొరవతో అణు ఒప్పందానికి ఇరాన్ సమ్మతించింది. అయితే, ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఈ ఒప్పందం నుంచి అమెరికా 2018 మే నెలలో తప్పుకుంది.
2020-01-06‘ట్యూనా కింగ్’ అని పిలుచుకునే జపనీస్ వ్యాపారవేత్త తాజాగా ఓ ‘బ్లూఫిన్ ట్యూనా’ చేపకు 1.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 కోట్లు) చెల్లించారు. ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇది రెండో అత్యధిక ధర. కియోషి కిమురా అనే ఆ వ్యాపారవేత్త సుషి రెస్టారెంట్లను నడిపిస్తున్నారు. ఈ ఆదివారం టోక్యోలోని ప్రధాన ఫిష్ మార్కెట్ ‘టోయోసు’లో 276 కేజీల బరువున్న తాజా బ్లూఫిన్ ట్యూనాను ఆక్షన్లో సొంతం చేసుకున్నారు.
2020-01-05 Read Moreఅమెరికా సేనల బహిష్కరణకోసం ఇరాక్ పార్లమెంటు తీర్మానం చేయడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్ళు మమ్మల్ని వెళ్లిపొమ్మంటే, అది స్నేహపూర్వకంగా జరగకపోతే, వాళ్ళపై మునుపెన్నడూ చూడని ఆంక్షలు విధిస్తాం. వాటి ముందు ఇరాన్ పై విధించిన ఆంక్షలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి’’ అని ట్రంప్ హెచ్చరించారు. తాము ఇరాక్ దేశంలో చాలా డబ్బు వెచ్చించామని, వాళ్లు ఆ మొత్తం తిరిగి చెల్లించకుండా వెళ్లిపోయేది లేదని స్పష్టం చేశారు.
2020-01-06అమెరికా (విదేశీ) దళాలను బహిష్కరించడానికి అనుకూలంగా ఇరాక్ పార్లమెంటు ఓటు వేసింది. ఆమేరకు తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. అమెరికా సేనలకు గతంలో తమ ప్రభుత్వమే పంపిన ఆహ్వానాన్ని ఉపసంహరించాలని పార్లమెంటు సిఫారసు చేసింది. ఇరాన్ మిలిటరీ జనరల్‌ను తమ గడ్డపై హతమార్చడంతో ఇరాక్ నేతలు కూడా మండిపడుతున్నారు. అమెరికా దళాల బహిష్కరణకు ఇరాన్ అనుకూల పార్టీలు పట్టుబట్టాయి.
2020-01-06 Read Moreదేశ రాజధానిలో ఉన్న ప్రతిష్ఠాత్మక జె.ఎన్.యు.లో విద్యార్ధులు, అధ్యాపకులపై ఎబివిపి చేసిన దాడిని దేశవ్యాప్తంగా విద్యార్ధి లోకం ఖండించింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో విద్యార్ధుల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఐఐటి బాంబే నుంచి బెంగళూరు నేషనల్ లా స్కూలు వరకు ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీల విద్యార్ధులు స్పందించారు. జె.ఎన్.యు. క్యాంపస్ లోనే కాకుండా దేశంలోని అనేక చోట్ల అర్ధరాత్రి తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి.
2020-01-06జె.ఎన్.యు.పై దాడితో విద్యార్ధులు బెదిరిపోలేదు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి మిగిలినవారు నిరసనకు దిగారు. యూనివర్శిటీ మొత్తం ర్యాలీ నిర్వహించి ఉత్తర ద్వారం వద్దకు చేరారు. అక్కడ అర్దరాత్రి తర్వాత కూడా నిరసన కొనసాగింది. వర్శిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు తీవ్రంగా గాయపడటంతో... ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ర్యాలీకి నాయకత్వం వహించారు. ‘‘మేం గాయపడ్డాం. కానీ ఓడిపోం. మేం జె.ఎన్.యు’’ అని సంఘ నేతలు ఉద్ఘాటించారు.
2020-01-06ఖాసిం సులేమానీ హత్యపై చర్చించేందుకు ఇరాన్ పార్లమెంటు ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఎంపీలు ముక్త కంఠంతో ‘అమెరికాకు మరణం’ అంటూ నినదించారు. సుమారు 290 మంది ఎంపీలు ఛాంబర్ మధ్యలో నిల్చొని నినాదాలు చేశారు. కొంతమంది పిడికిళ్ళు బిగించి అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మిస్టర్ ట్రంప్... ఇరాన్ జాతి స్వరం ఇది. విను’’ అని పార్లమెంటు స్పీకర్ అలి లరిజాని వ్యాఖ్యానించారు.
2020-01-06ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఆదివారం రాత్రి భారీ పేలుళ్ళు జరిగాయి. అమెరికన్ ఎంబసీ సహా పలు దేశాల దౌత్య కార్యాలయాలు కొలువై ఉన్న ‘గ్రీన్ జోన్’పైకి రాకెట్లు దూసుకొచ్చాయి. వెనువెంటనే పెద్దగా సైరన్ మోతలు నగరమంతా వినిపించాయి. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ సులేమానీని అమెరికా హతమార్చిన తర్వాత ‘గ్రీన్ జోన్’పైకి రాకెట్లు పడటం ఇది రెండోసారి. శనివారం ఉత్తర బాగ్దాద్ లోని అమెరికా మిలిటరీ స్థావరంపై కూడా దాడి జరిగింది.
2020-01-06 Read Moreకెన్యాలోని అమెరికా సైనిక స్థావరంపై ఆదివారం ‘అల్ షబాబ్’ తీవ్రవాద సంస్థ దాడి చేసింది. అల్ ఖాయిదాకు అనుబంధంగా చెబుతున్న ఈ సంస్థ కెన్యాలోని మండా బే ఏరియాలో ‘కెన్యా డిఫెన్స్ ఫోర్స్ మిలిటరీ బేస్’ను లక్ష్యంగా చేసుకుంది. కెన్యా తీరంలో ఉన్న ఈ నావికాదళ కేంద్రాన్ని ‘క్యాంప్ సింబా’గా వ్యవహరిస్తుంటారు. ఈ దాడిలో ఒక అమెరికా సైనికుడు, ఇద్దరు కాంట్రాక్టర్లు మరణించారు. మరో ఇద్దరు అమెరికన్ సైనికులు గాయపడ్డారు.
2020-01-06కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకొని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లోకి ప్రవేశిస్తున్న కొంతమంది దుండగుల ఫొటోలు సామాజిక మాథ్యమాల్లోకి వచ్చాయి. ఆ దుండగులు జీన్స్ ప్యాంట్లు, జాకెట్లు ధరించి ఉన్నారు. అప్పటికి ఇంకా మాస్కులు వేసుకోలేదు. క్యాంపస్ లోని బస్టాపు వద్ద నడుచుకుంటూ వెళ్లి ఎడమవైపు తిరిగి లోపలికి వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సుమారు 6.45 సమయంలో వారు కెమెరాకు చిక్కారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే దాడి జరిగింది.
2020-01-06 Read More